* రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి సుజాత
* నాగిరెడ్డిగూడెంలో ఇసుక ర్యాంప్ ప్రారంభం
చింతలపూడి : జిల్లాలో 24 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. చింతలపూడి మం డలం నాగిరెడ్డిగూడెం ఇసుక ర్యాంప్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. డిసెంబర్ నాటికి 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టడానికి పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించినట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఆర్డీవో ఎన్.తేజ్‌భరత్, జిల్లా భూగర్భశాఖ ఏడీ వైఎస్ బాబు, శిశు సంక్షేమ శాఖ పీడీ చంద్రశేఖర్‌రావు, జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, సర్పంచ్ మారిశెట్టి జగన్ తదితరులు పాల్గొన్నారు.
లంబాడీ తండాలకు సంక్షేమ పథకాలు
జిల్లాలో లంబాడీ తండాల్లో నివసిస్తున్న గిరిజనులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నాగిరెడ్డిగూడెంలో బంజార (లంబాడీ) హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సుజాతను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు రాష్ట్రంలో లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. కార్యక్రమంలో బంజార (లంబాడీ) హక్కుల పోరాట సమితి నాయకులు రాజబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు ఆది జగన్, పట్టణ అధ్యక్షుడు తాటి అప్పారావు, నాయకులు సయ్యద్ రహీం (బాబు), బోడ నాగభూషణం, కె.శేషగిరిరావు, మోరం ఈశ్వర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 24 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక
Published Sat, Nov 29 2014 3:11 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement