ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సిద్దిపేటకు తొలిసారి వచ్చానని, తల్లి సాక్షిగా చెబుతున్నా.. ఇక్కడ అభివృద్ధిని చూసి ముగ్ధుడ్ని అయ్యానని ప్రముఖ వ్యాపార వేత్త శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి అన్నారు. పట్టణంలోని విపంచి కళా నిలయంలో గురువారం రాత్రి నిర్వహించిన మ్యాజిక్ భాస్కర్ మ్యాజిక్ షోలో వరప్రసాద్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్రి హరీశ్‌రావు చాతుర్యం తెలుసు. కానీ ఈ స్థాయిలో జిల్లాను అభివృద్ధి చేశారని అనుకోలేదు. ఒక జిల్లా ఇంత గొప్పగా ఉంటుందా. జాతీయ భావం కలిగిన నాయకుడు హరీశ్‌రావు. మెజిషీయన్ భాస్కర్‌ను ప్రోత్సాహించేందుకే ఇక్కడికి వచ్చా. ఒలింపిక్స్‌లో మ్యాజిక్‌కు ఒక్క పతకం లేదు. అంతర్జాతీయ అవకాశం కోసం మన అందరం ప్రయత్నించాలి’ అన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment