మంత్రి పీతల సుజాత
లింగపాలెం : ఆర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేస్తామని రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మంత్రి సుజాత లింగపాలెం మండలంలోని లింగపాలెం శివారు కళ్యాణంపాడు వెళ్లే రోడ్డుకు పుష్కర నిధుల నుంచి 40 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, కె.గోకవరం శివారు అన్నపనేనివారిగూడెం గ్రామంలో మండల పరిషత్ పదమూడోవ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీతల సుజాత మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పేదప్రజల కోసం ఐదురెట్లు పింఛన్‌ను పెంచిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుదేనన్నారు. త్వరలో డ్వాక్రా మహిళల, రైతు రుణాల మాఫీని పూర్తి చేస్తామన్నారు. వేసవిలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
మహానాడుకు ఆరు బస్సులు : ఈనెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే మహానాడుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని సుజాత అన్నారు. సోమవారం లింగపాలెంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహానాడుకు వచ్చేందుకు చింతలపూడి నియోజకవర్గం నుంచి 6 ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు చేశానన్నారు. ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, జెడ్పీటీసీ గుత్తా పెద్దబాబు, లింగపాలెం సర్పంచ్ కేశిన శ్రీహరి, నాయకులు నందిగం బాబి, చెరువుగట్టు రామ్మోహనరావు, గజ్జా వెంకటేశ్వరావు, అసిలేటి జయరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు
Published Tue, May 26 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement