కొత్త జిల్లాలతో మారుమూల ప్రాంతాల ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా కేంద్రం అందుబాటులోకి రావడంవల్ల సంతోషించనివారు లేరు. అనేక రంగాల్లో ఎదగడానికి జిల్లా యూనిట్ ఒక ప్రాతి పదిక కల్పిస్తున్నది. చిన్న జిల్లా లవల్ల ఇలాంటి వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అభి వృద్ధి అందించే అవకాశాలు మెరుగవుతాయి.
జిల్లా యూనిట్‌గా ప్రణాళికలు రూపొందించిన ప్పుడు ఒక జిల్లాలో ఏమేమి ఉండాలో అవి అన్ని జిల్లా లకు సమానంగా వర్తిస్తాయి. చిన్న యూనిట్ల వల్ల అభివృద్ధి వేగవంతం అవుతుంది. చిన్న జిల్లాల వల్ల ఉపాధి కల్పన పెరుగుతుంది. ఉద్యోగాలు పెరుగు తాయి. తద్వారా కాస్త ఆర్థిక భారం పెరిగినా, దాని ద్వారా పెరిగేది ఉపాధి కల్పనే. అందువల్ల అదికూడా ప్రజల అభివృద్ధిలో భాగమే.
ప్రస్తుతం దేశంలో 683 జిల్లాలు కొనసాగుతు న్నాయి. భారతదేశంలో చారిత్రక పరిణామాల కార ణంగా ఉత్తర అమెరికాలో వలెనే, అతి చిన్న రాష్ట్రాలు, అతి పెద్ద రాష్ట్రాలు, అతి చిన్న జిల్లాలు, అతి పెద్ద జిల్లాలు సహజీవనం చేస్తున్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సాగునీటి, తాగునీటి అవసరాల గురించి ఎంత నిర్దిష్టంగా మన వాటాకోసం, మన అవసరాలకోసం కృషి చేయడం జరుగుతున్నదో గమనిస్తూనే ఉన్నాము. విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం తెలంగాణ రాష్ట్రం చేయని కృషి లేదు. అలాగే జిల్లా ప్రాతిపదికన కూడా నిర్దిష్ట ప్రాంతాల, ప్రజల అభివృద్ధి వేగవంతమవుతుంది.
ఏ ఉద్యమాలూ అవసరం లేకుండా ముందు చూపుతో తెలంగాణలో ప్రజల అవసరాలను, ఆకాం క్షలను గుర్తించి నూతన జిల్లాలు, నూతన మండలాలు, నూతన గిఫ్టు గ్రామాలు, నూతన జిల్లాల ఔటర్ రింగ్ రోడ్లు, నూతన జాతీయ రహదారుల ఏర్పాటు, నూతన స్టార్టప్‌లు, వైజ్ఞానిక ప్రదర్శనలు, ప్రయోగాలు, నైపు ణ్యాల పెంపుదలకు బీసీ ఎడ్యుకేషనల్ అకాడమీ, గురు కుల, కేజీ టు పీజీ, ఉచిత విద్య వంటివి వేగవంతంగా అమలులోకి తీసుకురావడం జరుగుతున్నది.
అనేక చారిత్రక కారణాల వల్ల, పరిణామాల వల్ల, మన దేశంలో, మన తెలంగాణాలో ప్రతి 25-30 కిలో మీటర్లకు భాషలో మార్పులు, మాండలికాలు ప్రత్యే కంగా కొనసాగుతున్నాయని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారిం చారు. అలాగే భాషా మాండలికాలతోపాటు, సంస్కృ తిలో, పండుగల్లో, ఆచార వ్యవహారాల్లో, ఆలోచనా విధానాల్లో వైవిధ్యం, వైరుధ్యం కొనసాగుతూ వస్తు న్నది. అందువల్ల భాషా, సాంస్కృతిక పరిణామాలను అనుసరించి కూడా చిన్న జిల్లాలను స్వాగతించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారి మాండలిక, వ్యవహారిక, మాతృభాషకు గౌరవం ఏర్పడుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, చిన్న జిల్లాలుగా పరిపాలనా వ్యవస్థలు ఏర్ప ర్చడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మౌలిక అభివృద్ధికి వేస్తున్న నూతన మార్గం.
వ్యాసకర్త: డా॥వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్
మొబైల్ : 98499 12948
కొత్త జిల్లాలతో ప్రజల్లో చిగురించిన ఆశలు
Published Fri, Oct 14 2016 12:55 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
Advertisement