ఈ ఏడాది కృష్ణా పాల ఉత్పత్తి దారులకు రూ.60 కోట్లు బోనస్‌గా అందించినట్టు ఆ సంస్థ చైర్మన్ మండవ జానకి రామయ్య చెప్పారు. ఆదివారం పోతవరం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. లీటరు ఒక్కింటికి రూ. 11 బోనస్ అందించినట్టయిందన్నారు. ప్రస్తుతం లక్షా 60 వేల లీటర్లు వస్తుండగా 2 లక్షల 50 వేల లీటర్లు అమ్మకం జరుగుతుందన్నారు.
రైతులకు రూ.60 కోట్ల బోనస్
Published Sun, Oct 2 2016 10:34 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
పోతవరం (నల్లజర్ల) : ఈ ఏడాది కృష్ణా పాల ఉత్పత్తి దారులకు రూ.60 కోట్లు బోనస్‌గా అందించినట్టు ఆ సంస్థ చైర్మన్ మండవ జానకి రామయ్య చెప్పారు. ఆదివారం పోతవరం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. లీటరు ఒక్కింటికి రూ. 11 బోనస్ అందించినట్టయిందన్నారు. ప్రస్తుతం లక్షా 60 వేల లీటర్లు వస్తుండగా 2 లక్షల 50 వేల లీటర్లు అమ్మకం జరుగుతుందన్నారు. సంవత్సరానికి రూ. 569 కోట్లతో సంస్థ టర్నోవర్ జరుగుతుందన్నారు. పశువులకు అత్యవసర సమయాలలో సేవలందించడానికి 7 వాహనాలు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వాటిలో డాక్టర్‌తో పాటు అత్యవసర మందులు ఉంటాయన్నారు. పోతవరంతో పాటు రంగాపురం, పెదతాడేపల్లి, జానంపేటలో ఏర్పాటు చేసిన బల్క్‌మిల్క్ కూలర్లు మాదిరిగా మరిన్ని చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 50 శాతం రాయితీపై వ్యాక్సిన్‌లు, గడ్డి విత్తనాలు అందిస్తున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement