కలెక్టర్ వాకాటి కరుణ
‘కోట’లో ముగింపు ఉత్సవాలు
అమరుల కుటుంబాలకు సత్కారం
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అవతరణ వేడుకల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల కార్యాచరణను వివరించారు. జూన్ 2న ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ, అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి, అమరవీరుల కుటుంబాలకు సత్కారం ఉంటుందని తెలిపారు.
అదేరోజు సాయంత్రం కార్నివాల్ రూపంలో కలెక్టర్ బంగ్లా, ఆర్ట్స్ కళాశాల సెంటర్, అమరవీరుల స్తూపం, వేయిస్తంభాల ఆలయం, నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పేయింటింగ్ పోటీలు, 3కే రన్, రక్తదాన శిబిరాలు, సెమినార్లు, వ్యాసరచన, క్రీడా పోటీలు, ఫుడ్ స్టాల్స్ ముషాయిరా వంటి కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ వివరించారు. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ 6న స్వచ్ఛ వరంగల్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
చివరిరోజు కార్యక్రమాలు వరంగల్ కోటలో ఉంటాయని తెలిపారు. జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ముగింపు రోజున వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆస్తులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్ మాట్లాడుతూ ఉత్సవాల్లో సుమారు 27వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ఏజేసీ తిరుపతిరావు, డీఆర్వో శోభ, టీజీఓల సంఘం కార్యదర్శి జగన్మోహన్‌రావు, రత్నవీరాచారి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులు భాగస్వాములు కావాలి
Published Mon, Jun 1 2015 4:18 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement
Advertisement