
జూన్ 2 నే రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ రెండునే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆ రోజు సంబరాలు చేయబోమని, నవనిర్మాణ దీక్ష మాత్రమే చేపడతామన్నారు.
సచివాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవమైన నవంబర్ ఒకటిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో సీఎం నిర్ణయిస్తారన్నారు.