సీఆర్‌పీఎఫ్ ఆవిర్భావ వేడుకలు
Published Thu, Sep 1 2016 11:52 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
భీమార : సీఆర్‌పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. భీమారంలోని 58వ సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తొలుత సీఆర్‌పీఎఫ్ జెండాను కమాండెంట్ విజయ్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ సుమ, అసిస్టెంట్ కమాండెంట్ అండ్ ఎంవో ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement