చింతలపూడి పనులను అడ్డుకున్న రైతులు
Published Sat, Aug 27 2016 12:15 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
చింతలపూడి : రైతులకు ఆమోదయోగ్యమైన నష్టపరిహారం ఇచ్చే వరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జరగనివ్వమని రైతు నాయకులు అన్నారు. వెలగలపల్లి, శెట్టివారిగూడెం గ్రామాల్లో ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను శుక్రవారం రైతులు అడ్డుకున్నారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా భూసేకరణకు సర్వే చేయడానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ జరపాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయనివ్వకుండా సర్వే సిబ్బందిని అడ్డుకుని వెనక్కు పంపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు గోలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తొలుత తమ భూములకు ఎకరానికి ఎంత నష్ట పరిహారం అందిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్‌కు వినతిపత్రం అందచేశారు. ఆందోళనలో రైతులు తాళం మాధవరావు, చిలకబత్తుల సత్యనారాయణ, ఎం.నర్సయ్య, చిలుకూరి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement