సీఎంకు పేదలంటే చులకన భావం | Chief poverty peoples levity sense | Sakshi
Sakshi News home page

సీఎంకు పేదలంటే చులకన భావం

Published Thu, Mar 10 2016 4:23 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

సీఎంకు పేదలంటే చులకన భావం - Sakshi

సీఎంకు పేదలంటే చులకన భావం

బేస్తవారిపేట. రాష్ట్ర ప్రజలను నిత్యం దగా, మోసం చేస్తున్న సీఎంకు పేదలంటే చులకన భావం ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నేకునాంబాద్, చింతలపాలెం, గొట్టమిండ్లు గ్రామాల్లో పల్లెపల్లెకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీకులంలో పుట్టాలని ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతున్నాడు. బీసీలకు ఎన్నికల సమయంలో సబ్‌ప్లాన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సబ్‌ప్లాన్ వారికే ఉపయోగిస్తానన్నాడు ఎక్కడ అమలు చేయలేదు. అసలు, వడ్డీ భారంగా మారడంతో రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

దివంగతనేత వైఎస్సార్ పాలనలో పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించారన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు తాతపూడి ఐజయ్య, మండల ఉపాధ్యక్షుడు కారెపోతుల రంగయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బొల్లా బాలిరెడ్డి, బేస్తవారిపేట సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు బారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చిలకల కేశవరెడ్డి, కోనపల్లె సర్పంచి నాదేళ్ల శ్రీనువాసులు, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు సూరా స్వామిరంగారెడ్డి, అరుణ్‌కుమార్ యాదవ్, పి. ఈశ్వరరెడ్డి, నాయకులు టీవీఎస్‌పీ శర్మ, డి. ఖాజామీయా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement