unruly behaviour
-
సిబ్బందితో ప్యాసింజర్ గొడవ.. విమానం గాల్లో ఉండగానే వెనక్కి..
న్యూఢిల్లీ: సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఫ్లయిట్ గాల్లో ఉండగా సిబ్బందితో గొడవకు దిగాడు. వాళ్లతో ఫైట్ చేశాడు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు పైలట్. తిరిగి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. అనంతరం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి ప్రయాణానికి అంతరాయం కల్గించిన ప్యాసింజర్‌ను కిందకు దింపేశారు. అతనిపై ఫిర్యాదు చేసి విమానాశ్రయంలోని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం మళ్లీ లండన్ బయల్దేరి వెళ్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా నిర్వాహకులు అధికారకంగా స్పందించాల్సి ఉంది. ప్యాసింజర్ సిబ్బందితో ఎందుకు గొడవపడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలి కాలంలో కొందరు ప్రయాణికులు విమానాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఓ ప్యాసింజర్ తప్పతాగి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో ఓ ప్యాసింజర్ విమానంలో స్మోకింగ్ చేసి హల్ చల్ చేశాడు. మరో ఘటనలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లతో గొడవకు దిగి నానా హంగామా చేశాడు. చదవండి: Corona Virus: జాగ్రత్త! కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్.. -
ప్రయాణికుడి ఓవరాక్షన్.. ఈడ్చి పడేసిన పైలట్
వైరల్: విమానంలో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం, వికృత చేష్టలకు పాల్పడుతున్న నానాటికీ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజా ఎయిర్ ఇండియా ఘటనలు మాత్రమే కాదు.. ప్రపంచంలో దాదాపు ప్రతీ మూలా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అలాంటి ప్రయాణికుల పట్ల వాళ్ల కఠినంగా వ్యవహరించాలని భారత విమానయాన నియంత్రణ విభాగం డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘వర్జిన్ ఆస్ట్రేలియా’ విమానంలో జరిగిన ఘటన వైరల్‌గా మారింది. బుధవారం టౌన్స్‌విల్లే-సిడ్నీ విమానం టౌన్స్‌విల్లే నుంచి టేకాఫ్ అయ్యాక.. ఓ ప్యాసింజర్ ఎందుకనో సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో పైలట్ జోక్యం చేసుకోగా.. ఆ వ్యక్తి పైలట్‌ను సైతం తులనాడాడు. కాలర్ పట్టుకుని అడ్డమైన బూతులు తిట్టాడు. దీంతో.. పైలట్‌కు చిర్రెత్తుకొచ్చింది. నడువు.. అంటూ అతన్ని ఈడ్చుకుంటూ ఎగ్జిట్ డోర్ దాకా తీసుకెళ్లాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించాలని సిబ్బందికి పైలట్ సూచించడంతో ఆ వ్యక్తి గమ్మున అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రయాణికుడు అలా గొడవ ఎందుకు పడ్డాడన్నది తెలియరాలేదు. అలాగే అతనిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వర్జిన్ ఆస్ట్రేలియా సైతం ప్రకటించలేదు. An unruly passenger was kicked out from the aircraft by Virgin Australia's pilot on flight between Townsville to Sydney. 🎥 ©Ben Mckay/TikTok#VirginAustralia #Australia #aviation #AvGeek #avgeeks #flights #Travel #traveler #pilotlife #pilot pic.twitter.com/vBtbmV7tKe — FlightMode (@FlightModeblog) January 5, 2023 -
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వికృత చేష్టలు.. సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సాక్షిగా తొలిరోజే టీడీపీ సభ్యులు వికృత చేష్టలతో నీచ సంప్రదాయానికి తెరలేపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి అడ్డుపడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో పాటు, గవర్నర్ ప్రసంగ పత్రులను చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చదవండి: ప్రజాస్వామ్యంపై టీడీపీకి కొంచెం కూడా గౌరవం లేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గవర్నర్‌ను దూషిస్తూ, ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి ఆయనపై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు. -
నో ఫ్లై రూల్స్: మహిళపై తొలి కేసు
సాక్షి, ముంబై: విమానయాన రంగంలో తాజాగా అమల్లోకి వచ్చిన నో ఫ్లై నియమాల ప్రకారం ఓ మహిళపై తొలి కేసు నమోదయింది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆమెపై దర్యాప్తు మొదలైంది. జైపూర్-ముంబై ఇండిగో ప్రయాణించిన ఆర్ థాకూర్ అనే మహిళ విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ బృందం విమానాశ్రయంలోని సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. మరోవైపు విమాన సిబ్బందే తనతో క్రూరంగా ప్రవర్తించారని థాకూర్ ఆరోపించారు. ఈ మేరకు కౌంటర్ ఫిర్యాదును కూడా నమోదు చేశారు. ఈ వివాదాన్ని ధ్రువీకరించిన ఇండిగో ఎయిర్ లైన సదరు ప్రయాణికురాలిపై తీసుకునే చర్యలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా గత వారం డీసీజీఏ ఆవిష్కరించిన నిబంధనల ప్రకారం, ప్రయాణికులు ఎవరైనా విమానంలో దురుసుగా ప్రవర్తిస్తే మూడు నెలల నుంచి జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటలు, భౌతిక దాడి లేదా లైంగిక దాడి, హత్యాయత్నం అనే మూడు విభాగాలుగా విభజించారు. నిషేధం వ్యవధి ప్రవర్తన తీవ్రతపై ఆధారపడి ఉంటుందని డీజీసీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అతిచేస్తే ‘నిషేధ జాబితా’లోకి!
న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లో దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం వేటు పడనుంది. వీరి పేర్లను ‘నేషనల్ నో ఫ్లై లిస్టు’లో చేర్చాలని పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది. సూచనలు, అభిప్రాయాల కోసం ముసాయిదా నిబంధనలను శుక్రవారం విడుదల చేసింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగిపై చేయిచేసుకున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సిద్ధమైంది. దురుసు ప్రయాణికులతోపాటు భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులుగా భద్రతా సంస్థలు గుర్తించిన వారినీ జాబితాలో చేరుస్తారు. జాబితాలో అన్ని విమానయాన సంస్థల నుంచి సేకరించిన ఇలాంటి ప్రయాణికుల సమాచారం ఉంటుంది. అయితే నిషేధాన్ని అన్ని విమానయాన సంస్థలు అమలు చేయడం తప్పనిసరేం కాదు. ఇలాంటి లిస్టు ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ముసాయిదా ప్రకారం.. విమానయాన సంస్థకు చెందిన విచారణ కమిటీ నిర్ణయం తర్వాత పేర్లను ‘నో ఫ్లై లిస్టు’లో చేరుస్తారు. దురుసుతనం స్థాయిని బట్టి 3 రకాలు వర్గీకరిస్తారు. తొలి స్థాయిలో.. మత్తుతో శ్రుతిమించి ప్రవర్తించడం, శరీర కదలికలు, మాటలతో వేధింపులకు పాల్పడితే 3 నెలల నిషేధం ఉంటుంది. రెండోస్థాయిలో.. నెట్టడం, కొట్టడం, ఇతరుల సీట్లను ఆక్రమించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలైన వాటికి ఆరు నెలల నిషేధం విధిస్తారు. మూడో స్థాయిలో.. విమాన నిర్వహణ వ్యవస్థకు నష్టం కలిగించడం వంటి ప్రాణహాని చర్యలకు తెగబడితే రెండేళ్లు లేదా నిరవధిక నిషేధం ఉంటుంది. పదేపదే ఇలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడితే గతంలో విధించిన నిషేధానికి రెండు రెట్ల కాలపరిమితిలో నిషేధం విధిస్తారు. -
కపిల్‌కు ఎయిరిండియా హెచ్చరిక
విమాన ప్రయాణంలో అనుచితంగా ప్రవర్తించేవాళ్లపై భారత విమానయాన సంస్థలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి. వాళ్లు ఎంత వీవీఐపీలు అయినా, సెలబ్రిటీలు అయినా కూడా లెక్క చేయడం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వస్తున్న ఓ విమానంలో టాప్ టీవీ కమెడియన్ కపిల్ శర్మ చేసిన హడావుడిని చూసి.. అతడికి హెచ్చరికలు పంపాలని నిర్ణయించింది. అసలు ఆ విమానంలో ఏమైందన్న విషయం గురించి ఎయిరిండియా చీఫ్ అశ్వనీ లొహానీ విచారణ మొదలుపెట్టారు. కపిల్‌కు ఎలాంటి హెచ్చరిక పంపాలో దాన్ని బట్టి నిర్ణయిస్తారు. మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో కపిల్ శర్మ తన బృందంతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. అతడు బాగా మద్యం తాగి గట్టిగా మాట్లాడుతూ, తన బృందంతో కలిసి నానా హడావుడి చేసినట్లు సమాచారం. దీనివల్ల తోటి ప్రయాణికులు బాగా ఇబ్బంది పడటంతో పాటు కొంతమంది భయపడ్డారు కూడా. కేబిన్ సిబ్బంది అతడిని కలిసి కాస్త ఊరుకొమ్మని చెప్పారు. ప్రయాణికుల్లో పెద్దవయసు వాళ్లు కూడా ఉండటంతో ఇలా చేయడం సరికాదన్నారు. దాంతో కపిల్ శర్మ సిబ్బందికి సారీ చెప్పి మాట్లాడకుండా ఉన్నాడని అంటున్నారు. కాసేపటి తర్వాత మళ్లీ తన ట్రూప్ సభ్యుల మీద అరవడం మొదలుపెట్టాడని, ఈసారి పైలట్ వచ్చి గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత చాలా సేపటి వరకు కపిల్ నిద్రపోతూనే ఉన్నాడని విమానంలో ప్రయాణించినవారిలో ఒకరు చెప్పారు.