
శ్రీరాముని శోభను చూతము రారండి!
నేడు శోభా యాత్ర భారీ విగ్రహాల ఏర్పాటు
సర్వం సిద్ధం : ఎమ్మెలే ్య రాజాసింగ్‌లోథ
అబిడ్స్: శ్రీరామ నవమి శోభా యాత్రకు నగరంలో సర్వం సిద్ధమైంది. శనివారం నిర్వహించే ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. నగరంలోని ధూల్‌పేట్ గంగాబౌలి నుంచి ప్రారంభమై మంగళ్‌హాట్, పురానాపూల్, ఛత్రీ, బేగంబజార్, సిద్దిఅంబర్‌బజార్, గౌలిగూడల మీదుగా సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామ శాల వరకు యాత్ర కొనసాగుతుంది.
రెండు శోభాయాత్రలు
గంగాబౌలి నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ఆధ్వర్యంలో ఏటా శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సీతారాంబాగ్ ఆలయం నుంచి కూడా భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి నాయకులు మరో యాత్రను ప్రారంభించనున్నారు. ఈ రెండు శోభాయాత్రలు మంగళ్‌హాట్ అనిత టవర్ దగ్గర కలవనున్నాయి.
భారీ విగ్రహాలు సిద్ధం
ఈ యాత్ర కోసం మొదటిసారిగా భారీ శ్రీరాముడి విగ్రహం, రామసేతు, హనుమంతుడి విగ్రహాలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ తెలిపారు. రామసేతుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా విగ్రహాలను ప్రదర్శిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
ప్రత్యేక ఆకర్షణగా డోల్ పతక్ బ్యాండ్
దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పూణె నగరంలోని డోల్ పతక్ బ్యాండ్‌ను మొదటిసారిగా ధూల్‌పేట్ గంగాబౌలికి రప్పించారు. 101 మంది యువకులు ఈ బృందంలో ఉంటారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. భక్తి గీతాలు, శివాజీ మహరాజ్ గీతాలు పాడుతూ బ్యాండ్ కొనసాగుతుందని వివరించారు.
పోలీస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పరిశీలిన
శోభా యాత్ర ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌లు శుక్రవారం పర్యవేక్షించారు. పోలీసు కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ అంజనీ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీలు రాంభూపాల్‌రావు, భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి నాయకులు యమన్‌సింగ్, భగవంతరావు, కె.రాములు, మెట్టువైకుంఠం, శ్రీనివాస్ యాదవ్, శ్యాం నెల్లూరి తదితరులు ఉన్నారు.