సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవాన్ని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమం త్రి కేసీఆర్ నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పబ్లిక్ గార్డెన్‌లోనే ఉమ్మడి ఏపీ తొలి ఆవిర్భావ దినోత్సవం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల లో సమైక్య పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం ఎడారిగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వా త కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు రాజ్ కుమార్, రామయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment