సాక్షి, హైదరాబాద్: అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం చేస్తామని.. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇస్తామని సీఎం తెలిపారు.
‘‘ఇళ్ల విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలి. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment