
ఆవిర్భావ దినోత్సవం.. ఆనందోత్సాహం
► వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
► ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
► ఊరూరా వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరణలు
► వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం పలుచోట్ల సేవా కార్యక్రమాలు
► ఉత్సాహంతో పాల్గొని స్వీట్లు పంచిన పార్టీ శ్రేణులు
► కర్నూలు, నందికొట్కూరులో ఎమ్మెల్యేల నేతృత్వంలో సమావేశాలు
కర్నూలు: ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలా జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పలుచోట్ల ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని స్వీట్లు పంచి జెండాలు ఆవిష్కరించారు. ఐదేళ్లు గడిచి ఆరో సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో నాయకులు సమావేశాలు నిర్వహించారు. కర్నూలు, నందికొట్కూరులో ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, ఐజయ్య ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. అంతకుముందు పార్టీ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ చేసి కేకులు కట్ చేసి పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.
► ఆలూరులో కురువ చిన్న ఈరన్న, హాలహర్విలో భీమప్ప చౌదరి, ఆస్పరిలో దొరబాబు, హొళగుందలో షఫీవుల్లా ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
► పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలోని మాధవీనగర్‌లో జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టారు.
► ఆదోని పట్టణంలో కౌన్సిలర్ చంద్రకాంత్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవే సి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
► ఆత్మకూరు మండలం కరివేన గ్రామంలో బీసీ సెల్ నాయకుడు ఓబులేసు నాయకత్వంలో జెండావిష్కరణ చేశారు.
►డోన్‌లో పార్టీ సీనియర్ నాయకులు ఎ.సి.పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
► కోవెలకుంట్లలో పార్టీ నాయకులు రామేశ్వర్‌రెడ్డి, సంజామలలో ఎంపీపీ ఓబుల్‌రెడ్డి, జడ్పీటీసీ చిన్నబాబు నాయకత్వంలో కార్యక్రమాలు చేపట్టారు.
► జూపాడుబంగ్లాలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు చంద్రమౌళి పాల్గొన్నారు. అలాగే మిడుతూరు, పాములపాడు, కొత్తపల్లి, పగిడ్యాల మండలాల్లో పార్టీ కన్వీనర్ల నాయకత్వంలో జెండావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.
►పత్తికొండలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, నాయకుడు జూటూరు బజారప్ప, మద్దికెరలో పార్టీ నాయకులు మురళీధర్‌రెడ్డి, రాజశేఖర్, తుగ్గలి మండల కన్వీనర్ నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో ..ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
►వెల్దుర్తిలో మైనార్టీ సెల్ మండల కన్వీనర్ ఆరిఫ్, గ్రామ సర్పంచ్ ఆవుల భారతి నాయకత్వంలో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.