WhatsApp Update: Now Group Admin Can Add Many Members, Details Inside- Sakshi
Sakshi News home page

WhatsApp update: అదిరిపోయే అప్‌డేట్‌,అడ్మిన్‌లకు ఫుల్‌ జోష్‌

Published Mon, Oct 10 2022 10:53 AM | Last Updated on Mon, Oct 10 2022 12:25 PM

WhatsApp update Now group admin can addmany members check details here - Sakshi

న్యూఢిల్లీ:  ప్రముఖ మెసేజింగ్ యాప్  వాట్సాప్  బంపర్‌ ఆఫర్​ ప్రకటించింది. గ్లోబల్‌గా బహుళ ప్రజాదరణ పొందిన వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం అద్భుతమైన అప్‌డేట్స్‌ తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ప్లాట్‌ఫారమ్ ద్వారా అడ్మిన్‌లకు  మంచివార్త చెప్పింది. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసుకునే సభ్యుల సంఖ్యను మరోసారి పెంచింది. ఇప్పటి వరకు ఒక గ్రూప్‌లో 512 మందిని యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు చేసి, అడ్మిన్‌లలో జోష్‌  నింపింది.

వావాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అప్‌డేట్స్ అందిస్తూ ఉంటుంది. వాబేటా ఇన్ఫో తాజా సమాచారం ప్రకారం  వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు గ్రూప్ సభ్యుల సంఖ్యను పెంచుకునే అవకాశాన్ని మరింత పెచింది.  తాజా అప్‌డేట్‌ ప్రకారం గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూప్ లో 1024 మందిని యాడ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ సంఖ్య 512  మాత్రమే. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్‌ వాట్సాప్ బీటా వర్షన్స్ లో ఈ ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement