కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్ గ్రూప్‌కి అడ్మిన్‌గా ఉండే వ్యక్తిని గ్రూప్ నుండి తొలగించకుండానే నేరుగా అడ్మిన్ భాద్యతలు మాత్రమే తొలగించేలా ఓ కొత్త ఫీచర్ వాట్సాప్ టెస్ట్ చేస్తుంది. దీనికోసం 'డిస్మిస్ యాజ్ అడ్మిన్ ' అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఎంతమందైనా అడ్మిన్‌లుగా ఉండొచ్చు. ఒక అడ్మిన్, మరొక వ్యక్తిని అడ్మిన్ స్థానానికి ప్రమోట్ చేసుకునే వీలుండేంది. ఒకవేళ అతని లేదా ఆమెను అడ్మిన్‌గా తొలగించాలంటే, పూర్తిగా గ్రూప్ నుంచి ఆ వ్యక్తిని తొలగించిన తర్వాతనే కుదురుతుంది. అనంతరం మళ్లీ ఆ వ్యక్తిని గ్రూప్‌లో సాధారణ సభ్యులుగా చేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ వాట్సాప్ ప్రస్తుతం టెస్ట్ చేస్తున్న ఫీచర్‌తో ఆ వ్యక్తిని గ్రూప్ నుంచి తొలగించకుండా కేవలం అడ్మిన్ బాధ్యతల నుంచే తప్పించవచ్చు. ఈ విషయాన్ని తొలుత డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండిటిపై ఈ ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తుందని, అతిత్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్ ఫోన్లన్నింటిలో అందుబాటులోకి రానుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో పేర్కొంది. ఆండ్రాయిడ్ 2.18.12కు గూగుల్ ప్లే బీటా ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉందని, యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో బీటా టెస్టింగ్‌లో సైనప్ అయి, దీన్ని చెక్ చేసుకోవచ్చని తెలిపింది. డిస్మిస్ ఫీచర్‌తో పాటు గ్రూప్‌లోని సభ్యులెవరైనా పోస్ట్ చేసే ఫొటోస్, వీడియోస్, డాక్యూమెంట్స్ వంటి వాటిని నియంత్రించే అధికారం అడ్మిన్‌లకు ఇచ్చే అంశాన్ని కూడా వాట్సాప్ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌లోకి మారడానికి క్విక్ స్విచ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. యాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment