minister peethala sujatha
-
తేల్చుకుందాం.. రా
♦ ప్రభుత్వ విప్ చింతమనేనిపై మంత్రి సుజాత ఫైర్ ♦ నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటంటూ నిలదీత ♦ వాడీవేడిగా టీడీపీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి’ అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఒక సినిమా థియేటర్ ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే అయిన పీతల సుజాతను పిలవకుండా, విప్ చింతమనేని ప్రభాకర్‌ను పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ సమావేశంలో చర్చకు వచ్చింది. తనను ఆహ్వానించటంతో వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని చింతమనేని ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేనిచోట మరొకరు వచ్చి పాల్గొనడం ఎంతవరకూ సమంజసమని పీతల సుజాత ప్రశ్నించగా.. చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని సమాధానం చెప్పినట్టు భోగట్టా. దీంతో మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని సీరియస్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా వేరే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. మంత్రి సుజాత మాట్లాడుతూ తానూ పార్టీలో సీనియర్‌నని, పార్టీ కోసం కష్టపడ్డానని, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు విలువ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇరువురికి నచ్చజెప్పడంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగింది. -
చింతమనేనిపై మంత్రి సుజాత ఫైర్
► చింతమనేని తేల్చుకుందాం.. రా : మంత్రి పీతల ► నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటంటూ నిలదీత ► వాడీవేడిగా టీడీపీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి’ అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఒక సినిమా థియేటర్ ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే అయిన పీతల సుజాతను పిలవకుండా, విప్ చింతమనేని ప్రభాకర్‌ను పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ సమావేశంలో చర్చకు వచ్చింది. తనను ఆహ్వానించటంతో వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని చింతమనేని ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేనిచోట మరొకరు వచ్చి పాల్గొనడం ఎంతవరకూ సమంజసమని పీతల సుజాత ప్రశ్నించగా.. చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని సమాధానం చెప్పినట్టు భోగట్టా. దీంతో మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని సీరియస్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా వేరే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. మంత్రి సుజాత మాట్లాడుతూ తానూ పార్టీలో సీనియర్‌నని, పార్టీ కోసం కష్టపడ్డానని, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు విలువ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇరువురికి నచ్చజెప్పడంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగింది. -
పీతల సుజాతకు చేదు అనుభవం
ఏలూరు: ఏపీ మంత్రి పీతల సుజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏలూరులో గురువారం ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఆ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంత్రికి సమాచారమివ్వలేదు. ఏలూరు లోనే అందుబాటులో ఉన్నా ఎందుకు సమాచారం అందివ్వలేదని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో డీఎం అండ్ హెచ్వోపై చర్యలు తీసుకోవాలని సుజాత కలెక్టర్ ను కోరారు. -
మంత్రి పీతల సుజాత పరిస్థితి ఇది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తనదైన ముద్ర లేదు.. జిల్లా అధికారులపై పట్టులేదు.. అభివృద్ధి పనులను ముందుకు ఉరికించింది లేదు.. పార్టీని ఏకతాటి పైకి తెచ్చిందీ లేదు. జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఏకైక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పీతల సుజాత పరిస్థితి ఇది. స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా జిల్లాపై ఆమె తనదైన ముద్ర వేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జిల్లా నుంచి కేబినెట్లో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మంత్రిగా పీతల సుజాత రికార్డు సృష్టించారు. అయితే, అటు పార్టీలోను, ఇటు జిల్లా యంత్రాంగంలోనూ అమెకు సరైన పట్టు దక్కడం లేదు. ఈ కారణంగా.. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఎవరి దందా వారిదే అన్నట్టుగా సాగుతోంది. కీలక ప్రాజెక్ట్‌లు సాధించే విషయమై ప్రజాప్రతినిధులంతా రెండేళ్లలో ఒక్కసారి కూడా ఐక్యంగా ముఖ్యమంత్రిని కలిసిన పాపాన పోలేదు. అన్ని సీట్లూ కట్టబెట్టిన జిల్లానుంచి.. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ, మూడు పార్లమెం టరీ నియోజకవర్గాల్లో టీడీపీ, దాని మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇంత ముఖ్యమైన జిల్లా నుంచి కేబినెట్లో స్థానం దక్కించుకున్న పీతల సుజాతకు స్త్రీ, శిశు సంక్షేమంతోపాటు కీలకమైన గనుల శాఖ కూడా దక్కింది. ఎస్సీ కోటాలో అమాత్య పదవి పొంది రెండేళ్లవుతున్నా జిల్లా అభివృద్ధిపై ఆమె కనీస దృష్టి కూడా పెట్టలేకపోయారు. దేశంలోనే అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు డెల్టా ఆధునికీకరణ, చింతల పూడి ఎత్తిపోతల పథకం, కొల్లేరు కాంటూర్ కుదింపు వంటి ఏన్నో కీలక సమస్యలు ఉన్నాయి. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసేందుకు పీతల సుజాత జిల్లా అధికారులతో ఒక్కసారైనా సమీక్షించింది లేదు. మరోవైపు గనుల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాలో ఇసుక దోపిడీని నిలువరించలేకపోయారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలే ఇసుక దందాకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొట్టడం వంటి పరిస్థితులో సొంత జిల్లాలో అమెకు గనుల శాఖపై పట్టులేకుండా చేశాయి. చివరకు ఈ ఇసుక విధానమే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. నియోజకవర్గంలోనూ పట్టులేదు ఉపాధ్యాయినిగా పనిచేసిన పీతల సుజాత 2004లో ఆచంట సీటు దక్కించుకుని మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009లో టిక్కెట్ దక్కకపోయినా నిరాశ చెందకుండా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆచంట సిట్టింగ్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి సీటు దక్కించుకోవడంతో అమెకు చింతలపూడి (ఎస్సీ రిజర్వుడ్) స్థానం కేటాయించారు. దీంతో ఎన్నికల ముందు ఆమె స్థానికతపై చింతలపూడిలో వ్యతిరేకత వ్యక్తమైనా అనూహ్యంగా గెలుపొంది మంత్రి కాగలిగారు. చివరకు నియోజకవర్గంలోనూ సుజాతకు పట్టు లేకుండా పోయింది. చింతలపూడిలో గ్రూపు రాజకీయాలు ఆమెకు శిరోభారంగా మారాయి. గతంలో మండల టీడీపీ అధ్యక్ష పదవి కోసం అక్కడి నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కి ధర్నాలు చేశారు. గత ఏడాది పలు వివాదాలు అమెను చుట్టుముట్టాయి. మంత్రి ఇంటి ఆవరణలో బ్యాగ్‌లో నోట్ల కట్టలు దొరకడం దుమారం రేపింది. పోలీసుల దర్యాప్తులో క్లీన్చిట్ రావడంతో ఆ వివాదం నుంచి బయటపడినా.. వెంటనే విజయవాడలో ఏసీబీకి దొరికిన ఒక అధికారిణి మంత్రి సుజాత ఖర్చుల కోసం తాను ముడుపులు తీసుకున్నానంటూ ఇచ్చిన స్టేట్మెంట్ మరో వివాదాన్ని రగిల్చింది. మొత్తానికి వివాదాల నుంచి బయటపడినా ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ఏర్పడిన వివాదం జిల్లాలో టీడీపీని ఏకతాటిపై నడపటంలో సుజాతను విఫల మయ్యేలా చేసింది. ఇటీవల పలు ప్రారంభోత్సవాల్లో సైతం అమెకు ప్రొటోకాల్ ఇవ్వకపోవడం జిల్లాలో అమె పరిస్థితిని తెలియజేస్తోంది. ఈ వ్యవహారాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినా అటు అధికార యంత్రాంగంలోనూ, కొందరి నేతల తీరులోనూ మార్పు రాలేదు. మరోవైపు జిల్లా ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వారందరినీ కలుపుకుని వెళ్లలేకపోవడం, అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించకపోవడం అమెకు మైనస్‌గా మారాయి. అయితే అంతర్గతంగా నిర్వహించిన పార్టీ సర్వేలో మంత్రిగా పనితీరులో పీతల సుజాత మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇందుకు ప్రామాణికాలు ఏమిటనే విషయాన్ని పక్కన పెడితే.. రాష్ట్రంలో నంబర్-1 మంత్రి అనేది ఒక్కటే అమెకు ఊరటనిచ్చే అంశం. -
భూ మోసంపై కదులుతున్న డొంక
నరసాపురం అర్బన్ : నరసాపురంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన భూ మోసం వ్యవహారంలో డొంక కదులుతోంది. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి మంత్రి పీతల సుజాతతోపాటు, పోలీసు అధికారులు స్పందించారు. ఈ కేసులో నిందితులు మంత్రి సుజాత పేరును వాడుకోవడంతో ఆమె సీరియస్ అయ్యారు. నిజనిజాలు నిగ్గుతేల్చాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇద్దరిని రెండురోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలినవారి కోసం గాలింపు చేపట్టారు. అసలేం జరిగిందంటే.. పట్టణంలోని పొన్నపల్లికి చెందిన కొల్లాటి నర్శింహారావు సోదరులను కొందరు మాయమాటలతో మోసగించి రూ.70లక్షల విలువైన ఇళ్లస్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ సమయంలో సొమ్ముకు బదులు చెక్కులు ఇచ్చి, మళ్లీ వాటిని తెలివిగా తీసేసుకున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వైనాన్ని సాక్షి 20 రోజుల క్రితం ప్రచురించింది. దీంతో డొక కదిలింది. మరిన్ని మోసాలు... నరసాపురం ప్రాంతంలో ఈ తరహా మోసాలు అనేకం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పట్టణానికి చెందిన భూస్వామి అశ్వద్ధామనాయుడును కిడ్నాప్‌చేసి, ఆయన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన గత ఏడాది పట్టణంలో సంచలనం కలిగించింది. అప్పుడు కూడా బాధితులు కోర్టు ద్వారా న్యాయపోరాటం చేపట్టారు. ఇప్పుడు అదే తరహా మోసం వెలుగు చూసింది. తాజా కేసులో బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులే కాకుండా, మరికొంత మంది తెరవెనుక ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వారి కనుసన్నల్లోనే నరసాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా మరికొన్ని భూమోసాలు జరిగి నట్టుగా చెబుతున్నారు. పరారీలో ఉన్న నింది తులు దొరికితే, మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో కీలక నిందితులను తప్పించే యత్నాలూ సాగుతున్నట్టు సమాచారం. -
అక్రమాలపై మంత్రి పీతల ఫైర్
సాక్షి కథనంతో కదులుతున్న డొంక మిగిలిన 100 గజాలూ వేరే వారికి రిజిస్ట్రేషన్ రంగంలోకి పోలీసులు నరసాపురం అర్బన్ :తూర్పు గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో సంచలనం కలిగించిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై స్త్రీ,శుశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సీరియస్ అయ్యారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని గురువారం పోలీసులను ఆదేశించారు. పట్టణానికి చెందిన అన్నదమ్ములు నర్సింహారావు, ఈశ్వరరావులను మంత్రి పేరుతో మోసగించి వారి ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముఠా గురించి ‘సాక్షి’ గురువారం సంచికలో ‘మంత్రి పేరుచెప్పి భూమి హాంఫట్’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పీతల సుజాత స్పందించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఇలాంటి వ్యవహారాలను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించినట్టు వివరించారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేకున్నా.. తన పేరును నిందితులు వినియోగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై కూపీ లాగడం మొదలుపెట్టారు. ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా దీనిపై సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిలో మిగిలిన వంద గజాల స్థలాన్ని కూడా అక్రమార్కులు వేరేవారికి అమ్మేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 300 గజాల స్థలాన్ని ముందుగా ఓ మహిళపేరున గతనెల 16న పవర్ ఆఫ్ అటార్నీతో నిందితులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. వెంటనే మర్నాడు 17న అందులో 200 గజాల స్థలాన్ని బాధితుల తమ్ముడు కొడుకు భరత్ పేరున రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో ఇంకా మిగిలిన వంద గజాల స్థలం రిజిస్ట్రేషన్ ఆపాలని బాధితులు నరసాపురం సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ స్థలం కూడా ఈనెల 3న పాలకొల్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నరసాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ జరిగిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు పూర్తిగా డీలా పడ్డారు. ఈ వ్యవహారంపై బాధితుల తరపున ఆందోళన చేపడతామని సీపీఎం నరసాపురం డివిజన్, పట్టణ కార్యదర్శులు కవురు పెద్దిరాజు, ఎం.త్రిమూర్తులు ఓ ప్రకటనలో తెలిపారు. -
మంత్రి పీతల దళిత జాతికి క్షమాపణ చెప్పాలి
కడప కార్పొరేషన్ : రాష్ట్ర మంత్రి పీతల సుజాత దళిత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి పీతల సుజాత ముఖ్యమంత్రి చంద్రబాబును అంబేద్కర్‌తో పోల్చడాన్ని నిరసిస్తూ మంగళవారం వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో అవినీతిపరుడైన చంద్రబాబును పోల్చడం మంత్రి సుజాతకు తగదన్నారు. దేశంలో అణగారిన వర్గాలంతా అంబేద్కర్‌ను దేవునిలా పూజిస్తారని, ఇటీవలే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు ఆ మహానుభావుడిని పోలికా...అని ప్రశ్నించారు. దళితురాలై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి పీతల సుజాత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి పీతల సుజాతకు, సీఎం చంద్రబాబుకు వ్యతిరేఖంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు పత్తిరాజేశ్వరి, బోలా పద్మావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, నగర అధ్యక్షుడు ఆదిత్య, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు ఎస్ఎండీ షఫీ, నాయకులు సంజీవరాయుడు, మాతంగి సుబ్బరాయుడు, త్యాగరాజు, కంచుపాటి బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది
జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు సత్యనారాయణపురం : తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు ధ్వజమెత్తారు. స్థానిక భగత్‌సింగ్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయకుండా ఇరు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు వెంటనే రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఖర్చుల కోసమే తాను లంచం తీసుకుంటున్నానని కృష్ణాజిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజవరపు జెస్సీ డైమండ్ రోజీ ఏసీబీ అధికారులకు వెల్లడించారన్నారు. మంత్రి సుజాత తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ తరపున డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి కామా దేవరాజ్ మాట్లాడుతూ చంద్రబాబులో ఏమాత్రం నీతినిజాయితీ ఉన్నా వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరి తులిమిల్లి సుందరప్రసాద్, వేము దుర్గారావు పాల్గొన్నారు. -
పీతల ఎపిసోడ్ ఏం చెబుతోంది
సీన్-1: ఫ్లాష్‌బ్యాక్ సుమారు ఆరు నెలల క్రితం ఏలూరు ఆటోనగర్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంటి వద్ద జరిగిన సీన్ అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. పొద్దుపోయాక వెళ్లిన పోలీసులకు టీడీపీ నేతలు అర్ధరాత్రి వరకు సినిమా చూపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, పెద్దసంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆయన అరెస్ట్‌ను అడ్డుకుని నానాయాగీ చేశారు. నాగభూషణం తెలుగుదేశం పార్టీ నాయకుడా అంటే.. కనీసం కార్యకర్త కూడా కాదు. పార్టీ సభ్యత్వమన్నా ఉందా అంటే.. అదీ ప్రశ్నార్థకమే. మరి టీడీపీ నేతలంతా కట్టకట్టుకుని ఎందుకు వెళ్లారంటే.. కేవలం సామాజికవర్గ కోణంలోనే అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. సీన్-2 : తాజా దృశ్యం నాలుగు రోజుల కిందట మంత్రి పీతల సుజాత ఇంటి వాకిట్లో నోట్ల కట్టలు బయటపడి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో పార్టీపరంగా మద్దతిచ్చేందుకు ఏ ఒక్క నాయకుడూ ముందుకు రాలేదు. జరిగిన ఎపిసోడ్‌పై సెల్ఫ్‌గోల్ మాదిరిగా మంత్రి సుజాత స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనీసం విచారణ పూర్తయ్యే వరకైనా ఆమెకు ఎవరూ మద్దతు పలకలేదు. విచారణ కొలిక్కి(?) వచ్చిన తర్వాత ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ కె.రామ్ ప్రసాద్ మొహమాటానికి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కానీ.. టీడీపీలో బలమైన సామాజికవర్గ నేతలు మాత్రం ఇంతవరకు పెదవి విప్పలేదు. మద్దతు మాట దేవుడెరుగు ఆ ఘటన జరిగిన తర్వాత కనీసం అమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదని సీఎం చంద్రబాబు వేల్పూరులో పర్యటించిన సందర్భంలో బయటపడింది. ఎందుకీ వివక్ష? సుజాత పార్టీపరంగా జిల్లాకు చెందిన ఏకైక మంత్రి. పైగా దళిత వర్గానికి చెందిన మహిళ. అయినాసరే టీడీపీలో బలమైన వర్గ నేతలు ఆమెను ఎందుకు దూరంగా పెట్టారంటే.. కేవలం సామాజికవర్గ కోణంలోనే అన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీకి పెట్టని కోటగా నిలిచిన జిల్లానుంచి ఒకటి రెండు మంత్రి పదవులు తమకే వస్తాయని ఆ నేతలు భావించారు. అనూహ్యంగా సుజాత మంత్రి పదవి దక్కించుకున్నారు. పైగా ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉండే కీలకమైన గనుల శాఖను సొంతం చేసుకున్నారు. దీంతో అహం దెబ్బతిన్న ఆ వర్గ నేతలు ఆమెకు అన్నివిధాలా సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూశారు. తొలినాళ్లలో అందరితో కలిసి ముందుకు వెళ్లాలని చూసిన సుజాత.. సామాజికవర్గ పరిణామాలతో విసిగిపోయి కొన్నాళ్లుగా స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అన్ని వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఏలూరులో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్టీలోని బడాబాబులకు చెక్‌పడుతూ తనదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆ బాబు వదిలినా.. ఈ ‘బాబు’లు వదులుతారా పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటే చాలు. మధ్యలో వీళ్లంతా ఎందుకు అన్న ధోరణిలో మంత్రి వ్యవహారశైలి కొనసాగింది. చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఏకైక మార్గంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలే అస్త్రంగా ఎంచుకున్నారు. సందర్భం ఉన్నా.. లేకపోయినా వైఎస్సార్ సీపీపై నిప్పులు చెరగడంతో చంద్రబాబు వద్ద ఆమెకు ఎన్ని మార్కులు పడ్డాయో గానీ.. జిల్లాలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం సొంత పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలోనే సుజాత ప్రస్తావన వస్తేనే రగిలిపోతున్న టీడీపీ నేతలు అదును కోసం ఎదురుచూసి ట్రాప్ చేశారని అంటున్నారు. మంత్రి కోటరీలో అక్రమాలను పక్కా సాక్ష్యాలతో బయటపెట్టేందుకే నోట్ల కట్టల వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీశారని అంటున్నారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి వ్యవహారంతో తలబొప్పి కట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీలో పార్టీ పరువు బజారున పడకూడదని మంత్రి సుజాతను కేసు నుంచి బయటపడేసినా వర్గ నేతలు మాత్రం ఆమెను ఎంతవరకు వదులుతారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. మరోపక్క దళిత నేతలు టీడీపీకి ఎంతకొమ్ముకాసినా ‘మా పరిస్థితి ఇంతేనా.. పార్టీలో అగ్రవర్ణాల మోచేతి కింద ఉండాల్సిందేనా. లేదంటే ఇలా ట్రాప్ చేసి నరకం చూపిస్తారా..’ అని ఆందోళన చెందుతున్నారు. పీతల సుజాత ఎపిసోడ్‌తో టీడీపీకి చెందిన దళిత నేతలు, కార్యకర్తల్లో నివురుగప్పిన నిప్పులా రాజుకున్న అసంతృప్తి ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు
మంత్రి పీతల సుజాత లింగపాలెం : ఆర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేస్తామని రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మంత్రి సుజాత లింగపాలెం మండలంలోని లింగపాలెం శివారు కళ్యాణంపాడు వెళ్లే రోడ్డుకు పుష్కర నిధుల నుంచి 40 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, కె.గోకవరం శివారు అన్నపనేనివారిగూడెం గ్రామంలో మండల పరిషత్ పదమూడోవ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీతల సుజాత మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. పేదప్రజల కోసం ఐదురెట్లు పింఛన్‌ను పెంచిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుదేనన్నారు. త్వరలో డ్వాక్రా మహిళల, రైతు రుణాల మాఫీని పూర్తి చేస్తామన్నారు. వేసవిలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మహానాడుకు ఆరు బస్సులు : ఈనెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే మహానాడుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని సుజాత అన్నారు. సోమవారం లింగపాలెంలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహానాడుకు వచ్చేందుకు చింతలపూడి నియోజకవర్గం నుంచి 6 ప్రత్యేక డీలక్స్ బస్సులు ఏర్పాటు చేశానన్నారు. ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, జెడ్పీటీసీ గుత్తా పెద్దబాబు, లింగపాలెం సర్పంచ్ కేశిన శ్రీహరి, నాయకులు నందిగం బాబి, చెరువుగట్టు రామ్మోహనరావు, గజ్జా వెంకటేశ్వరావు, అసిలేటి జయరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
గర్భిణిపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఏలూరు అర్బన్ : గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రి పీతల సుజాత ఆదేశించారు. ఏలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏలూరు డీఎస్పీ కెజీవీ సరితతో గర్భిణిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెదపాడు శివారు రామచంద్రపురంలో5 నెలల గర్భిణిపై నలుగురు యువకులు బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడడమే కాకుండా సెల్ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ సాయంత్రంలోగా పట్టుకుని శిక్షించాలని మంత్రి ఆదేశించారు. బాధితురాలికి అన్ని విధాల అండగా ఉంటామని అవసరమైన వైద్యసేవలు అందించి ఆరోగ్యపరంగా ఆ మహిళ తేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. సమాజంలో మహిళలను గౌరవిస్తూ సోదరిలా ఆదరించే పరిస్థితులు నెలకొల్పడానికి పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని మంత్రి డీఎస్పీని కోరారు. ఈ కేసు పురోగతిలో ఉందని నిందితులను గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. -
జల జగడం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :వేసవి రాకుండానే వివిధ రాష్ట్రాల మధ్య మొదలైన జల జగడాలు ఇప్పుడు మన జిల్లాలోని నియోజకవర్గాల మధ్య కూడా చిచ్చు రేపుతున్నాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ నేరుగా కాకపోయినా సాగునీటి విషయంలో ఎవరికి వారు పంతాలు, పట్టుదలకు పోయినట్టు తెలుస్తోంది. ఎండిపోతున్న పొలాలకు నీరు మళ్లిస్తున్న రైతులపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా వారిపై కేసులు పెట్టాల్సిందిగా ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. రైతులపై కేసులు పెడితే సహించేది లేదని మంత్రి పీతల సుజాత తెగేసి చెప్పారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం పొద్దుపోయాక చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. చింతలపూడి నియోజ కవర్గం పరిధిలోని లింగపాలెం మండ లం పాలవాగు సప్లయ్ చానల్ పరి ధిలో సుమారు 1,500 ఎకరాల్లో పంట లు కొద్దిరోజులుగా సాగునీరు అందక ఎండిపోతున్నారుు. కాగా, శివరాత్రి సందర్భంగా దెందులూరు నియోజకవర్గానికి సరిహద్దులో గల బలివే తిరునాళ్ల నిమిత్తం నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్‌లోని నీటిని తమ్మిలేరు నుంచి నాలుగు రోజులుగా మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది రైతులు, స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆదివారం తమ్మిలేరు మీదుగా వెళ్తున్న నీటికి కొద్దిపాటిగా అడ్డువేసి పాలవాగు చానల్‌కు మళ్లించారు. విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులతో కలసి ఆదివారం రాత్రి 8గంటల సమయంలో యర్రవారిగూడెం గ్రోయిన్ వద్దకు వెళ్లి హడావుడి చేశారు. పాలవాగు చానల్‌కు వెళ్లుతున్న నీటిని చూసి అక్కడ ఉన్న ఇరిగేషన్ సిబ్బందిపై మండిపడ్డారు. ‘తమ్మిలేరుకు అడ్డువేసి పాలవాగుకు నీరుతీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు. గాడిదలు కాస్తున్నారా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అక్కడకు చేరుకున్న ఇరిగేషన్ అధికారులపై కూడా చింతమనేని సీరియస్ అయ్యారు. ‘రేపు ఈ వేళకు మిమ్మల్ని డిస్మిస్ చేయిస్తా’నంటూ హెచ్చరించారని చెబుతున్నారు. అంతేకాకుండా, కాలువకు అడ్డువేసిన రైతులపై కేసులు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైతుల్లో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని, కేవలం పొలాలు ఎండిపోతున్నందునే నీరు మళ్లించారని అక్కడి ఇరిగేషన్ సిబ్బంది పదేపదే చెప్పినప్పటికీ చింతమనేని శాంతించలేదు. పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కేసులు పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇరిగేషన్ సిబ్బంది ధర్మాజీగూడెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రైతులుపై ఫిర్యాదు రాస్తుండగా, స్థానిక టీడీపీ నేతలు మంత్రి పీతల సుజాతకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. సాగునీరు అడిగిన రైతులపై కేసులా మంత్రి పీతల విస్మయం రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కడంతో స్పందించిన మంత్రి సుజాత ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ‘సాగునీరు అడిగిన రైతులపై కేసులు ఎలా పెడతారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని రైతులు, నాయకులపై కేసులు పెడితే సహించేది లేదు’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించాలని, రైతులపై కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని మంత్రి పోలీసులకు సైతం సూచించారు. బలివే తిరునాళ్లు ముగిసిన మరుసటి రోజు నుంచి ఎండిపోతున్న పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. చింతలపూడికే పరిమితం కాకుండా జిల్లా మంత్రిగా సాగునీరందక ఎండిపోతున్న అన్ని ప్రాంతాల్లోని పొలాలకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద పెద్దఎత్తున గుమిగూడిన రైతులు శాంతించి వెళ్లిపోయారు. కాగా, ఎండిపోతున్న పంటలకు నీరు పెట్టుకుంటుంటే కేసులు పెట్టాలని చూస్తారా.. అంటూ ప్రభాకర్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదిలావుండగా, ఇంత జరిగినా ఇరిగేషన్ అధికారులు మాత్రం జరిగిన ఘటనపై నోరు మెదపడం లేదు. ఆదివారం రాత్రి యర్రవారిగూడెం వద్ద ఏం జరిగిందో మాకు తెలియదని ఇరిగేషన్ ఎస్ఈ బి.శ్రీనివాసయాదవ్ చెబుతుండగా, ఈఈ సతీష్ కుమార్ మాత్రం శివరాత్రి వేడుకల తర్వాత నీటిని ఎక్కువ మొత్తంలో విడుదల చేయించేందుకు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. -
'తప్పుడు నివేదికలిచ్చే ఆసుపత్రులపై చర్యలు'
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో స్వైన్‌ఫ్లూపై మంత్రి పీతల సుజాత బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వైన్‌ఫ్లూ ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సుజాత తెలిపారు. స్వైన్‌ఫ్లూ నివారణకు మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆమె సూచించారు. స్వైన్‌ఫ్లూపై తప్పుడు నివేదికలు ఇచ్చే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి పీతల సుజాత ఆదేశించారు. -
కుదిరిన రాజీ
ఏలూరు :జిల్లాలో కలెక్టర్, జేసీలతో ఉద్యోగ సంఘాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి మంగళవారం రాత్రి తాత్కాలికంగా తెరపడింది. మూడు గంటలపాటు ఉద్యోగ సంఘాలు,కలెక్టర్, జేసీలతో మంత్రి పీతల సుజాత,వేర్వేరుగా చర్చించి ఇరువర్గాలకు రాజీ కుదిర్చారు. కలెక్టర్, జే సీలు ఉద్యోగులను దుర్భాషలాడుతూ, సస్పెన్షన్లు, క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వారిని బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెల్సిందే. మంత్రి పీతల సుజాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబును హైదరాబాదులో మంగళవారం కలిసి జిల్లాలో పరిస్థితిని వివరించారు. వారు రాజీ చేయాలని నిర్ణయించారు. ఆమె ఏలూరుకు చేరుకుని ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో తొలుత ఎన్జీవో సంఘ జేఏసీ చైర్మన్ ఎల్వీ సాగర్, హరనాధ్, శ్రీనివాస్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యి వారి సమస్యలను విన్నారు. సుమారు గంటపాటు ఉద్యోగులు తమ సమస్యలను మంత్రికి ఏకరువు పెట్టారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఏఎన్ఎంల జీతాల నిలుపుదల, వివిధ ఉద్యోగుల సస్పెన్షన్ల వ్యవహారాలను ఆయా ఉద్యోగుల చెప్పారు. కలెక్టర్, జేసీలు హామీ ఇస్తేగాని తాము రాజీపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. అనంతరం ఆమె కలెక్టర్, జేసీలను పిలిపించి ఉద్యోగ సంఘాల సమస్యలను వారిద్దరికి వినిపించారు. అనంతరం ఇరువర్గాల మధ్య రాజీని కుదిర్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ సామరస్యపూర్వకంగా అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య రాజీ చేశామన్నారు. తాత్కాలిక విరమణే ఎన్జీవో సంఘ జేఏసీ చైర్మన్ సాగర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బందిని ఇద్దరు ఐఏఎస్‌లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని హామీ ఇచ్చారని, అందుకే వారిద్దరి బదిలీల అంశం, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించామన్నారు. మంత్రి పీతల సుజాత ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు, యంత్రాంగంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాముంటామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, జెడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజుల హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు చోడగిరి శ్రీనివాస్, ఆర్ఎస్ హరనాథ్, పి వెంకటేశ్వరరావు,శ్రీధర్‌రాజు, శ్రీకాంత్ సాల్మన్, బి సోమయ్య, గుడిపాటి నరసింహారావు, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోయేషన్ జిల్లా అధ్యక్షులు బి.సోమశేఖర్, కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
జిల్లాలో 24 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక
* రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి సుజాత * నాగిరెడ్డిగూడెంలో ఇసుక ర్యాంప్ ప్రారంభం చింతలపూడి : జిల్లాలో 24 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి మం డలం నాగిరెడ్డిగూడెం ఇసుక ర్యాంప్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. డిసెంబర్ నాటికి 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టడానికి పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించినట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఆర్డీవో ఎన్.తేజ్‌భరత్, జిల్లా భూగర్భశాఖ ఏడీ వైఎస్ బాబు, శిశు సంక్షేమ శాఖ పీడీ చంద్రశేఖర్‌రావు, జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, సర్పంచ్ మారిశెట్టి జగన్ తదితరులు పాల్గొన్నారు. లంబాడీ తండాలకు సంక్షేమ పథకాలు జిల్లాలో లంబాడీ తండాల్లో నివసిస్తున్న గిరిజనులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నాగిరెడ్డిగూడెంలో బంజార (లంబాడీ) హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సుజాతను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు రాష్ట్రంలో లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. కార్యక్రమంలో బంజార (లంబాడీ) హక్కుల పోరాట సమితి నాయకులు రాజబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు ఆది జగన్, పట్టణ అధ్యక్షుడు తాటి అప్పారావు, నాయకులు సయ్యద్ రహీం (బాబు), బోడ నాగభూషణం, కె.శేషగిరిరావు, మోరం ఈశ్వర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అమరుడా.. జన పోలీసు వీరుడా
‘జనమంతా గాఢ నిద్రలో ఉంటే.. నువ్వు మాత్రం మేల్కొనే ఉన్నావు.ఎండనక.. వాననక.. రాత్రనక.. పగలనక.. పండగల్ని కూడా త్యాగం చేసి ప్రజల కోసమే పని చేశావు. వారి కోసమే ప్రాణమిచ్చావు. ఖాకీ బట్టను త్యాగానికి గుర్తుగా మలచావు. అమరుడా.. జన పోలీసు వీరుడా.. నీకివే మా జ్యోతలు’ అంటూ పోలీసులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పిం చిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌం డ్స్‌లో మంగళవారం నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ సభలో ఆమె మాట్లాడారు. ప్రజలు సురక్షితమైన జీవనం సాగించడానికి పోలీసులు అందిస్తున్న సేవలే కారణమన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడానికి చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 642 మంది విధి నిర్వహణలో ప్రాణ కోల్పోయూరని వివరిం చారు. పోలీసు అమర వీరుల కుటుంబాలకు పోలీసు సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు. అనంతరం పోలీసులు కవాతు నిర్వహించి, అమర వీరులకు నివాళులర్పించారు. ముగ్గురు పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులకు మంత్రి, ఎస్పీ జ్ఞాపికలు అందించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలైన 18 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. సభానంతరం సురేష్ బహుగుణ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజు వర్మ, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత, ఏఆర్ డీఎస్పీ కె.కోటేశ్వరరావు, ఎస్బీ సీఐలు విల్సన్‌బాబు, ఎం.సుబ్బారావు, డీసీఆర్బీ సీఐ కె.రజనీకుమార్, టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్, ఏఆర్ ఆర్ఐ శ్రీనివాస్, సీఐలు కిషోర్‌బాబు, నాగేంద్ర ప్రసాద్, ఫణీంద్ర పాల్గొన్నారు.