బతుకుసీమ | minister harish rao speech on telangana formation day | Sakshi
Sakshi News home page

బతుకుసీమ

Published Thu, Jun 2 2016 11:10 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

బతుకుసీమ - Sakshi

బతుకుసీమ

మెతుకుసీమను తీర్చిదిద్దుతాం
అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
పుష్కలంగా నిధులు..నీళ్లు
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాగునీటి రంగానికి పెద్దపీట
2017 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ మెదక్
ఆవిర్భావ వేడుకల ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు


1,628 కి.మీ. రోడ్ల నిర్మాణానికి..రూ. 364 కోట్లు
మిషన్ కాకతీయ తొలి విడతలో చెరువులకు కేటాయింపు  1,679
రెండో విడత చెరువు పనులు  రూ. 24 కోట్లు
ఘనపురం ఎత్తు పెంపునకు..  రూ. 3,104 కోట్లు
జిల్లాలో మిషన్ భగీరథ పనులు 2,412
భగీరథ ద్వారా నీళ్లందే గ్రామాలు రూ.197.97 కోట్లు
పంట నష్ట పరిహారం ప్రతిపాదన రూ. 483 కోట్లు
రైతుల ఖాతాలో ‘రుణమాఫీ’ జమ రూ.36 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు..  71
నిర్మించే విద్యుత్ ఉప కేంద్రాలు రూ.706 కోట్లు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం.. 11,400
జిల్లాలో నిర్మించే ‘డబుల్’ ఇళ్లు 3.74 కోట్లు
నాటనున్న హరితహారం మొక్కలు 24
కొత్తగా నిర్మించే పీహెచ్‌సీలు రూ.11.70 కోట్లు
90 పంచాయతీ భవనాలకు..  రూ.78 కోట్లు
పంచాయతీలకు గ్రాంట్లు రూ.1,766 కోట్లు

సాక్షి, సంగారెడ్డి : సమైక్య పాలనలో అందరి కన్నా ఎక్కువ నష్టపోయిన మెదక్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలో జిల్లాకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గోదావరి జలాలను తీసుకువచ్చి మెతకుసీమను బతుకుసీమగా మారుస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నాటికి జిల్లాను మలవిసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి హరీశ్‌రావు జాతీయజెండాను  ఎగురవేశారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన సాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రైతులు తీసుకున్న రూ.లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు.

 సాగునీటి రంగానికి పెద్దపీట
ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో రూ.364 కోట్లతో 1,684 చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. అలాగే రెండవ విడతలో 1,679 చెరువుల పూడికతీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఘనపురం ఆనకట్టు ఎత్తుపెంపుతో అదనంగా 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గోదావరి జలాలను జిల్లాకు మళ్లించేందుకు 50 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్, 21 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.

 సీఎం చేతుల మీదుగా మిషన్ భగీరథ
ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.3,104 కోట్లతో 2,412 గ్రామాలకు తాగునీరు అందజేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతగా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు తాగునీరు సరఫరా చేస్తామన్నారు. గజ్వేల్‌లో త్వరలో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లాను స్వఛ్చ మెదక్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలో పటాన్‌చెరు, మెదక్ నియోజకవర్గాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించనున్నట్టు చెప్పారు. జిల్లాలో కరువు నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

రైతులకు రూ.197.97 కోట్ల పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. పంట రుణమాఫీ కింద 3.96 లక్షల రైతుల ఖాతాల్లో రూ.483 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద జిల్లాకు రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రైతులు ఖరీఫ్‌లో సోయా, పప్పు దినుసులను సాగు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా కోసం 71 విద్యుత్ ఉప కేంద్రాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

 రూ.706 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
జిల్లాలో రూ.706 కోట్లతో 11,400 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇళ్ల నిర్మాణం పనుల బాధ్యతలను ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించినట్లు తెలిపారు. మంజూరైన ఇళ్లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిందిగా ఇంజనీరింగ్ శాఖలను కోరారు. హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రస్తుత వర్షాకాలంలో 3.74 కోట్ల మొక్కలను నాటనున్నట్లు చెప్పారు. భూ పంపిణీలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో కొత్తగా 24 పీహెచ్‌సీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మెదక్, సదాశివపేటలో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో కొత్తగా రూ.11.70 కోట్ల వ్యయంతో 90 పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీలకు రూ.78 కోట్ల గ్రాంట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

 కొత్త రోడ్లు, గోదాములు
జిల్లా వ్యాప్తంగా రూ.1,766 కోట్లతో 1,628 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లాలో కొత్తగా రూ.138 కోట్లతో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 43 గోదాములను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మెదక్, నారాయణఖేడ్‌లో రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో రూ.5 కోట్ల ఎంపీ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హాస్టల్, బడి పిల్లలకు సన్న బియ్యం భోజనం పెడుతున్నట్లు చెప్పారు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్‌చైర్మన్ గోవర్థన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement