హైదరాబాద్: తెలంగాణ అవతరణ వారోత్సవాల్లో భాగంగా ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజా నుంచి భారీ ర్యాలీ ఆరంభమైంది. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ వరకు లక్ష మందితో భారీ ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు.
తెలంగాణ సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటేలా వివిధ కళా రూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించనున్నారు. సుమారు 5 వేల మంది కళాకారులు వీటిలో పాల్గొంటారు. ధూంధాం, ఆట, పాటలు, బతుకమ్మలు, బోనాలతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది. రాత్రి 8 గంటలకు అవతరణ ఉత్సవాల ముగింపు సభ నిర్వహించనున్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: ఆరంభమైన భారీ ర్యాలీ
Published Sun, Jun 7 2015 6:07 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
Advertisement
Advertisement