'తప్పుడు నివేదికలిచ్చే ఆసుపత్రులపై చర్యలు'
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో స్వైన్ఫ్లూపై మంత్రి పీతల సుజాత బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వైన్ఫ్లూ ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సుజాత తెలిపారు. స్వైన్ఫ్లూ నివారణకు మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆమె సూచించారు. స్వైన్ఫ్లూపై తప్పుడు నివేదికలు ఇచ్చే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి పీతల సుజాత ఆదేశించారు.