Group Admins
-
వాట్సాప్ అదిరిపోయే అప్డేట్: అడ్మిన్లకు ఫుల్ జోష్ !
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లోబల్‌గా బహుళ ప్రజాదరణ పొందిన వాట్సాప్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన అప్డేట్స్ తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన ప్లాట్‌ఫారమ్ ద్వారా అడ్మిన్లకు మంచివార్త చెప్పింది. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసుకునే సభ్యుల సంఖ్యను మరోసారి పెంచింది. ఇప్పటి వరకు ఒక గ్రూప్‌లో 512 మందిని యాడ్ చేసుకునే అవకాశం యూజర్లకు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు చేసి, అడ్మిన్లలో జోష్ నింపింది. WhatsApp is releasing larger groups up to 1024 participants! Some lucky beta testers on WhatsApp beta for Android and iOS can add up to 1024 participants to their groups!https://t.co/qDbG3AWaIu pic.twitter.com/oI8Dtg30RK — WABetaInfo (@WABetaInfo) October 8, 2022 వావాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. వాబేటా ఇన్ఫో తాజా సమాచారం ప్రకారం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు గ్రూప్ సభ్యుల సంఖ్యను పెంచుకునే అవకాశాన్ని మరింత పెచింది. తాజా అప్డేట్ ప్రకారం గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూప్ లో 1024 మందిని యాడ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ సంఖ్య 512 మాత్రమే. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ వాట్సాప్ బీటా వర్షన్స్ లో ఈ ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది మెటా యాజమాన్యంలోని వాట్సాప్. -
వాట్సాప్ అడ్మిన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు
ముంబై: వాట్సాప్ గ్రూపు నిర్వాహకుల విషయంలో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన, నేరపూరితమైన సమాచారం పంపితే అందుకు గ్రూప్ అడ్మిన్ జవాబుదారీ కాదని బొంబాయి హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. 33 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసుకు విషయంలో నమోదైన కేసును కొట్టివేస్తూ కోర్టు ఈ వాఖ్యలు చేసింది. వాట్సాప్ గ్రూపుల నిర్వాహకులకు దానిపై పరిమిత నియంత్రణ ఉందని కోర్టు పేర్కొంది. వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు కేవలం కొత్త సభ్యులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు కానీ, గ్రూపులో పోస్ట్ చేసిన కంటెంట్‌ను నియంత్రించలేరు లేదా సెన్సార్ చేయలేరు అని తెలిపింది. అసలు విషయానికి వస్తే.. కిశోర్ తరోన్ పై 2016లో గోండియా జిల్లాలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తరోన్ నియంత్రణలో ఉన్న వాట్సాప్ గ్రూపు సభ్యుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకాపోవడంలో విఫలమయ్యాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఓ గ్రూపులో కొందరు వ్యక్తులు మహిళా సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినా ఆ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న కిశోర్ తరోనే(33) స్పందించలేదని, ఆ సభ్యుడిని గ్రూప్ నుంచి తొలగించి లేదని కనీసం అతనిచే క్షమాపణ చెప్పించలేదు అని ప్రాసిక్యూషన్ వారు పేర్కొన్నారు. అతనిపై ఐపీసీ 354, 509, 107 సెక్షన్ల కింద, ఐటీ చట్టం 67వ నిబంధన కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ గ్రూప్ అడ్మిన్ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది. గ్రూపులో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేస్తే అతను మాత్రమే చట్టపరమైన చర్యలకు ఎలా బాధ్యుడు అవుతాడని కోర్టు స్పష్టం చేసింది. చదవండి: వాట్సాప్ స్టేటస్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్
సాక్షి,ముంబై: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. దేశీయంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ఫార్వర్డింగ్ ఇన్ఫో, ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ లాంటి ఫీచర్లను ఇటీవల లాంచ్ చేసిన వాట్సాప్ తాజాగా గ్రూపు అడ్మిన్లకు మరిన్ని అధికారాలను ఇస్తూ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఫీక్వెంట్లీ ఫార్వర్డెడ్ (తరచుగా ఫార్వార్డ్ చేసిన మెసేజ్) నిరోధానికి మరో కొత్తలేబుల్ను ఆవిష్కరించనుంది. దీంతో సదరు మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వార్డ్ అయిందో చెక్ చేసుకోవచ్చన్న మాట. నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించడానికి వాట్సాప్ తీసుకున్నచర్యల్లో ఇది తదుపరి దశగా భావిస్తున్నారు. తద్వారా వినియోగదారులకు నిరంతరం ఫార్వార్డ్ అవుతున్న మెసేజ్‌ల తలనొప్పులకు చెక్ పెట్టనుంది. వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లకోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అనంతరం గ్రూపు సెటింగ్స్‌లో ఈ ఫీచర్‌తో త్వరలోనే అప్డేట్ చేయనుంది. దీని ప్రకారం ఒక్క అడ్మిన్ తప్ప ఈ ఫీక్వెంట్లీ ఫార్వర్డెర్డ్ ఆప్షన్‌ను చూసే, లేదా ఎడిట్ చేసే అవకాశం లేదు. అంతేకాదు సదరు మెసేజ్‌ను పార్వార్డ్ చేయాలా లేదా వద్దా అనేది కూడా గ్రూప్ అడ్మిన్ నిర్ణయించాల్సి ఉంటుంది. దీంతో అసంబద్ధ, లేదా అసత్య వార్తల తొందరగా వ్యాపించే ప్రక్రియ నెమ్మదిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా రూమర్లు, అసత్య వార్తలు, నకిలీ వార్తల వ్యాప్తిలో తన ప్లాట్‌ఫాం దుర్వినియోగాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, చట్ట సంస్థలు, ఫాక్ట్ చెకర్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలతో వాట్సాప్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. -
‘సోషల్’ కిల్లింగ్స్!
బుధవారం పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడిపై విరుచుకుపడిన జనం.. అదే రోజు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బీబీనగర్‌లో ఒక వ్యక్తిపై దాడి చేసి చంపేసిన స్థానికులు.. శుక్రవారం మల్కాజ్గిరి ఠాణా పరిధిలో కాలకృత్యాలు తీర్చుకుంటున్న వ్యక్తికి చావుదెబ్బలు.. శనివారం చాంద్రాయణగుట్ట, మాదన్నపేటల్లో ఎనిమిది మందిపై దాడి, ఒకరి మృతి.. సోషల్‌మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్ల కారణంగా రాజధానిలో జరిగిన బీభత్సమిది. వాట్సాప్‌లో షేర్ అవుతున్న వీడియోలు, ఫొటోలు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నా యి. ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలు, పిల్లల కిడ్నాపర్లు వచ్చారని, ఫలానా చోట ఒకరు చిక్కారని, మరికొందరు ఇంకా సంచరిస్తున్నారనేది వాటి సారాంశం. వీటి ప్రభావంతో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్న ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కాస్త అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా దాడులకు తెగబడుతున్నారు. శనివారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే చంద్రయ్య(52) అనే హిజ్రా ప్రాణం తీయగా, మరో ముగ్గురిని క్షతగాత్రులుగా మార్చింది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మాదన్నపేట ఠాణా పరిధిలో నలుగురు వ్యక్తులపై దాడికి కారణమైంది. –సాక్షి, హైదరాబాద్ ఇతర దేశాలకు చెందిన పాత వీడియోలే.. ఈ పుకార్లతో పాటు షేర్ అవుతున్న వీడియోలు అత్యంత భయంకరంగా, జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇవి ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవి కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. ఇరాన్, ఇరాక్, సిరియా, మయన్మార్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ తదితర ప్రాంతాల్లో గతంలో చోటు చేసుకున్న దారుణాలకు సంబంధించిన వీడియోలను కొందరు ఇంటర్నెట్ నుంచి తీసి షేర్ చేస్తున్నారు. కొన్ని వీడియోలకు తెలుగు, హిందీ, ఉర్దూ ఆడియో క్లిప్స్ జోడిస్తున్నారు. వీటి ప్రభావానికి లోనవుతున్న సాధారణ ప్రజలు ప్రతి అంశాన్నీ అనుమానాస్పదంగా చూస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోంది. ఆధ్యుల్ని గుర్తించడం సాధ్యం కావట్లే.. ఇలాంటి వీడియోలను షేర్ చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తిస్తున్నప్పటికీ.. వీటికి మూలం ఎవరనేది తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఈ పుకార్లు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమై రాష్ట్రంలోకి విస్తరించినట్లు భావిస్తున్నారు. వీటిని షేర్ చేసిన వారిలో కొందరిని అరెస్టు చేసిన పోలీసులు సోషల్‌మీడియా సెల్ ద్వారా సూత్రధారుల్ని గుర్తించాలని ప్రయత్నాలు చేశారు. చివరకు వాట్సాప్ సంస్థను సంప్రదించినా మూలం ఎవరనే వివరాలు చెప్పడం సాధ్యం కాదని చేతులెత్తేసింది. దీంతో షేరింగ్ ద్వారా విస్తరణను అడ్డుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ ‘ఇద్దరే’ ప్రధాన టార్గెట్.. పుకార్ల ప్రభావంతో ప్రతి ఒక్కరినీ అనుమానిస్తున్న సాధారణ ప్రజలు ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా దాడులకు తెగబడుతున్నారు. వీరికి టార్గెట్‌గా మారుతున్న వారిలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, మానసిక వికలాంగులే ఎక్కువగా ఉంటున్నారు. రాజధానిలో వృత్తి, వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. వీరిని స్థానికులు ప్రశ్నించినప్పుడు భాష అర్థం కాక సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో అనుమానం పెరిగి, విచక్షణ కోల్పోతున్న ప్రజలు వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇక మానసిక వికలాంగులు సైతం వీరికి టార్గెట్‌గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. స్కూళ్లు తెరిస్తే మరింత ప్రమాదం.. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. మరో వారంలో స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ పుకార్ల కారణంగా పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా స్కూళ్లు, ప్రిన్సిపాల్స్, పేరెంట్స్ అసోసియేషన్లతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. పుకార్లను తిప్పికొట్టడానికి నగర పోలీసు విభాగం సైతం సమాయత్తమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో దాదాపు ప్రతి పోలీసుస్టేషన్‌కు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి. కమ్యూనిటీ పోలీసింగ్ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా ఇలాంటి పుకార్లను సమర్థంగా తిప్పికొట్టడానికి నిర్ణయించారు. ఇతర కోణాలు ఉన్నాయా..? సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం వెనుక వేరే కోణాలు, కారణాలు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టు కుని లోతుగా ఆరా తీయడానికి స్పెషల్ బ్రాంచ్‌ను రంగంలోకి దింపడంతో పాటు నిఘా వర్గాల సహకా రం తీసుకుంటున్నారు. ప్రధానంగా పుకార్లు విస్తరిస్తున్న సోషల్ మీడియా గ్రూపులు, అవి విస్తరిస్తున్న ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఈ పుకార్లు నమ్మవద్దంటూ, అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, తమకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఓ వాయిస్ క్లిప్ విడుదల చేశారు. 1.45 నిమిషాల నిడివితో ఉన్న దీనితో పాటు ఆయన సందేశానికి సంబంధించిన టెక్ట్స్‌ను అన్ని గ్రూపుల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఆధారాలు దొరికితే అడ్మిన్ అరెస్టే.. నగరంలో ఎలాంటి అంతర్రాష్ట్ర కిడ్నాపింగ్, దోపిడీ ముఠాల సంచా రం లేదు. సోషల్‌మీడియాలో ప్రచారమంతా వదంతులే. కిడ్నాపింగ్, దోపిడీ ముఠాలు వచ్చాయన్న ప్రచారం ఉద్రిక్తతతలకు దారితీయడమే కాక పరిస్థితులు చేయి దాటేలా చేస్తోంది. ప్రజా జీవితానికి భంగం కలిగించే ఇలాంటి వదంతులను ప్రచారం చేయడం నేరం. ఇలాంటివి షేర్ చేసిన వారితో పాటు ఆ యా గ్రూపుల అడ్మిన్లూ నేరం చేసినట్లే. తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్‌మీడియాపై పూర్తి నిఘా ఉంచాం. ఆధారాలు చిక్కితే గ్రూప్ అడ్మి న్స్నూ అరెస్టు చేస్తాం. చాంద్రాయణగుట్ట ఉదంతానికి సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకున్నాం. తాజా పరిణామాల నేపథ్యంలో తెల్లవారుజామున 2 గంటల వరకు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ సంచరిస్తూనే ఉంటాయి. – అంజనీకుమార్, హైదరాబాద్ కొత్వాల్ -
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్ గ్రూప్‌కి అడ్మిన్‌గా ఉండే వ్యక్తిని గ్రూప్ నుండి తొలగించకుండానే నేరుగా అడ్మిన్ భాద్యతలు మాత్రమే తొలగించేలా ఓ కొత్త ఫీచర్ వాట్సాప్ టెస్ట్ చేస్తుంది. దీనికోసం 'డిస్మిస్ యాజ్ అడ్మిన్ ' అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఎంతమందైనా అడ్మిన్లుగా ఉండొచ్చు. ఒక అడ్మిన్, మరొక వ్యక్తిని అడ్మిన్ స్థానానికి ప్రమోట్ చేసుకునే వీలుండేంది. ఒకవేళ అతని లేదా ఆమెను అడ్మిన్‌గా తొలగించాలంటే, పూర్తిగా గ్రూప్ నుంచి ఆ వ్యక్తిని తొలగించిన తర్వాతనే కుదురుతుంది. అనంతరం మళ్లీ ఆ వ్యక్తిని గ్రూప్‌లో సాధారణ సభ్యులుగా చేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ వాట్సాప్ ప్రస్తుతం టెస్ట్ చేస్తున్న ఫీచర్‌తో ఆ వ్యక్తిని గ్రూప్ నుంచి తొలగించకుండా కేవలం అడ్మిన్ బాధ్యతల నుంచే తప్పించవచ్చు. ఈ విషయాన్ని తొలుత డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిటిపై ఈ ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తుందని, అతిత్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్ ఫోన్లన్నింటిలో అందుబాటులోకి రానుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.18.12కు గూగుల్ ప్లే బీటా ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉందని, యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో బీటా టెస్టింగ్‌లో సైనప్ అయి, దీన్ని చెక్ చేసుకోవచ్చని తెలిపింది. డిస్మిస్ ఫీచర్‌తో పాటు గ్రూప్‌లోని సభ్యులెవరైనా పోస్ట్ చేసే ఫొటోస్, వీడియోస్, డాక్యూమెంట్స్ వంటి వాటిని నియంత్రించే అధికారం అడ్మిన్లకు ఇచ్చే అంశాన్ని కూడా వాట్సాప్ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్లోకి మారడానికి క్విక్ స్విచ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. యాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. -
అడ్మిన్ తలచుకుంటే..!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ యాప్ ‘వాట్సాప్’.. గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు అప్పగించనుంది. అనవసర సందేశాలు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోస్టు చేస్తూ.. గ్రూపులోని మిగిలిన సభ్యులను ఇబ్బందిపెడుతున్న వారిని నియంత్రించేలా యాప్‌లో మార్పులు చేస్తోంది. అడ్మిన్ తలచుకుంటే ఇలాంటి సందేశాలను నిలిపేయవచ్చని.. కొత్త సాంకేతికతను పరీక్షించే డబ్ల్యూఏ బీటా ఇన్ఫో వెబ్సైట్ వెల్లడించింది. గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.430లో ఈ సదుపాయం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయాన్ని కేవలం గ్రూపు అడ్మిన్లు మాత్రమే వినియోగించుకోవచ్చు. ఒక్కసారి సదరు సభ్యుడిని ఈ జాబితాలో చేరిస్తే.. ఆ సభ్యుడు గ్రూపులోని ఇతరులు పంపే సందేశాలను చదివేందుకు మాత్రమే వీలుంటుంది. తన సందేశాన్ని గ్రూపు సభ్యులందరికీ చేరవేయాలనుకుంటే సందేశాన్ని టైప్ చేసి ‘మెసేజ్ అడ్మిన్’ బటన్ నొక్కాల్సి ఉంటుంది. దీన్ని అడ్మిన్ ధ్రువీకరిస్తేనే ఈ మెసేజ్‌లు పోస్ట్ అవుతాయి. -
గ్రూప్ అడ్మిన్లూ...బీ కేర్‌ఫుల్
సాక్షి,పాట్నా: ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు షాకింగ్ న్యూస్. వీరిని పోలీసుల నిరంతర నిఘా వెంటాడటంతో పాటు ప్రాసిక్యూట్ చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. బీహార్ పోలీసులు ఈ మేరకు సోషల్ మీడియాపై గట్టి నియంత్రణలు చేపట్టారు. సోషల్ మీడియా గ్రూప్‌ల్లో అభ్యంతరకర, అవాస్తవ సమాచారం వ్యాపిస్తుండటంతో ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులపై బీహార్ అధికార యంత్రాంగం దృష్టిసారించింది. దర్బంగా పోలీసులకు సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవ కంటెంట్‌తో కునుకు లేకుండా పోయింది. ఆధారాల్లేని, అవాస్తవ సమాచారంతో భిన్నవర్గాల ప్రజల మధ్య ఘర్షణలు,ఉద్రిక్తతలు తలెత్తడంతో సోషల్ మీడియా గ్రూపులపై బీహార్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దర్బంగా ఉదంతంలో వదంతులు, అవాస్తవ సమాచారాన్ని వాట్సాప్, ఎఫ్బీ గ్రూప్ అడ్మిన్లు కాపీ, పేస్ట్ ఫార్మాట్లో పలు ఇతర గ్రూపులకు ఫార్వాడ్ చేయడంతో ఇబ్బందులు అధికమయ్యాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూపుల్లో సర్క్యులేట్ అయ్యే కంటెంట్‌ను వెరిఫై చేసుకోలేదని తేలినే గ్రూప్ అడ్మిన్లపై చర్యలు చేపడతామని దర్బంగా ఎస్ఎస్పీ సత్యవీర్ సింగ్ స్పష్టం చేశారు. నిజాయితీతో కూడిన వారినే గ్రూపులో యాడ్ చేసుకోవాలని గ్రూప్ అడ్మిన్లకు బీహార్ పోలీసులు సూచించారు. ఏదైనా గ్రూప్‌లో మత ఉద్రిక్తతలు, సామాజిక అలజడులు రేపే కంటెంట్ సర్క్యులేట్ అయితే కేవలం దాన్ని పంపిన వారు, ఫార్వడ్ చేసిన వారినే కాకుండా గ్రూప్ అడ్మిన్‌పైనా చర్య తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. -
వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ అడ్మిన్లకు వార్నింగ్
వారణాసి : వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేస్తూ గ్రూప్ అడ్మిన్లుగా ఉంటున్న వారు ఇక నుంచి చాలా అప్రమత్తతగా ఉండాల్సి ఉంది. అడ్మిన్‌గా కేవలం గ్రూప్‌లో కొత్త సభ్యులను చేర్చడం మాత్రమే కాకుండా.. గ్రూప్‌లో పోస్టు అయ్యే వాటిపైనా ఓ కన్నేసి ఉండాలట. లేకపోతే గ్రూప్ సభ్యులు చేసే అనవసరమైన తప్పిదానికి వీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. గ్రూప్‌లో పోస్టు చేసే రూమర్లకు, ఫేక్ న్యూస్ స్టోరీలకు లేదా అసహ్యకరమైన వీడియోలకు గ్రూప్ అడ్మిన్లు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని వారణాసి కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తప్పుడు వార్తలకు, మార్పుడ్ ఫోటోగ్రాఫ్‌లకు, అభ్యంతరకరమైన వీడియోలకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారనే ఆరోపణల మేరకు స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది. గ్రూప్‌లో ఇతర యూజర్లు పోస్టు చేసిన కంటెంట్‌కు గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టిస్తూ వచ్చే పోస్టులకు గ్రూప్ అడ్మిన్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేస్తామని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు కలిసి తమ అభిప్రాయాలను, ఫోటోలను, తమకు నచ్చిన వీడియోలను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు గ్రూప్‌ను క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించాయి. వారణాసి ప్రభుత్వ ఆర్డర్‌తో సోషల్ మీడియా గ్రూప్‌ను క్రియేట్ చేసే అడ్మిన్లే ఇక నుంచి అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏదైనా తప్పుడు వార్తను, అభ్యంతరకరమైన పోస్టులను గ్రూప్ సభ్యులు పెడితే, వెంటనే ఆ పోస్టుల తొలగించి, గ్రూప్ నుంచి ఆ సభ్యుడికి ఉద్వాసన పలకాలని ఆదేశించింది.