పడకేసిన చింతలపూడి
పడకేసిన చింతలపూడి
Published Fri, Oct 28 2016 10:15 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
–నత్తనడకన భూసేకరణ ప్రక్రియ
–ఎక్కడిక్కక్కడే ఆటంకాలతో నిలిచిపోయిన పనులు
–దృష్టి సారించని ప్రభుత్వం
–నెరవేరని మెట్టరైతుల కల
కొవ్వూరు:
జిల్లాలో మెట్ట రైతుల మేలు చేకూర్చే చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు పడకేశాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈపధకం పూర్తి చేయడం పట్ల శ్రద్ద చూపడం లేదు.పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటీకీ ఇరవైఐదు శాతంలోపు మాత్రమే పనులు పూర్తయ్యాయి.టీడీపీ అధికారంలోకి వచ్చి సుమారు మూఫైనెలలు కావస్తుంది.పనుల్లో పురోగతి ఏమాత్రం కనిపించడం లేదు.రూ.1,701 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈ పధకం పనులు ఇప్పటి వరకు కేవలం రూ.456 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తి చేశారు.భూసేకరణ ప్రక్రియ నత్తనడక కొనసాగుతుంది.ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 1,828 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం మూఫైశాతం భూమిని మాత్రమే సేకరించారు. కష్ణ జిల్లా రైతులకు ప్రయోజనాల కోసం పట్టిసీమ పధకాన్ని ఆగమేఘాలపై పూర్తి చేసిన ప్రభుత్వం చింతలపూడి పధకం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని మెట్ట రైతులు ్రçపశ్నిస్తున్నారు.ఈ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది.ఈ జిల్లాకి ఎన్ని మేళ్లు చేయాలో అన్నీ చేస్తాం...జిల్లా ప్రజలు చూపిన ఆధరణకి ఎప్పుడు రుణపడి ఉంటానని పదేపదే వల్లెవేస్తున్న సీఎం చంద్రబాబు చింతలపూడి పధకం పనులు పూర్తి విస్మరించడం విమర్శలకు తావిస్తోంది.
మహానేత ఆశయానికి తూట్లు:
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మెట్టరైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని రూ.1,701 కోట్లు వ్యయంతో గోదావరి నీటిని తరలించే ందుకు ఈ çపధకం మంజూరు చేశారు.2008 అక్టోబర్ 30న శంకుస్ధాపన చేశారు.మెట్టప్రాంతంలో 16 మండలాల్లో 196గ్రామాల పరిధిలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేందుకు ఈ ప«దకాన్ని రుపోంది ంచారు.నాలుగేళ్ల కాలంలో అంటే 2013 ఫిబ్రవరికి పధకం పూర్తికావాల్సి ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్ మరణాంతరం పనులు పడకేశాయి.మరోమూడేళ్ల సమయం అదనంగా పోడిగించి వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు.అయినా ఆగడువులోపు పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
నత్తనడనక భూసేకరణ ప్రక్రియ:
ఈపధకం నిర్మాణానికి 18,208 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా దీనిలో 6,683 ఎకరాల అటవీశాఖ భూమి ఉంది.మిగతా భూమి రైతులను సేకరించాల్సి ఉంది. ఈపధకం పనులు రెండు ప్యాకేజీల కింద చేపట్టారు. దీనిలో మొదటి ప్యాకేజిలో 11,749 ఎకరాలకు గాను 6,050 ఎకరాల అటవీ భూమి ఉంది.రైతుల నుంచి సేకరించాల్సిన 5,699 ఎకరాల్లో 4,430 ఎకరాలు సేకరించారు.రెండో ప్యాకేజిలో 6,801 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దీనిలో 633 ఎకరాలు అటవీభూమి ఉంది.మిగిలిన 6,168 ఎకరాల్లో కేవలం 1,600 ఎకరాలు మాత్రమే సేకరించారు.ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ నుంచి సేకరిస్తున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూములు చూపించాల్సి ఉంటుంది.విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో భూములను చూపించారు.ఇటీవలే అటవీశాఖ అధికారులు ఆభూములను పరిశీలించారు.అటవీశాఖకు ఈ భూములు బదలాయిస్తే ఇక్కడ ఆశాఖకి చెందిన 6,683 ఎకరాలు భూముల్లో పనులు చేపట్టే అవకాశం ఉంది.ప్రభుత్వం ఈ భూములు బదలాయింపు ప్రక్రియ తర్వతగతిన పూర్తి చేస్తే పనులు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది.
పురోగతి లేని పనులు:
చింతలపూడి పధకం మొదటి ప్యాకేజీ పనులు రూ.1,202 కోట్లు వ్యయంతో చేపట్టారు.వీటిలో ఇప్పటి వరకు రూ.359 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు.ఈ ప్యాకేజీలో 110 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం పదహారు మాత్రమే పూర్తయ్యాయి. ఈప్యాకేజీలో 29.81శాతం పనులు పూర్తి చేశారు.రెండో ప్యాకేజీలో ఇప్పటి వరకు 19.55 శాతం పనులు పూర్తి చేశారు.మొత్తం రూ.497 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈప్యాకేజీలో ఇప్పటి వరకు కేవలం రూ.97 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు.
భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో వివక్షత:
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలో భూసేకరణ చేపట్టి 117 ఎకరాలు సేకరించారు.ఈ భూముల్లో భాగంగా 77.85 ఎకరాలకు గాను గత ఏడాది అక్టోబరులో రూ.25, 67,22,251 అవార్డు పరిహారాన్ని ప్రకటించారు. 50 మంది రైతుల నుంచి ఈ భూములను అధికారులు సేకరించారు.ఈపరిహారం నేటికి రైతుల బ్యాంకు ఖాతాలో జమకాలేదు.గత ఏడాది డిసెంబర్‌లో ఇక్కడ పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావస్తున్నా రైతులకు మాత్రం పరిహారం చెల్లించలేదు. తొలుత ఎకరాకు రూ.29.70 లక్షల చోప్పున అందిస్తామని నమ్మించి ఇప్పుడు అధికారులు రూ.21 లక్షల చొప్పున ఇస్తామంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బుట్టాయి గూడెం మండలంలో భూసేకరణ చేసినప్పటికీ పరిహారం పూర్తిస్ధాయిలో అందకపోవడంతో నాలుగునెలలు నుంచి పనులు నిలిచిపోయాయి. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో ఎకరాకు రూ.12.50 లక్షలు మాత్రమే చెల్లించారు.దెందులూరు మండలంలో పట్టిసీమ పధకానికి ఇచ్చిన మాదిరిగా తరహాలో ఎకరానికి రూ.38 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.కొందరు రైతులు కోర్టుకు వెళ్ళి స్టేతెచ్చుకున్నారు. దీంతో యర్రగుంటపల్లితోపాటు వెంకటాపురం, కాంతంపాలెం, చింతలపూడి, ప్రగడవరం గ్రామాల్లో పనులు మే నెల నుంచి ఆగిపోయాయి.గోపాలపురం మండలం భీమోలు రైతులు పరిహారం తక్కువ మొత్తంలో చెల్లించారని కోర్టు ఆశ్రయించడంతో నాలుగు నెలలుగా పనులు నిలిచిపోయాయి.ఇక్కడ ఎకరాకి రూ.20లక్షల చోప్పున చెల్లించారు. పక్కనే ఉన్న అన్నదేవరపేట భూములకు రూ.24 లక్షల నుంచి రూ.28లక్షల వరకు చెల్లించారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీలుగుమిల్లి మండలంలో రైతుల భూముల్లో పనులు పూర్తయినప్పటికీ అటవీశాఖ భూములు ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం అటవీ శాఖ భూములను పనులు కొనసాగడం లేదు. టి.నరసాపురం, బుట్టాయిగూడెంలోను అటవీ శాఖ భూములు స్వాధీనం చేసుకోకపోవడం పనులు చేపట్టలేదు.
నాలుగు నెలలుగా పరిహారం ఇవ్వలేదు:
మా గ్రామంలో సుమారు 30 మంది రైతుల నుంచి చింతలపూడి ఎత్తిపోతల పధకం కాలువ తవ్వకాలకు భూమిని తీసుకున్నారు. 4నెలలు కావొస్తున్నా మాకు నష్ట పరిహారం ఇంత వరకూ ఇవ్వలేదు.పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
–తెల్లం సూరిబాబు,కంగాలవారిగూడెం–బుట్టాయగూడెం మండలం.
భూములకు పరిహారం తగ్గించారు:
చింతలపూడి ఎత్తిపోతల పధకంలో భాగంగా తమ భూములు కూడా ఉన్నాయి. ప్రకటించిన అవార్డు సొమ్ము కాకుండా ఎకరాకు రూ.29.70లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 21 లక్షల ఇస్తామని చెబుతున్నారు.ఎంతో విలువైన, సాగుకు ఉపయోగపడే భూములను పధకానికి తాము ఇచ్చాం. కానీ తమకు ఇస్తామన్న పరిహారం ఇవ్వడానికి అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
– పల్లా గంగాధరరావు, రైతు,తాడువాయి జంగారెడ్డిగూడెం మండలం
Advertisement