
ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లతో సమీక్షిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్/ఇందూరు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో సమీక్షించారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ సింధే, గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్ రెడ్డిలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్‌లు ఎం.రామ్మోహన్‌రావు, సత్యనారాయణ, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు పాల్గొన్నారు.
కొత్త పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి పంపిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని మంత్రి ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment