ప్రయాణికుడి ఓవరాక్షన్‌.. ఈడ్చి పడేసిన పైలట్‌ | Pilot removes abusive passenger by force Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: పైలట్‌ కాలర్‌ పట్టి ఓవరాక్షన్‌.. ప్రయాణికుడ్ని ఈడ్చి పడేసిన పైలట్‌

Published Sat, Jan 7 2023 2:00 PM | Last Updated on Sat, Jan 7 2023 2:00 PM

Pilot removes abusive passenger by force Video Viral - Sakshi

విమానంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే.. చూస్తూ ఊరుకోవాలా? అందుకే.. 

వైరల్‌: విమానంలో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం, వికృత చేష్టలకు పాల్పడుతున్న నానాటికీ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజా ఎయిర్‌ ఇండియా ఘటనలు మాత్రమే కాదు.. ప్రపంచంలో దాదాపు ప్రతీ మూలా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. 

ఈ తరుణంలో అలాంటి ప్రయాణికుల పట్ల వాళ్ల కఠినంగా వ్యవహరించాలని భారత విమానయాన నియంత్రణ విభాగం డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘వర్జిన్‌ ఆస్ట్రేలియా’ విమానంలో జరిగిన ఘటన వైరల్‌గా మారింది. 

బుధవారం టౌన్స్‌విల్లే-సిడ్నీ విమానం టౌన్స్‌విల్లే నుంచి టేకాఫ్‌ అయ్యాక.. ఓ ప్యాసింజర్‌ ఎందుకనో సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో పైలట్‌ జోక్యం చేసుకోగా.. ఆ వ్యక్తి పైలట్‌ను సైతం తులనాడాడు. కాలర్‌ పట్టుకుని అడ్డమైన బూతులు తిట్టాడు. దీంతో.. పైలట్‌కు చిర్రెత్తుకొచ్చింది. నడువు.. అంటూ అతన్ని ఈడ్చుకుంటూ ఎగ్జిట్‌ డోర్‌ దాకా తీసుకెళ్లాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించాలని సిబ్బందికి పైలట్‌ సూచించడంతో ఆ వ్యక్తి గమ్మున అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రయాణికుడు అలా గొడవ ఎందుకు పడ్డాడన్నది తెలియరాలేదు. అలాగే అతనిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వర్జిన్‌ ఆస్ట్రేలియా సైతం ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement