ఇంటింటికీ మోడీ సంక్షేమ ఫలాలు | Modi from house to house welfare benefits | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ మోడీ సంక్షేమ ఫలాలు

Published Fri, Jun 2 2017 2:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

Modi from house to house welfare benefits

ఎల్లారెడ్డిపేట: ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలను ప్రతి గడపగడపకూ అందించాలనే లక్ష్యంతో బీజేపీ ఇంటింటికి మోదీ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆపార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో గురువారం బీజేపీ మూడు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఉపయోగించుకొని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. మూడేళ్ల కేసీఆర్‌ పాలనలో హామీలే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దుల బుగ్గారెడ్డి, బోడ మల్లేశం, రాజు, సామల్ల హన్మయ్య, గజ్జెల ఆనందం, శ్రీశైలం, సతీశ్, నాగరాజు, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement