తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు రావాల్సిందిగా నిజాం మనవడు ప్రిన్స్ ముకరం జా బహదూర్‌కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ లేఖ రాశారు.
నిజాం మనవడికి ఉపముఖ్యమంత్రి మహమూద్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు రావాల్సిందిగా నిజాం మనవడు ప్రిన్స్ ముకరం జా బహదూర్‌కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని, మీ మాతృభూమి అయినా హైదరాబాద్‌లో జూన్ 2న జరిగే వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు. నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు నిజాం మనవడు ప్రిన్స్ ముకరంజా బహదూర్ హాజరు కావడం ప్రశ్నార్థకమే. లండన్‌లో నివాసముంటున్న ప్రిన్స్‌పై రెడ్‌కార్నర్ నోటీసులు, నిజాం ఆస్తుల వివాదాలు, బంధువులతో ఆస్తి తగదాలు ఉండటంతో హైదరాబాద్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.