
పంజాబ్‌లో రైతుల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులు భారీ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటలకు గిట్టుబాటు ధర, పూర్తి స్థాయి రుణమాఫీ, ఎరువులపై ధరల నియంత్రణ వంటి డిమాండ్స్‌తో పదిరోజుల దేశవ్యాప్త సమ్మెను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్‌తో సహా 130 రైతు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దీనిలో భాగంగా పాలు, కూరగాయలు, నిత్యవసర వస్తులును గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు సరఫరా చేయకుండా నిలిపివేశారు.
రైతాంగం ఎక్కువగా గల ఉత్తర భారతంలోని పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పాలను, కూరగాయలకు రోడ్ల మీద పారబోసి నిరసన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో రైతులు టమాటాలను జాతీయ రహదారిపై పారబోసి ధర్నా నిర్వహించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారస్సులను అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై అధిక ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర అడిగితే మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సోర్‌లో ఆరుగురు రైతులను కాల్చివేశారని విమర్శించారు. తమ డిమాండ్స్‌ను పరిశీలించకపోతే జూన్ 10న భారత్ బంద్‌కు పిలునిస్తామని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ అధ్యక్షుడు శివకుమార్ శర్మ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment