రాజోళి మండలం ఏర్పాటుపై హర్షం | happy the leaders rajoli mandal formation | Sakshi
Sakshi News home page

రాజోళి మండలం ఏర్పాటుపై హర్షం

Published Sun, Sep 11 2016 12:15 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

happy the leaders rajoli mandal formation

శాంతినగర్‌ : రాజోళి మండలం ఏర్పాటు విషయమై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించడం సంతోషకరమని వడ్డేపల్లి వైస్‌ఎంపీపీ ఎన్‌.శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజోళి మేజర్‌గ్రామ పంచాయతీని మండల కేంద్రం చేయాలని గతంలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన జిల్లాలు, మండలాల పునర్విభజన సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి సమస్య వివరించామన్నారు. రాజోళికి అన్ని అర్హతలున్నాయని అన్నారు.  సమావేశంలో జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మగోపాల్, ఎంపీటీసీలు సానెబసన్న, పెద్దనాగన్న, మాజీ ఎంపీటీసీ తుకారాం, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, రాజోళి సర్పంచ్‌ మోచిఉస్సేన్, నాయకులు పైపాడు మధుసూధన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు సోమన్న, మైనార్టీ నాయకులు ఆయుబ్‌ఖాన్, బషీర్, ఆయా గ్రామాల టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement