గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రి పీతల సుజాత ఆదేశించారు.
ఏలూరు అర్బన్ : గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రి పీతల సుజాత ఆదేశించారు. ఏలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏలూరు డీఎస్పీ కెజీవీ సరితతో గర్భిణిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెదపాడు శివారు రామచంద్రపురంలో5 నెలల గర్భిణిపై నలుగురు యువకులు బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడడమే కాకుండా సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ సాయంత్రంలోగా పట్టుకుని శిక్షించాలని మంత్రి ఆదేశించారు.
బాధితురాలికి అన్ని విధాల అండగా ఉంటామని అవసరమైన వైద్యసేవలు అందించి ఆరోగ్యపరంగా ఆ మహిళ తేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. సమాజంలో మహిళలను గౌరవిస్తూ సోదరిలా ఆదరించే పరిస్థితులు నెలకొల్పడానికి పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించాలని మంత్రి డీఎస్పీని కోరారు. ఈ కేసు పురోగతిలో ఉందని నిందితులను గుర్తించామని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.