welfare benefits
-
మరో 68,990 మందికి సంక్షేమ ఫలాలు
సాక్షి, అమరావతి : జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ► అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ► అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్‌చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. ► సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ► ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత.. ► సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు. ► లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. ► నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి చేకూరుస్తోంది. -
అర్హతే ప్రామాణికం
సాక్షి నెట్వర్క్: కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. అర్హులైన ప్రతిపేదకు సంక్షేమ ఫలాలు అందిస్తాం.. లబ్ధిపొందడానికి అర్హతే ప్రామాణికం.. ఇవీ సీఎం వైఎస్ జగన్ చెప్పే మాటలు. ఆ మాటలు క్షేత్రస్థాయిలో నిరూపణ అవుతున్నాయి. ఏళ్ల తరబడి జాగాకోసం కళ్లు కాయలుకాచేలా చూస్తూ.. చెప్పులరిగేలా తిరుగుతూ.. పడిన కష్టాలు తీరుతున్నాయని లబ్ధిదారులు సంతోషంగా చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం 13వ రోజు బుధవారం కోలాహలంగా సాగింది. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థికి, జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి భార్యకు ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తనకు గతంలో టీడీపీ అంటే అభిమానమని, ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు తనకు స్థలం ఇవ్వలేదని.. ఇప్పుడు తాను కాలు కదపకుండా స్థలమేకాదు.. ఇల్లు కూడా మంజూరు చేశారని మరో లబ్ధిదారు చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే అర్హతే ప్రామాణికమన్న సీఎం మాటలు నూరుశాతం అమలవుతున్నాయని ప్రజలు జేజేలు పలుకుతున్నారు. కృష్ణాజిల్లాలో 25,645 ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17,285 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 15,809 ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 14,990 పట్టాలు అందజేశారు. విశాఖ జిల్లాలో 10,904 పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లా మీనాపురం వద్ద ఇళ్ల స్థలాల లేఅవుట్ మంత్రి ముత్తంశెట్టి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 8,809 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 8,577 పట్టాలు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,401 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 4,624 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో 4,430 మందికి, కర్నూలు జిల్లాలో 4,333 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3,529 మందికి పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 3,322 మందికి పట్టాలు పంపిణీ చేశారు. -
ప్రగతి పరుగులు.. సంక్షేమ ఫలాలు
మూడు రంగాలూ ప్రగతిపథంలో.. ఆంధ్రప్రదేశ్ 2019–20లో మూడు రంగాల్లోనూ ప్రగతిపథంలో సాగింది. వ్యవసాయ, పరిశ్రమలు, సేవా రంగాల్లో పురోభివృద్ధి సాధించింది. ఈ మూడు రంగాల్లో అంచనాలకు మించి సాధించిన జీఎస్డీపీ వివరాలు ఇలా... సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవశకానికి తెర లేచింది. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమన పథంలో ఉరకలెత్తుతోంది. జాతీయ వృద్ధిరేటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం విశేషం. అభివృద్ధి, సంక్షేమ ప్రమాణాల్లో దేశ సగటు కంటే రాష్ట్రం మెరుగ్గా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘2019–20 ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే’ నివేదిక ఈ వాస్తవాలను గణాంకాలతో సహా వెల్లడించింది. ప్రజలు తనపై నమ్మకం ఉంచి.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలుకు నవరత్నాల పథకాలతో శ్రీకారం చుట్టారు. దీంతో అటు పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు.. ఇటు వినూత్న రీతిలో అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రగతి రథం జోరుగా పరుగెడుతోంది. 2019–20 ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 8.16% వృద్ధి ► రాష్ట్రం 8.16% వృద్ధి సాధించింది. జాతీయ వృద్ధి కంటే ఇది 3.16 శాతం అధికం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2019–20లో మన రాష్ట్రం ‘స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి’ (జీఎస్డీపీ) 8.16% సాధించింది. దేశ వృద్ధి రేటు 5 శాతం ఉంది. ► ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.9,72,782 కోట్ల స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించింది. 2018–19లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,62,957 కోట్లు మాత్రమే. ఈ లెక్కన రూ.1.10 లక్షల కోట్లు అధికంగా జీఎస్డీపీ సాధించడం విశేషం. పండగలా వ్యవసాయం ► రాష్ట్రంలో వ్యవసాయం పండగగా మారింది. సకాలంలో వర్షాలు పడటం, ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూడటంతో వ్యవసాయానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ► అందువల్ల వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 18.96 శాతం, ఉద్యాన రంగంలో 11.67 శాతం, పశు సంపద రంగంలో 4.53 శాతం వృద్ధి సాధ్యమైంది. ► రాష్ట్రంలో పరిశ్రమల రంగం 5.67 శాతం వృద్ధి సాధించింది. సేవా రంగం 9.11 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రజల చెంతకు ప్రగతి ఫలాలు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఫలాలు ప్రజలకు చేరుతున్నాయి. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటం విశేషం. ► 2019–20లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1,69,519గా నమోదైంది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,432 మాత్రమే. 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,51,173 మాత్రమే. 2018–19తో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 12.14 శాతం పెరిగింది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నవరత్నాల పథకాలను అమలు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో నవ శకానికి తెరలేచింది. వికసిస్తున్న విద్యా రంగం ► రాష్ట్రంలో 67.35 శాతం అక్షరాస్యత నమోదైంది. ఈ శాతాన్ని పెంచి భావి పౌరులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం ఉద్యుక్తమైంది.‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద పిల్లలను చదివించే ప్రతి పేద తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 42.33 లక్షల మంది పేద అమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.6,336.45 కోట్లు జమ చేసింది. ► విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 35.99 లక్షల మంది విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తోంది. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గాయి. ► ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని రాణించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ► ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద రాష్ట్రంలో 15,715 పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. ► ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇతరత్రా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13.26 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ విద్యార్థుల కాలేజీ ఫీజుల కింద రూ.3,329.49 కోట్లు చెల్లించింది. ► ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద విద్యార్థుల హాస్టల్, వసతి ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో 8.08 లక్షల మంది అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ విద్యార్థులకు రూ.2,087 కోట్లు చెల్లించింది. ► ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని అమలు చేస్తోంది. రూ.1,105 కోట్లు ఖర్చు చేసింది. 2019–20లో రూ.1,105 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో 36 లక్షల మందికి ప్రయోజనాన్ని కలిగించింది. సామాజిక పింఛన్లతో ఆర్థిక భద్రత ► అర్హులందరికీ సామాజిక పింఛన్లతో ప్రభుత్వం పేదలకు ఆర్థిక భద్రతనిస్తోంది. 2019–20లో వృద్ధాప్య, వితంతు, కల్లు గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్ఐవీ బాధితుల పింఛన్లను రూ.2,250కు పెంచారు. దివ్యాంగులకు రూ.3 వేలు, డయాలసిస్ చేయించుకునే కిడ్నీ బాధితులకు రూ.10 వేలిస్తున్నారు. ► పింఛన్ పొందేందుకు అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. 2020 జనవరిలో కొత్తగా 6.14 లక్షల పింఛన్లు ఇచ్చారు. ప్రతి నెలా రాష్ట్రంలో 54.68 లక్షల మంది పింఛన్‌దారులకు రూ.1,320.76 కోట్లు పింఛన్లుగా పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 2019–20లో రూ.15,635 కోట్లు కేటాయించారు. 2020–21లో రూ.18 వేల కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఆరోగ్యానికి భరోసా ► రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వైద్య, ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి పరుస్తుండటంతోపాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ► చైల్డ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 93 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారు. ► రాష్ట్రంలో రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న 144 లక్షల కుటుంబాలు లబ్ధిదారులుగా ఉన్నారు. 2019–20లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2.70 లక్షల మంది ప్రయోజనం పొందారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద రాష్ట్రంలో 1,529 నెట్వర్క్ ఆసుపత్రుల్లో 1,259 రోగాలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్రం వెలుపల హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా విస్తరించారు. ఆ మూడు నగరాల్లోని 130 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 716 రకాల రోగాలను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. ► ఆపరేషన్ అనంతరం రోగి కోలుకునే వరకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అలవెన్స్ ఇస్తోంది. రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 1.05 లక్షల మంది రోగులకు రూ.73 కోట్లు అలవెన్స్‌గా చెల్లించింది. ► రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని 2019–20లో ప్రారంభించారు. దీని కింద 60,406 పాఠశాలలను కవర్ చేశారు. ఇప్పటికి 66 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 4.35 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. 1.52 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. 46,287 మందికి తదుపరి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. దశలవారీగా మద్య నియంత్రణ దిశగా.. ► రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఇందులో భాగంగా 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది. 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. మద్యం విక్రయ సమయాన్ని తగ్గించి, ధరలను పెంచింది. పేద మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ ► పేద మహిళల సంక్షేమం కోసం ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 2020–21 నుంచి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయనుంది. వైఎస్సార్ ఆసరా ► 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణ బకాయిలను చెల్లించేందుకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 నుంచి నాలుగేళ్లపాటు అమలు చేయనుంది. గ్రామ స్వరాజ్యం పరిపాలనను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పింది. రాష్ట్రంలో 2,61, 216 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలను అందిస్తోంది. పౌరుల సమస్యల పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 72 గంటల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తుండటం విశేషం. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట ► టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ‘జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్’ను ఏర్పాటు చేసింది. రూ.100 కోట్లు కంటే విలువైన కాంట్రాక్టుల బిడ్డింగ్ ప్రక్రియకు ముందుగా డాక్యుమెంట్లను ఈ కమిషన్ పరిశీలిస్తుంది. ► చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ నవోదయం’ కార్యక్రమాన్ని చేపట్టింది. 2019 సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. అందరికీ ఇళ్లు ► ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయనుంది. ► ఒక్కో ఇంటికి రూ.7.50 లక్షల చొప్పున రాబోయే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. 2020–21లో 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. పోర్టులు ► కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ఇక్కడి నుంచి విమాన సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తారు. ► మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్, రామాయపట్నంలలో కొత్తగా నాలుగు పోర్టులు నిర్మాణ ప్రక్రియను చేపట్టింది. ► రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తోంది. రూ.18,691.42 కోట్ల పెట్టుబడితో 215 ఐటీ కంపెనీలను తీసుకువచ్చేందుకు ఉద్యుక్తమైంది. తద్వారా రాష్ట్రంలో 1,10,343 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ► రూ.30,656.16 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 128 ఎలక్ట్రానిక్ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. తద్వారా 1,07,864 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రాబోయే ఐదేళ్లలో ఈ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వడివడిగా జలయజ్ఞం ► రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం కార్యక్రమం కింద రాష్ట్రంలో 54 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో 14 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ► మరో రెండు ప్రాజెక్టుల రెండో దశను పూర్తి చేసింది. అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. రైతు సంక్షేమం ► రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సహాయం అందిస్తోంది. రాష్ట్రంలో నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులు 46.69 లక్షల మంది ప్రయోజనం పొందారు. వారిలో 1.58 లక్షల మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 2019–20లో రైతుల ఖాతాల్లో రూ.6,534 కోట్లు జమ చేశారు. ► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాకు గ్రామ సచివాలయాల్లో 10,614 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది. రైతుల ప్రయోజనం కోసం ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. 2019 ఖరీఫ్ సీజన్లో 21.53 లక్షల మంది రైతులు పంటల బీమా కింద పేర్లు నమోదు చేసుకున్నారు. వారి తరఫున ప్రభుత్వం రూ.12,70.01 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ► రూ.లక్షలోపు వ్యవసాయ రుణం తీసుకుని చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాల పథకం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తోంది. ► ఆయిల్‌పాం, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానం సాధించింది. మామిడి, బత్తాయి, పసుపు ఉత్పత్తిలో రెండో స్థానం దక్కించుకుంది. ► మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో చెల్లించే పరిహారాన్ని ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. అందుకోసం రూ.102.33 కోట్లు చెల్లించి రాష్ట్రంలో 1.02 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగించింది. దశా దిశా మార్చే విధాన నిర్ణయాలు ► శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ► నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ► నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించింది. 41 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ► మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ‘దిశా’ చట్టాన్ని చేసింది. ► ఏపీఎస్ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసింది. తద్వారా ఏపీఎస్ఆర్టీసీని పరిరక్షించడమే కాకుండా 51,488 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించింది. ► అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, హోంగార్డుల జీతాలను పెంచింది. అభివృద్ధి వికేంద్రీకరణ ► అభివృద్ధి ఫలాలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమానంగా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించేందుకు మూడు రాజధానుల ఏర్పాటును ప్రతిపాదించింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ శాసనసభలో బిల్లులను ప్రవేశ పెట్టింది. ► రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసింది. అందుకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పింది. ► సొంత ఆటో రిక్షాలు / ట్యాక్సీలు/ మ్యాక్సి క్యాబ్‌లు ఉన్న ఆటో కార్మికులకు ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో 2.62 లక్షల మందికి ప్రయోజనం కల్పించింది. ► పేద చేనేత కార్మికులకు సహాయం చేసేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అర్హులైన లబ్ధిదారులకు ఏటా రూ.24 వేలు ఆర్థిక సహాయం చేస్తోంది. అందుకోసం రూ.196.27 కోట్లు పంపిణీ చేయడం ద్వారా 81,779 మందికి ప్రయోజనం కల్పించింది. -
ఇంటింటికీ మోడీ సంక్షేమ ఫలాలు
ఎల్లారెడ్డిపేట: ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి గడపగడపకూ అందించాలనే లక్ష్యంతో బీజేపీ ఇంటింటికి మోదీ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆపార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో గురువారం బీజేపీ మూడు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఉపయోగించుకొని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. మూడేళ్ల కేసీఆర్ పాలనలో హామీలే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దుల బుగ్గారెడ్డి, బోడ మల్లేశం, రాజు, సామల్ల హన్మయ్య, గజ్జెల ఆనందం, శ్రీశైలం, సతీశ్, నాగరాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతికి బాటలు వేస్తా
♦ పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే ♦ ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం ♦ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి ♦ పాలనా సౌలభ్యం కోసమే ఆళ్లపల్లి, కరకగూడెం మండలాలు ♦ మౌలిక సౌకర్యాలతో పాటు అన్నిరంగాల అభివృద్ధిపై ద్రుష్టి మణుగూరు : ‘అభివృద్ధిలో పినపాక నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతా. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తా. మణుగూరు పట్టణాభివృద్ధిపై దృష్టి సారిస్తా. అత్యంత వెనుకబడిన గుండాల మండలాన్ని రోడ్ల నిర్మాణంతో ప్రగతి పథం పట్టిస్తా. పాలనా సౌలభ్యం కోసమే నియోజకవర్గంలో ఆళ్లపల్లి, కరకగూడెంలను నూతన మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సీఎంను ఒప్పించాం. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వామిగా ఉంటాను. మండలాల వారీగా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాను. ’ అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శాసనసభ్యునిగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్లలో అభివృద్ధిపై... మొదటి శాసనసభ సమావేశాల్లో భద్రాద్రి పవర్ ప్లాంట్ గురించి ప్రస్తావించాను. సీఎంతో అనేకసార్లు మాట్లాడి రూ.7,250 కోట్ల థర్మల్ ప్లాంటు సాధించా. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 307 చెరువులను రూ.82 కోట్లతో అభివృద్ధి చేశా. మరో నెల రోజుల్లో బూర్గం పాడు మండలంలో 7,500 ఎకరాలకు సాగునీరు అందించే కిన్నెరసాని ఎడమ కాలువ పనులు పూర్తి కానున్నాయి. మణుగూరుకు 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. రూ.3కోట్ల సీడీపీ నిధులతో సీసీరోడ్లు,డ్రెయిన్లు, బోర్లు వేయించా. బూర్గంపాడు-ఏటూరునాగారం రహదారిని జాతీయ రహదారిగా మార్పించా. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. వైద్య, ఆరోగ్య మంత్రితో మాట్లాడి ఆళ్లపల్లి, పినపాక, బూర్గంపాడు పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు మంజూరు చేయించా. మణుగూరు మండలం పేరంటాలచెరువుకు రూ.కోటి మంజూరు చేయించా. టెండర్లు పిలి చారు. వర్షాకాలం తరువాత పనులు ప్రారం భమవుతాయి. మిషన్‌భగీరథ ద్వారా 2017 డిసెంబర్‌కు నియోజకవర్గంలో అన్ని ఇళ్లకు నల్లా నీరు వస్తుంది. మొండికుంట, ఆళ్లపల్లి విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరు చేయించా. పినపాక మండలం మల్లారం, అశ్వాపురం, బూర్గం పాడు, గుండాల మండలం మర్కోడుల్లో రూ.5.5 కోట్లతో వ్యవసాయ గిడ్డంగులు మంజూరు చేయించా. రూ.2 కోట్లతో అంగన్వాడీ భవనాలు కట్టించా. రూ.8.50 కోట్లతో మణుగూరు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయిన్లు వేయించా. రూ.2.23 కోట్లతో మణుగూరులో మినీ ట్యాంక్‌బండ్ మంజూరు చేయించా. నీటిపారుదల, వ్యవసాయంపై..? నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. వచ్చే విడత మిషన్ కాకతీయలో అన్ని చెరువులు పూర్తి చేయిస్తా. పినపాక మండలంలో 28 గిరిజన గ్రామాల్లోని 10వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో రూ.90కోట్ల అంచనాతో పులుసుబొంత ప్రాజెక్టు నిర్మించేందుకు కృషి చేస్తున్నా. దీనిపై శాసనసభలో, సీఎంతోనూ మాట్లాడా. అటవీ, రెవెన్యూ, శాటిలైట్ సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది నిధులు మంజూరు అవుతాయి. పినపాక మండలం గొడుగుబండ వద్ద 900ఎకరాలకు సాగునీరు అందించే రూ.9కోట్ల వట్టివాగు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయి. గోదావరిపై పినపాక మండలం భూపతిరావుపేట, చింతలబయ్యారం, మణుగూరు మండలం అన్నారం లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు పంపా. వీటితో ఆరువేల ఎకరాలు సాగులోకి వస్తాయి. సమితిసింగారం పరిధిలో 2వేల ఎకరాలకు నీరందించే రేగులగండికి రూ.1.10 కోట్లతో టెండర్లు పిలిచారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ఏడీఏ కార్యాలయం నియోజకవర్గ కేంద్రం మణుగూరుకు మార్చడంతో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములా అమలు అయ్యేలా చేశా. విద్య, వైద్యంపై...? నియోజకవర్గానికి ఒక ఎస్సీ, మరొక ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించా. ఇందులో 5 నుంచి ఇంటర్ వరకు బోధిస్తారు. గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, వృత్తివిద్యా కళాశాల, పాలి టెక్నిక్ కళాశాలలకు ప్రతిపాదనలు పంపా. ఇప్పటికే ఐటీఐ, డిగ్రీ కళాశాలలు సాధించా. సీహెచ్‌సీ వైద్యులు క్షేత్రస్థాయి శిబిరాలు పెట్టకుండా అంబులెన్స్‌లు ఆగిపోయాయి. మొండికుంట, బూర్గంపాడు, మణుగూరుల్లో కొత్త పీహెచ్‌సీలకు ప్రతిపాదనలు పంపా. రోడ్డు కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధిపై...? బూర్గంపాడు-ఏటూరునాగారం రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు కృషి చేశా. కిన్నెరసాని, మల్లన్నవాగు, జల్లేరువాగు, ఏడుమెలికలవాగులపై వంతెనలు, శాశ్వత రోడ్ల కోసం కృషి చేస్తున్నా. గుండాల-సాయనపల్లి-దామెరతోగు, చెట్టుపల్లి-కొమరారం రోడ్లు పీఆర్ నుంచి ఆర్‌అండ్‌బీకి బదలాయించాం. దీనికి మంత్రి తుమ్మల ఇచ్చిన సహకారం మరువలేనిది. గొల్లగూడెం-చొప్పాల వంతెనకు రూ.4.5 కోట్లు మంజూరు చేయించా. ఇక్కడ బ్రిడ్జి కమ్ చెక్‌డ్యాం నిర్మిస్తాం. మారుమూల ప్రాంతాలు..? మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నా. కొత్తగా గుండాల నుంచి ఆళ్లపల్లి, పినపాక నుంచి కరకగూడెం మండలాలు ఏర్పాటు చేయాలని భౌగోళిక వివరాలతో సీఎంను కోరాను. దీనికి ఆయన అంగీకరించారు. మణుగూరు పట్టణ అభివృద్ధిపై..? మణుగూరులో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి తుమ్మల సహకారంతో ప్రత్యేక కృషి చేస్తున్నా. ఇప్పటికే నాయుడుకుంట మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.2.23కోట్లు మంజూరు చేయించా. మరో రూ.3.30కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చా. చినరావిగూడెం-పర్ణశాల మధ్య గోదావరిపై వంతెన కోసం రూ.150కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. -
బతుకుసీమ
♦ మెతుకుసీమను తీర్చిదిద్దుతాం ♦ అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ♦ పుష్కలంగా నిధులు..నీళ్లు ♦ గోదావరి జలాలతో సస్యశ్యామలం ♦ సాగునీటి రంగానికి పెద్దపీట ♦ 2017 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ మెదక్ ♦ ఆవిర్భావ వేడుకల ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు ⇔ 1,628 కి.మీ. రోడ్ల నిర్మాణానికి..రూ. 364 కోట్లు ⇔ మిషన్ కాకతీయ తొలి విడతలో చెరువులకు కేటాయింపు 1,679 ⇔ రెండో విడత చెరువు పనులు రూ. 24 కోట్లు ⇔ ఘనపురం ఎత్తు పెంపునకు.. రూ. 3,104 కోట్లు ⇔ జిల్లాలో మిషన్ భగీరథ పనులు 2,412 ⇔ భగీరథ ద్వారా నీళ్లందే గ్రామాలు రూ.197.97 కోట్లు ⇔ పంట నష్ట పరిహారం ప్రతిపాదన రూ. 483 కోట్లు ⇔ రైతుల ఖాతాలో ‘రుణమాఫీ’ జమ రూ.36 కోట్లు ⇔ వ్యవసాయ యాంత్రీకరణకు.. 71 ⇔ నిర్మించే విద్యుత్ ఉప కేంద్రాలు రూ.706 కోట్లు ⇔ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం.. 11,400 ⇔ జిల్లాలో నిర్మించే ‘డబుల్’ ఇళ్లు 3.74 కోట్లు ⇔ నాటనున్న హరితహారం మొక్కలు 24 ⇔ కొత్తగా నిర్మించే పీహెచ్‌సీలు రూ.11.70 కోట్లు ⇔ 90 పంచాయతీ భవనాలకు.. రూ.78 కోట్లు ⇔ పంచాయతీలకు గ్రాంట్లు రూ.1,766 కోట్లు సాక్షి, సంగారెడ్డి : సమైక్య పాలనలో అందరి కన్నా ఎక్కువ నష్టపోయిన మెదక్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలో జిల్లాకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గోదావరి జలాలను తీసుకువచ్చి మెతకుసీమను బతుకుసీమగా మారుస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నాటికి జిల్లాను మలవిసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో మంత్రి హరీశ్‌రావు జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన సాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రైతులు తీసుకున్న రూ.లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. సాగునీటి రంగానికి పెద్దపీట ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలో రూ.364 కోట్లతో 1,684 చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. అలాగే రెండవ విడతలో 1,679 చెరువుల పూడికతీత పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఘనపురం ఆనకట్టు ఎత్తుపెంపుతో అదనంగా 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గోదావరి జలాలను జిల్లాకు మళ్లించేందుకు 50 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్, 21 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సీఎం చేతుల మీదుగా మిషన్ భగీరథ ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ చేపట్టినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.3,104 కోట్లతో 2,412 గ్రామాలకు తాగునీరు అందజేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతగా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు తాగునీరు సరఫరా చేస్తామన్నారు. గజ్వేల్‌లో త్వరలో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లాను స్వఛ్చ మెదక్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలో పటాన్చెరు, మెదక్ నియోజకవర్గాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించనున్నట్టు చెప్పారు. జిల్లాలో కరువు నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రైతులకు రూ.197.97 కోట్ల పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. పంట రుణమాఫీ కింద 3.96 లక్షల రైతుల ఖాతాల్లో రూ.483 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద జిల్లాకు రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రైతులు ఖరీఫ్‌లో సోయా, పప్పు దినుసులను సాగు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా కోసం 71 విద్యుత్ ఉప కేంద్రాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.706 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జిల్లాలో రూ.706 కోట్లతో 11,400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇళ్ల నిర్మాణం పనుల బాధ్యతలను ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించినట్లు తెలిపారు. మంజూరైన ఇళ్లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిందిగా ఇంజనీరింగ్ శాఖలను కోరారు. హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రస్తుత వర్షాకాలంలో 3.74 కోట్ల మొక్కలను నాటనున్నట్లు చెప్పారు. భూ పంపిణీలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో కొత్తగా 24 పీహెచ్‌సీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మెదక్, సదాశివపేటలో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో కొత్తగా రూ.11.70 కోట్ల వ్యయంతో 90 పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీలకు రూ.78 కోట్ల గ్రాంట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కొత్త రోడ్లు, గోదాములు జిల్లా వ్యాప్తంగా రూ.1,766 కోట్లతో 1,628 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లాలో కొత్తగా రూ.138 కోట్లతో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 43 గోదాములను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మెదక్, నారాయణఖేడ్‌లో రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో రూ.5 కోట్ల ఎంపీ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హాస్టల్, బడి పిల్లలకు సన్న బియ్యం భోజనం పెడుతున్నట్లు చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్‌చైర్మన్ గోవర్థన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంకు పేదలంటే చులకన భావం
బేస్తవారిపేట. రాష్ట్ర ప్రజలను నిత్యం దగా, మోసం చేస్తున్న సీఎంకు పేదలంటే చులకన భావం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నేకునాంబాద్, చింతలపాలెం, గొట్టమిండ్లు గ్రామాల్లో పల్లెపల్లెకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీకులంలో పుట్టాలని ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నాడు. బీసీలకు ఎన్నికల సమయంలో సబ్‌ప్లాన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సబ్‌ప్లాన్ వారికే ఉపయోగిస్తానన్నాడు ఎక్కడ అమలు చేయలేదు. అసలు, వడ్డీ భారంగా మారడంతో రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దివంగతనేత వైఎస్సార్ పాలనలో పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు తాతపూడి ఐజయ్య, మండల ఉపాధ్యక్షుడు కారెపోతుల రంగయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొల్లా బాలిరెడ్డి, బేస్తవారిపేట సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు బారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చిలకల కేశవరెడ్డి, కోనపల్లె సర్పంచి నాదేళ్ల శ్రీనువాసులు, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు సూరా స్వామిరంగారెడ్డి, అరుణ్‌కుమార్ యాదవ్, పి. ఈశ్వరరెడ్డి, నాయకులు టీవీఎస్పీ శర్మ, డి. ఖాజామీయా పాల్గొన్నారు. -
అయోమయం.. గిరి‘జనం’
- జిల్లాలో గిరిజనుల జనాభాపై కొరవడిన స్పష్టత - జనాభా అధికంగా ఉన్నా తక్కువగా చూపుతున్నార నే ఆరోపణలు - సంక్షేమ నిధుల కేటాయింపుల్లో కోత కడప రూరల్ : సాధారణంగా ఎక్కడైనా జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ లెక్కల ప్రకారమే సంక్షేమ ఫలాలు అందుతుంటాయి. అయితే, జిల్లాలో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువగా చూపుతున్నారనే వాదన వినిపిస్తూనే ఉంది. 2011 లెక్కల ప్రకారం... 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 65 వేల మంది వరకు గిరిజనులు ఉన్నారు. 2011కు వచ్చేసరికి జిల్లా జనాభా మొత్తం 28 లక్షల 84 వేల 524మంది. అందులో గిరిజనుల జనాభా 75 వేల 886 మంది ఉన్నారు. అందులో పురుషులు 38 వేల 571 మంది, మహిళలు 37 వేల 315 మంది ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. కేవలం కడప నగర పరిధిలోనే పురుషులు 13 వేల 390 మంది, స్త్రీలు 13 వేల 292 మంది కలిపి మొత్తం 26 వేల 672 మంది గిరిజనులు ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయ. తాజాగా జిల్లాలో 1.20 లక్షల నుంచి 1.50 లక్షల వరకు గిరిజన జనాభా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓ అంచనా ప్రకారం జిల్లాలో 1లక్షా 3వేల 631 మంది గిరిజన జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలపై ప్రభావం జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు తదితర ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో సుగాలి, ఎరుకల, యానాది వర్గాలకు చెందిన వారు ఈ తెగ కిందికి వస్తారు. అలాగే అక్కడక్కడా చెంచులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సంక్షేమ ఫలాలు జనాభా ప్రాతిపదికన అందుతాయి. జనాభా తక్కువగా ఉంటే అదే పరిమాణంలో బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. ఆ ప్రభావం ఆయా వర్గాలపై పడనుంది. నిర్దిష్టంగా జనాభా ఉంటే సంక్షేమ ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాశ్వత కార్యాలయానికి మోక్షం లేదా? జిల్లాలో గిరిజన సంక్షేమ, కార్పొరేషన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు మినహా ఆ శాఖకు సంబంధించిన అధికారులు లేరు. మిగతా సిబ్బంది డిప్యుటేషన్‌పై వచ్చి వెళ్లే వారే. దీంతో శాఖ పరిపాలనపై పట్టు లేకపోవడమో, జవాబు దారితనం లేకపోవడమో జరుగుతోంది. గతంలో ఈ శాఖలోని సిబ్బంది పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అదే శాశ్వత కార్యాలయంతోపాటు ఆ శాఖ సిబ్బందిని నియమిస్తే ఎలాంటి అక్రమాలకు, సమస్యలకు చోటు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో గిరిజన వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏయే వృత్తులు చేపడుతున్నారనే వివరాలు సేకరిస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో గిరిజనుల సంఖ్య 75,886 మంది ఉన్నారు. కొందరి అభిప్రాయం మేరకు జనాభా ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా వివరాలను సేకరిస్తున్నాం. ఒకవేళ జనాభా ఎక్కువగా ఉంటే సంక్షేమ ఫలాల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుంది. - లలితాబాయి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి -
అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు
మంత్రి పీతల సుజాత లింగపాలెం : ఆర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేస్తామని రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మంత్రి సుజాత లింగపాలెం మండలంలోని లింగపాలెం శివారు కళ్యాణంపాడు వెళ్లే రోడ్డుకు పుష్కర నిధుల నుంచి 40 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, కె.గోకవరం శివారు అన్నపనేనివారిగూడెం గ్రామంలో మండల పరిషత్ పదమూడోవ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీతల సుజాత మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పేదప్రజల కోసం ఐదురెట్లు పింఛన్‌ను పెంచిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుదేనన్నారు. త్వరలో డ్వాక్రా మహిళల, రైతు రుణాల మాఫీని పూర్తి చేస్తామన్నారు. వేసవిలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మహానాడుకు ఆరు బస్సులు : ఈనెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే మహానాడుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని సుజాత అన్నారు. సోమవారం లింగపాలెంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహానాడుకు వచ్చేందుకు చింతలపూడి నియోజకవర్గం నుంచి 6 ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు చేశానన్నారు. ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, జెడ్పీటీసీ గుత్తా పెద్దబాబు, లింగపాలెం సర్పంచ్ కేశిన శ్రీహరి, నాయకులు నందిగం బాబి, చెరువుగట్టు రామ్మోహనరావు, గజ్జా వెంకటేశ్వరావు, అసిలేటి జయరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆ ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే
- అందరూ అందుబాటులో ఉండాల్సిందే.. - కుటుంబ సర్వే’ పై అధికారుల కసరత్తు - అధికారులను అప్రమత్తం చేసిన ఇన్చార్జి కలెక్టర్ ముకరంపుర : సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక్క రోజులోనే రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహించాలని నిర్ణయించడంతో 19వ తేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగులంతా భాగస్వాములై ప్రతీ ఇంటిగడప తొక్కనున్నారు. ఆ రోజు అందరూ స్థానికంగా అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉండేలా అందరికీ అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లను అప్రమత్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది సిబ్బంది ఉన్నారు? సర్వేకు ఎంత మంది అవసరం అనే అంశాలను యుద్ధప్రాతిపదికన నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. కసరత్తు సర్వేకోసం ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. నాలుగో తరగతి ఉద్యోగులనుంచి ఉన్నతాధికారుల వరకు 30,878 మంది ఉద్యోగులున్నట్లు జాబితా సిద్ధం చేశారు. సగటున ఒక్కో ఉద్యోగి 26 కుటుంబాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలక, నగరపాలక సంస్థల వారీగా క్రోడీకరించి వివరాలను ఎన్నికల బ్యాలెట్లు, ఈవీఎంల మాదిరిగా సీల్ వేసి వారం రోజుల సమయంలో డాటాను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9.70 లక్షల ఇళ్లు ఉన్నాయి. మరో 50 వేల నుంచి లక్షలోపు ఇళ్లు పెరిగే అవకాశముంది. 9.70 లక్షల కుటుంబాలకు 37,307 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా.. గతంలో జరిగిన సర్వేలో ఒక్కొక్కరు 40 కుటుంబాలు సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అవన్నీ తప్పుల తడకలేనని కొత్త ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ క్రమంలో లెక్కాపత్రం పక్కాగా ఉండాలని, పారదర్శకంగా సర్వే చేయకపోతే తగిన చర్యలకు బాధ్యులవుతారని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం 70 అంశాలతో రూపొందించిన ఫార్మాట్లోని ప్రశ్నలకు కుటుంబసభ్యులు నిజాయతీగా సమాధానమిస్తే మేలు జరిగే అవకాశముంది. కుటుంబసభ్యులు తప్పుడు సమాచారమిచ్చినా క్రిమినల్ చర్యలకు ఆస్కారముంది. ఈ సర్వే ప్రామాణికంగా తీసుకుని రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు, భూములు తదితర వాటిని లబ్ధిదారులకు మంజూరు చేస్తారు. ఉపాధి నిమిత్తం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది స్వస్థలాలనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఎప్పుడు సర్వే చేసినా వివరాలు సక్రమంగా ఉండక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 19న అందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించింది. అయితే కుటుంబం మొత్తం అందుబాటులో ఉండాలా? లేక ఒక్కరు ఇంటి వద్దే ఉండి సర్వే అధికారులకు వివరాలు చెబితే సరిపోతుందా అనే విషయమై స్పష్టత లేదు. 19నాడు అత్యవసర పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేవారి వివరాలు ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నెలల తరబడి వలస వెళ్లేవారి విషయంలో ఏం చేస్తారనేది తెలియడం లేదు. వివరాల సేకరణపై ప్రభుత్వం మరికొంత స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. -
కేసీఆర్ మోసకారి
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు రేపటి రాహుల్ సభను విజయవంతం చేయూలి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బచ్చన్నపేట, నర్మెటలో సినీ నటి జయసుధతో కలిసి రోడ్ షో బచ్చన్నపేట, నర్మెట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని మాట ఇచ్చి మోసం చేసిన వాడు మంచోడు కాదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరోక్షంగా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన సినీ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జయసుధతో కలిసి జనగామ నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట, నర్మెటలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పొన్నాల మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన వ్యక్తి, అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిన మనిషి... ఆ పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జనగామ ప్రాంతానికి గోదావరి జలాలను రప్పించించేందుకు నాడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కాలువల ద్వారా బచ్చన్నపేట మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు మళ్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రూ.26 కోట్లతో సబ్స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయించి లోఓల్టేజీ సమస్యను నివారించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి... మహిళా సాధికారతను చాటిందన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. ఈ మేరకు కానుకగా కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో సుస్థిర పాలన రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25వ తేదీన వరంగల్ నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారుని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయూలని పొన్నాల పిలుపునిచ్చారు. జనగామకు పొన్నాల వరం : జయసుధ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ నియోజకవర్గ ప్రజలకు దేవుడిచ్చిన వరమని జయసుధ కొనియాడారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. నా దేశం నా కోసం ఏమి చేసింది అని కాకుండా, నేను నా దేశం కోసం ఏమి చేశాననే ఆలోచనతో ముందుకుసాగే వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తర్వాత తెలంగాణకు వాచ్‌డాగ్‌లా ఉంటానన్నది నిజం కాదా... టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని బహిరంగ ప్రకటనలు చేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చిన మాట తప్పారని... ఆడబిడ్డకు మాట ఇచ్చి తప్పినవాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకొస్తారని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దొరల పాలన వస్తుందని హెచ్చరించారు. సామాజిక తెలంగాణ, కొత్త రాష్ట్ర అభివృద్ధి జాతీయ పార్టీ అరుున కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్య, జయసుధను పొన్నాల వైశాలి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. సభల్లో ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మాసపేట రవీందర్‌రెడ్డి, రాజనాల శ్రీహరి, మాజీ ఎమ్యెల్యేలు సీహెచ్.రాజిరెడ్డి, గొర్ల సిద్ధయ్య, టీ పీసీసీ అధికార ప్రతినిధులు మొగుళ్ల రాజిరెడ్డి, బక్క నాగరాజు, తొర్ర సత్యం, పట్టణ అధ్యక్షులు గుర్రపు బాల్‌రాజు, గిరబోయిన అంజయ్య, పుల్ల భాస్కర్, ఓయూ జేఏసీ నాయకురాలు బాల లక్ష్మి, ఈర్ల బుచ్చిరాములు, జల్లి సిద్ధయ్య, అర్జుల సుధాకర్‌రెడ్డి, భూక్య జూంలాల్ నాయక్, పెద్ది రాజిరెడ్డి, జంగిటి అంజయ్య, ప్రజ్ఞపురం యాదగిరి, గొల్లపల్లి కుమారస్వామి, కొంపెల్లి రమేష్, సర్పంచ్‌లు, నేతలు పాల్గొన్నారు. చేర్యాల సీఐ డేవిడ్, బచ్చన్నపేట, మద్దూరు, చేర్యాల ఎస్సైలు షాదుల్లాబాబా, వేణుగోపాల్, నరేందర్ బందోబస్తు నిర్వహించారు. -
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల అమలు తీరుపై మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అధికారులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల విజయవంతం కోసం జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానంగా విద్య, సన్నిహిత, మార్పు, వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమాల తీరుపై కలెక్టర్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, సంబంధిత శాఖల అధికారులు, ఆయా పథకాల లక్ష్యాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి జిల్లా వ్యాప్తంగా 556 ఉన్నత పాఠశాలల్లో 277 రెడ్, 243 ఎల్లో గ్రేడింగ్‌లో ఉన్నాయని, ఆయా పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గణితం, ఇంగ్లిష్, సామాన్య శాస్త్రంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని, ఆయా పాఠ్యాంశాల్లో మెరుగైన ఫలితాలకు వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేయాలని సూచించారు. వసతి గృహాల్లో మెరుగైన వసతులతో పాటు నాణ్యతతో కూడిన మెనూను అమలు చేసేందుకు సన్నిహిత కార్యక్రమం పేరిట దత్తత అధికారులను నియమించామన్నారు. వారంతా ఈనెల 15వ తేదీలోగా ఆయా వసతి గృహాలను సందర్శించి 15లోగా నివేదికను సాంఘిక సంక్షేమాధికారికి అందజేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో బాలల ఆరోగ్య పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని, స్థానిక వైద్యాధికారులతో కలిసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ‘మార్పు’ను సాధించాలి ఐసీడీఎస్, ఐకేపీ, ఆర్డబ్ల్యూఎస్, మెప్మా, డీఎంహెచ్ఓ శాఖల సమన్వయంతో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని కలెక్టర్ సూచించారు. గర్భిణుల గుర్తింపు, వైద్య పరీక్షలు, హైరిస్కు గర్భిణులను గుర్తించడం, పౌష్టికాహార పంపిణీ తదితర అంశాలపై గ్రామైక్య సంఘాలతో విధిగా చర్చించి, ఆయా సమావేశాలకు ఏఎన్ఎంలు హాజరయ్యేలా చూడాలన్నారు. విధిగా పీహెచ్సీ కేంద్రాలను తనిఖీ చేసి నిర్దేశించిన జాబితా ప్రకారం ఈనెల 15లోగా నివేదిక అందజేయాలన్నారు. వసతి గృహాల్లో స్కైప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. బీఆర్జీఎఫ్ పనుల జాప్యంపై ఆగ్రహం డివిజన్ స్థాయిలోన బీఆర్జీఎఫ్ పనులపై సమీక్ష నిర్వహించినా సంబంధిత పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు పూర్తి స్థాయి సమాచారంతో హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011-12కు సంబంధించి పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు నమోదులో సిద్దిపేట డివిజన్లో 1751 మంది విద్యార్థులు నూతనంగా నమోదయ్యారని, వీరికి వెంటనే కార్డులు జారీ చేస్తామని శరత్ తెలిపారు. లబ్ధిదారుల వద్దకే పింఛన్లు సామాజిక భద్రతా పింఛన్లు ఇకపై నిర్దేశిత సమయంలో నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను కలెక్టర్ఆదేశించారు. 500 మంది లబ్దిదారులకు ఒకరు చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా 2 నుంచి 7వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మ, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, సీపీఓ గురుమూర్తి, ఆర్డీఓలు ధర్మారావు, వనజాదేవి, ముత్యంరెడ్డి పాల్గొన్నారు.