Public Gardens
-
తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి
-
జాతీయ సమైక్యతా దినోత్సవం..పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జెండావిష్కరణ
-
‘సెప్టెంబర్ 17’: బీజేపీ Vs కాంగ్రెస్.. తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు
హైదరాబాద్: అత్యంత కీలక రోజుగా మారిన ‘సెప్టెంబర్ 17’ నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో శనివారం నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిటీలోనే ఉన్నారు. ఆదివారం బోయిన్‌పల్లిలో జరిగే కార్యక్రమానికి వీరు హాజరవుతారు. మరోపక్క తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు దృష్టిలో పెట్టుకుని నగర వాసులు సహకరించాలని, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, జేబీఎస్‌లకు వెళ్లే ప్రయాణికులు నిర్ణీత సమయానికి కంటే ముందే బయలుదేరాలని పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా .. ►ఎంజే మార్కెట్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్ నుంచి ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు. ► నాపంల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్ టీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. ►నిరంకారి నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ వైపు వచ్చే వాహనాలను టెలిఫోన్ భవన్ వైపు పంపిస్తారు. ► బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్ నగర్ల వైపు నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను వివిధ మార్గాల్లో పంపిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ కేంద్రంగా.. ►ప్లాజా ఎక్స్ రోడ్ నుంచి ఎస్బీఐ చౌరస్తా మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. వైఎంసీఏ ఫ్లైఓవర్ పై నుంచి మాత్రమే ట్రాఫిక్ అనుమతిస్తారు. ► బోయిన్పల్లి–తాడ్‌బండ్ వైపు నుంచి వచ్చే వాహనాలను సీటీఓ వైపు మళ్ళిస్తారు. కార్ఖానా–జేబీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలను స్వీకార్ ఉపకార్ నుంచి టివోలీ వైపు పంపిస్తారు. ► ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు చూపించాలి... ఆదివారం నగరం వివిధ ప్రాంతాల్లో కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష జరగనుంది. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్న చోట్లా ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు చూపించిన వారిని బారికేడింగ్ పాయింట్లు దాటి ముందుకు పంపాలని ఆదేశించారు. -
పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్–19 మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ .. ఢిల్లీలో కేంద్ర సర్కారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించిన 12 మంది తెలంగాణ బిడ్డలను గవర్నర్ సన్మానించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు దర్బార్ హాల్లో అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు, వివిధ రంగాల ముఖ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకోనున్నారు. ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం అధికారికంగా నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. -
గణతంత్ర వేడుకలో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించే క్రమంలో జెండా మొరాయిం చింది. రోప్‌వైర్‌ను ఎంతసేపు లాగినప్పటికీ జెండా ముడి విచ్చుకోలేదు. జెండా పూర్తిగా ఎగరకుండానే జాతీయ గీతం వాయిద్యాన్ని పోలీస్‌బ్యాండ్ బృందం మోగించడంతో అంద రూ జాతీయ గీతాలాపన కొనసాగించారు. జాతీయ గీతాలాపన అనంతరం అక్కడే ఉన్న పోలీస్ అధికారులు జెండాను పూర్తిగా కిందకు దించి సరిచేసి, మళ్లీ ఎగురవేశారు. గవర్నర్ హోదాలో తొలిసారి జాతీయ జెండా ఎగరవేసిన తమిళిసై ఈ అపశుత్రితో తీవ్ర అసహనానికి లోనైనట్లు కనిపించారు. తన ప్రసంగం ముగిసిన వెంటనే దీనిపై ఆమె ప్రోటోకాల్ జాయిం ట్ సెక్రటరీ అర్విందర్ సింగ్‌ను పిలిచి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ సైతం ప్రోటోకాల్ అధికారులపై ఆగ్రహాన్ని వెలిబుచ్చినట్లుగా తెలుస్తోంది. పరేడ్‌లో పాల్గొన్న ఏపీఎస్పీ.. గణతంత్ర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీఎస్పీ పోలీసులతోపాటు సిక్ రెజిమెంట్‌కు చెందిన 5వ బెటా లియన్, టీఎస్‌ఎస్సీకి చెందిన 3వ బెటాలియన్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఎన్సీసీ విద్యార్థులు పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో పాల్గొన్న ఏపీఎస్పీకి గవర్నర్ ప్రత్యేక ట్రోఫీని అందజేశారు. పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతం చాలా చిన్నదిగా ఉండటంతో ప్రభుత్వ శకటాల ప్రదర్శన జరగలేదు. తరలివచ్చిన ముఖ్య నేతలు.. గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాలోతు కవిత, లింగయ్య యాదవ్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల చైర్మన్లు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అపశ్రుతులు.. అవమానాలు ►వికారాబాద్ జిల్లా ధారూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం కిరణ్మయి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. అప్పటికే జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. వెంటనే పొరపాటును సరిదిద్దారు. ►రంగారెడ్డి జిల్లా నేదునూరు పరిధిలోని ఓ విద్యాసంస్థలో మత చిహ్నం ఉన్న రాడ్‌కు జాతీయ జెండాను ఆవిష్కరించడం కలకలం రేపింది. సర్పంచ్ తదితరులు దీనిపై ఆందోళనకు దిగారు. దీనిపై తమకందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ జంగయ్య తెలిపారు. -
పబ్లిక్‌గార్డెన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవాన్ని చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని ముఖ్యమం త్రి కేసీఆర్ నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పబ్లిక్ గార్డెన్‌లోనే ఉమ్మడి ఏపీ తొలి ఆవిర్భావ దినోత్సవం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల లో సమైక్య పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రం ఎడారిగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వా త కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ మనోహర్ రావు, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ ప్రసాద్, పోలీసు అధికారులు, ప్రోటోకాల్ అధికారులు రాజ్ కుమార్, రామయ్య పాల్గొన్నారు. -
నిధుల కోసమే నుమాయిష్
నుమాయిష్.. దాదాపు 2,500 స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 40 లక్షల మంది సందర్శకులతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరుపొందిన ఈవెంట్. నగరంలో ప్రతి యేటా జనవరి 1వ తేదీన ప్రారంభమై.. 45 రోజుల పాటు కొనసాగుతుంది. నిజాం సంస్థానంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిర్వహించే సర్వే కోసం సుమారు 80 స్టాల్స్‌తో రూ. 2.5 లక్షల ఖర్చుతో ఈ నుమాయిష్ ప్రారంభమైంది. నేడు నుమాయిష్ ప్రారంభమౌతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ నూమాయిష్ ఎక్కడ ప్రారంభించారు.. అనుమతి లభించిన వెంటనే పట్టభద్రుల సంఘం.. వివిధ పనులపై కమిటీలు ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, పెద్ద దుకాణాల నిర్వాహకులను సంప్రదించి నుమాయిష్ ఆవశ్యకత ను వివరించారు. ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వెతికారు. చివరికి బాగే ఆమ్ (పబ్లిక్‌గార్డెన్)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాక 1938, ఏప్రిల్ 6న ఉస్మాన్ అలీఖాన్ జన్మదినం సందర్భంగా ఆయన చేతుల మీదుగానే పబ్లిక్ గార్డెన్లో (నముష్–ఇ–మాస్నావత్–ఎ–ముల్కి)గా నుమాయిష్‌ను ప్రారంభించారు. తొలి ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి నాంపల్లికి... అప్పటి స్టాల్స్ 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నుమాయిష్ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. ప్రజా దరణ పెరిగి స్టాల్స్ పెరగడంతో పబ్లిక్ గార్డెన్స్‌లో స్థలం సమస్య వచ్చింది. దీంతో నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానానికి మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రదేశం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకూ అనువుగా ఉంటుందని భావించారు. అలా 1946లో హైదరాబాద్ ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ ఆదేశాల మేరకు సుమాయి ష్‌ను పబ్లిక్ గార్డెన్ నుంచి నాంపల్లి మైదానాని(ఎగ్జిబిషన్ గ్రౌండ్)కి మార్చారు. ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్... 1949లో నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలచారి 1947లో దేశ స్వాతంత్య్రం.. 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనంతో ఈ రెండేళ్లు నుమాయిష్ ఏర్పాటు చేయలేదు. తిరిగి 1949లో నాంపల్లి మైదానంలోనే నాటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి. రాజగోపాల్ ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్ పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ ప్రతి ఏటా ఎలాంటి అంతరాయం లేకుండా ఎగ్జిబిషన్ సాగుతోంది. ప్రపంచంలో ఎలాంటి విరామం లేకుండా 45 రోజుల పాటు జరిగే అతిపెద్ద ఈవెంట్ హైదరాబాద్ ఎగ్జిబిషన్. గతేడాది 40 లక్షల మంది సందర్శకులను ఆకర్షించింది. వాణిజ్యంలో రూ. 150 కోట్లు దాటింది. ఇందులో రూ. 10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు ఉంటాయి. నుమాయిష్ ఐడియా ఎలా వచ్చింది... హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని 1937లో నాటి ఉస్మానియా పట్టభద్రుల సంఘ సమావేశం తీర్మానించింది. అయితే సర్వే నిర్వహించడానికి నిధుల కొరత ఉండటంతో ఏదైనా కార్యక్రమం నిర్వహించి నిధులు సేకరించాలని సభ్యులు సలహా ఇచ్చారు. సంస్థానంలో తయారయ్యే వివిధ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేస్తే పరిశ్రమల ద్వారానే కాకుండా సందర్శకుల నుంచి కూడా నిధులు వస్తాయని ఆలోచించి నుమాయిష్ (ప్రదర్శన)కు రూపకల్పన చేశారు. అనుమతి లభించిందిలా... 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటుకు ఓ నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీకి పంపించారు. ఆయన పూర్తిస్థాయిలో నివేదిక పరిశీలించి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు పంపించారు. నివేదిక అందిన తరువాత ఉస్మాన్ అలీ ఖాన్ నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇచ్చారు. -
అజంతా అందాలు...
చూసొద్దాం రండి నగరం నడిబొడ్డున పబ్లిక్‌గార్డెన్స్‌లో ఉన్న రాష్ట్ర పురావస్తు మ్యూజియం.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముందుచూపునకు నిదర్శనం. 95 ఏళ్ల కిందట నిజాం ఒక మ్యూజియం నిర్మించాలనుకున్నాడు. అందుకోసం చారిత్రక పరిశోధకుడు జనాబ్ గులాం యజ్దానీని 1914లో ఆర్కియాలజీ శాఖ డెరైక్టర్‌గా నియమించాడు. 1930లో పబ్లిక్‌గార్డెన్స్‌లోని విశాల ప్రాంగణంలో ఇండో-ఇస్లామిక్ శైలిలో హైదరాబాద్ మ్యూజియం నిర్మితమైంది. అనేక తవ్వకాలలో లభించిన అరుదైన కళాఖండాలకు ఇది నిలయం. రెండంతస్తుల భవనం.. దీని వెనుకే మరో రెండు అంతస్తుల్లో విశాలమైన కాంటెంపరరీ పెవిలియన్ నిర్మించారు. ఈ రెండింటి నడుమ విజయనగర రాజుల కాలంనాటి ఎత్తై కొయ్య రథం ఒక ప్రత్యేక ఆకర్షణ. పక్కనే కాకతీయుల కాలం నాటి మహామండపం, ఆ పిల్లర్లపై చెక్కిన శివపార్వతుల శిల్పాలు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునక. ఈజిప్టు దేశపు మమ్మీ.. అజంతా గ్యాలరీ మ్యూజియంలో క్రీ.పూ.2500 ఏళ్లనాటి ఈజిప్టు దేశపు మమ్మీ ప్రధాన ఆకర్షణ. ఇది 16-18 ఏళ్ల వయసుగల ఆడపిల్లకు సంబంధించినదని అధికారులు చెబుతారు. మనదేశంలో కేవలం ఆరు మ్యూజియంలలో మాత్రమే మమ్మీలున్నాయి. ఈ మమ్మీని ఆరో నిజాం అల్లుడు కొనుగోలు చేసి దాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను బహుమతిగా ఇచ్చారు. నిజాం దాన్ని 1930లో గ్యాలరీకి అప్పగించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా చిత్రాల నకళ్లు ఈ మ్యూజియంలో దగ్గరగా చూడొచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు చిత్రకారులు జనాబ్ సయ్యద్ అహ్మద్, జనాబ్ మహ్మద్ జలాలుద్దీన్‌లు అజంతాలోని చిత్రాలను ఉన్నవి ఉన్నట్టుగా ఎంతో ఓర్పుతో చిత్రించారు. ఇవి బుద్ధుని జాతక కథలతోపాటు ఆనాటి జీవన విధానాన్ని తెలుపుతాయి. చేతివ్రాత ప్రతులు, అరుదైన నాణేలు మొఘల్ చక్రవర్తి షాజహాన్ సీల్‌తో ఉన్న ఖురాన్, ఔరంగజేబు చేతితో రాసిన ఖురాన్ ప్రతులు, క్రీ.శ. 16 నుంచి 19వ శతాబ్దకాలంలో అరబిక్, పర్షియన్, హిందీ భాషలలోని అనేక పత్రాలు, 16, 17 శతాబ్దాల్లో దేవనాగరి లిపిలో రాసిన రామాయణ, భాగవత ప్రతులు చారిత్రకాభిమానులను విశేషంగా అకట్టుకుంటున్నాయి. సుమారు రెండున్నర లక్షల పైబడిన నాణేలు మ్యూజియం గ్యాలరీలో భద్రపరిచారు. రోమన్ కాలం నాటి బంగారు నాణేలు, చైనీయుల రాగి నాణేలు, షాజహాన్ కాలంలోని 200 తులాల బంగారు మొహర్ అరుదైన జ్ఞాపికలుగా ఉన్నాయి. అయితే వీటి ప్రదర్శన ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో లేదు. జైన, బుద్ధుని గ్యాలరీలు అమరావతి, చందవరం, నేలకొండపల్లి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన బుద్ధుని శిలాప్రతిమలు ఒక ప్రత్యేక గ్యాలరీలో ఉంచారు. ఇందులో ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో లభించిన బుద్ధుని నిలువెత్తు విగ్రహం సందర్శకులను కట్టిపడేస్తుంది. కళ్యాణ చాళుక్యుల కాలం నాటి ఐదుగురు జైన తీర్థంకరుల శిల్పాలు, అన్నపూర్ణ, లక్ష్మీనారాయణ, లక్ష్మి, వరాహ, సూర్య, హిందూ దేవతామూర్తులు శిల్పి నైపుణ్యతకు అద్దం పడుతున్నాయి. ఇంకా మొఘల్, రాజస్తానీ, దక్కన్ చిత్రాలతో పాటు స్థానిక ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్స్ ఈ గ్యాలరీలో కనువిందు చేస్తాయి. ఈ మ్యూజియమ్‌కు ప్రతి శుక్రవారం సెలవు. ఆదివారం తెరిచే ఉంటుంది!. -
నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి
నాంపల్లి: నేర రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీ కుమార్ చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగర ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో రెండు రోజుల పాటు విద్యార్థులకు చిత్రలేఖనం, కార్టూన్, వక్తృత్వం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కమిషనర్ మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది అమరులయ్యారని వివరించారు. వీరిని స్మరించుకునేందుకు ప్రతి ఏటా ట్రాఫిక్ విభాగం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రతిభను కనబరిచారని, చిన్నారులు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ ప్రదానోత్సవంలో అదనపు ట్రాఫిక్ పోలీసు కమిషనర్ జితేందర్, ట్రాఫిక్ డీసీపీలు సుధీర్ బాబు, శ్యామ్ సుందర్, సీనియర్ అధికారులు పాపయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చిత్రకారుడు కాదు... చరిత్రకారుడు
బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ డా.వరప్రసాద్ రెడ్డి ప్రకటన నాంపల్లి: బాపు కేవలం చిత్రకారుడు మాత్రమే కాదని...చరిత్రకారుడని పారిశ్రామికవేత్త పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి శ్లాఘించారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో బాపు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ బాపు పేరిట ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా సాహితీవేత్తలందరం కలిసి ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామని వెల్లడించారు. కొంటె చిత్రాలు, చలన చిత్రాలను రాబోయే తరాలకు అందించినప్పుడే ఆయనకు నిజమైన అశ్రునివాళి అవుతుందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి మోహన్ కందా మాట్లాడుతూ తెలుగు భాషకు బాపు కొత్త రూపం తెచ్చారని కీర్తించారు. ఆర్ట్ గ్యాలరీ నిర్మాణానికి తన వంతుసాయం అందిస్తానన్నారు. సినీ నటుడు రావి కొండలరావు మాట్లాడుతూ బాపుతో సాన్నిహిత్యం లభించినందుకు తన జీవితం ధన్యమైందని చెప్పారు. ఇప్పటి వరకు దేవతామూర్తుల చిత్రాలను కార్టూన్లుగా వేసిన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరని తెలిపారు. సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ చిత్రకారుడిగా బాపు లెజెండ్ అన్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ బాపు నిర్యాణ సభను చలోక్తులు, చమత్కారాలతో జరుపుకోవడం విశేషమన్నారు. నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ బాపును తలచుకొని నవ్వుకుంటుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత శ్రీ రమణ, సన్‌షైన్ ఆస్పత్రి (సికింద్రాబాద్) ఎం.డి.డాక్టర్ గురువారెడ్డి, కార్డియాలజిస్ట్ మన్నెం గోపీచంద్, కార్టూనిస్ట్‌లు సుధామ, ఎస్వీ రామారావు, రచయిత ఎంబీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పురా‘వస్తు’ పంపకమెలా?
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని పురావస్తు ప్రదర్శనశాలలో వెలకట్టలేని ప్రాచీన సంపద ఆ పంపిణీకి జనాభా ప్రాతిపదికా? సంపద లభ్యత ప్రాదిపదికా? అధికారవర్గాల్లో ఆసక్తికర చర్చ విలువైన సంపదకు నెలవైన మ్యూజియం హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న పురావస్తు శాలలోని వెల కట్టలేని పురాతన సంపదను ఎలా పంపిణీ చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ పరిస్థితుల్లో వెల కట్టలేని ప్రాచీన సంపదను ఇరు రాష్ట్రాలు ఎలా పంపిణీ చేసుకుంటాయి. ఇందుకు ఏ ప్రాతిపదికను అనుసరిస్తాయన్నది ఉన్నతాధికార వర్గా ల్లో చర్చనీయాశంగా ఉంది. ఇతర సంస్థల విభజనలా పురావస్తు శాల విభజన సాధ్యం కాదు. ఇది పురావస్తు శాఖ కింద ఉండటంతో రాష్ట్ర విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ దీనిని చేర్చలేదు. పురావస్తు శాలలో ఉన్న ప్రాచీన సంపదను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేస్తారా? లేక ఏ ప్రాంతంలో సంపద లభ్యమైందో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఈ సంపద పంపిణీపై ఇంకా దృష్టి సారించలేదు. అత్యంత విలువైన ఆ సంపద పంపిణీ జరగాలంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారితో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పురావస్తుశాలలో బుద్ధుని అవశేషాలు దగ్గర నుంచి నాటి యుద్ధాల్లో రాజులు వినియోగించిన పరికరాలు, ఎంతో విలువైన ఒరిజనల్ పెయిం టింగ్స్, బంగారు, వెండి, రాగి నాణేలు, వెలకట్టలేని బంగారు ఆభరణాలు ఉన్నాయి. సంపద లభించిన ప్రాంతం, ఆ సంపదకు విలువ కట్ట డం అంత సులభతరం కాదని అధికారులు అం టున్నారు. అధికార వర్గాలు ప్రాథమిక అంచనా మేరకు పబ్లిక్ గార్డెన్స్ పురావస్తుశాలలో ఉన్న ప్రాచీన సంపద ఈ విధంగా ఉంది. నాలుగు వేల బంగారు, 14 వేల వెండి, 30 వేల రాగి మూల నాణేలు, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో లభ్యమైన ఎంతో విలువైన పలు బంగారు ఆభరణాలున్నాయి. నాటి మహారాజులకు చెందిన ప్రాచీన కాలంనాటి 2,500 ఒరిజినల్ పెయింటింగ్స్‌తో పాటు బుద్ధుడి ఎముక ముక్క ఉంది. ఆ ఎముక ముక్క కోసం గతంలో చైనా రూ. 57 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. దశాబ్దాల నుంచి భద్రపరిచిన మమ్మీ కూడా అందులో ఉంది. ప్రాచీన కాల యుద్ధాల్లో వాడిన కవచాలు, కిరీ టాలు, బల్లేలు,ఇతర యుద్ధ పరికరాలున్నాయి. -
సారీ..ఇటు రావొద్దు
సాక్షి,సిటీబ్యూరో: ఈనెల 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు జనం పోటెత్తుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో అంబులెన్సులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వాహనాలు రావొద్దని ట్రాఫిక్ పోలీ సులు సూచించారు. ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ విజయేందర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ మైదానం మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటోందని.. ఈ సమయాల్లో ‘108’ సహా అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలన్నీ ఎంజే మార్కెట్-తాజ్ ఐలాండ్ మధ్య మార్గాన్ని ఎంచుకోవద్దన్నారు. వీరు ఎంజేమార్కెట్, అబిడ్స్, జీపీవో, స్టేషన్‌రోడ్, నాంపల్లి టీజంక్షన్, పబ్లిక్‌గార్డెన్స్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఎగ్జిబిషన్ సందర్శకులు మినహా సాధారణ వాహనచోదకులు సైతం ఈ మార్గంలోనే వెళ్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు. -
ఎవరికి చుట్టం!
ఎక్కడ : అసెంబ్లీ పక్కన పబ్లిక్‌గార్డెన్స్ ఎప్పుడు : ఆదివారం, ఉదయం 9గంటలకు ఏమిటి : కొందరు మగవాళ్ల సమావేశం ఎందుకు : కుటుంబ వ్యవస్థను కాపాడడం కోసం ఎలా : సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా...... ఈవారం జనహితంలో పబ్లిక్ గార్డెన్స్ గేట్ లోపలికి అడుగుపెట్టాక...ఎడమచేతివైపు ఓ వంద అడుగులు వేస్తే....చింతచెట్లకింద ఓ యాభైమంది మగవాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిమధ్యలో ఓ పెద్దాయన నిలబడి తన బాధలు చెప్పుకుంటున్నాడు. ‘‘మా కోడలు మామీద 498ఎ కేసు పెడతానంటోంది. తనకి మా కొడుకుతో ఇబ్బందులుంటే....కాటికి కాళ్లు చాచుకున్న మేం బలవ్వాలా...అంటూ మొదలుపెట్టాడు’’ అతను చెప్పిన సమస్యలన్నీ విన్నాక అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకతను లేచి ఆ పెద్దాయనకి సలహాలిచ్చాడు. ‘‘మీ అబ్బాయిని, కోడల్ని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడండి. మీ అబ్బాయి తప్పుంటే సరిచేసుకోడానికి, అతని ప్రవర్తన మార్చుకోడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీ కోడలి బాధల్ని కూడా విని ఆమెని సమస్యల్ని నుంచి బయటపడేయడానిక్కూడా మీరే చొరవ తీసుకోండి. మీ కోడలైనా, కూతురైనా ఒక్కసారి పోలీస్‌స్టేషన్ గుమ్మం తొక్కితే ఒకటి కాదు, రెండు కాదు.. మూడు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి.’’ అంటూ సలహా ఇచ్చాడు. అసలు ఎవరు వీళ్లంతా? ఎందుకు అక్కడికి వచ్చారో చూద్దాం... ‘‘ఎంత శక్తిమంతమైన చట్టాలున్నా... ఇంకా చాలామంది మహిళలు గృహహింసకు బలైపోతూనే ఉన్నారు. కట్నాల వేధింపులు, అనుమానంతో వేధించే భర్తలు చట్టాల్ని లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటివారిపై 498 ఎ సెక్షన్ కేసు పెడితే వారికి న్యాయం జరుగుతుంది. అలాకాకుండా... జీతం చేతికివ్వలేదని, తల్లిదండ్రుల్ని చూడమన్నాడని, చెప్పిన మాట వినలేదని పంతాలకు పోయి క్షణికావేశంలో ఈ చట్టాన్ని ఆశ్రయించడం మన దేశ కుటుంబ వ్యవస్థని అవమానపరచడమే’’ అంటూ తమ పోరాటం గురించి పరిచయం చేసుకున్నారు. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పబ్లిక్‌గార్డెన్స్‌లో మీట్ అయ్యే ఈ బృందం...‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్)’ సభ్యులు. ముందుగా వీరంతా సెక్షన్ 498 ఎ బాధితులు. వీరంతా కలిసి ఈ సెక్షన్ దుర్వినియోగం కాకుండా కృషిచేస్తూ కుటుంబ వ్యవస్థని రక్షించడంకోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. సిఫ్ సభ్యుడు ఫెరాజ్ మాట్లాడుతూ...‘‘మహిళలపై వేధింపుల్ని అరికట్టాలన్న ఉద్దేశంతో పుట్టిన ఈ చట్టం చిన్న చిన్న ఇగోలకు కూడా పరిఆసరాగా మారడం చాలా దారుణం. ఏదో చిన్న గొడవకి 498 ఎ సెక్షన్ కింద కేసు వేసి కుటుంబాన్ని సర్వనాశం చేసుకుంటున్న మహిళలసంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబం విలువైంది... ‘‘మన దేశంలో అన్నింటికన్నా బలమైంది, విలువైంది కుటుంబమే. మహిళైనా, పురుషుడైనా కుటుంబం లేకుండా ప్రశాంతంగా బతకలేరు. క్షణికావేశంలో కుటుంబాన్ని కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణాలలో 498 ఎ సెక్షన్ దుర్వినియోగం కూడా ఒకటి. రకరకాల కారణాల వల్ల భర్త నుంచి విడిపోవాలనుకుంటున్న కొందరు మహిళలు నేరుగా విడాకులకు దరఖాస్తు చేసుకోకుండా... ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. పోనీ భర్తమీద కేసు వేసి ఊరుకుంటున్నారా... అంటే ... కాదు, అతనితోపాటు తనకు కోపం ఉన్న అందరి పేర్లని రాసేస్తున్నారు. అత్త, మామ, ఆడపడచు, మరిది, బావ... అంటూ ఓ ఐదారు మందిని రోడ్డుకి ఈడుస్తున్నారు. దీనివల్ల ఆమెకొరిగేదేమీ ఉండదు. కొన్నాళ్ల తర్వాత ‘అనవసరంగా తొందరపడ్డానే’ అని బాధపడేవాళ్లూ ఉన్నారు. ఏ మహిళైనా 498 ఎ సెక్షన్‌కింద కేసు నమోదు చేస్తే భర ్తని వెంటనే అరెస్టు చేస్తారు. ఆ తర్వాత... మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా పోలీసులు నిర్దాక్షిణ్యంగా సెల్లో పడేస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న ఆడపడుచుని కూడా అరెస్టు చేయించారు. భర్త తప్పుచేస్తే అతనిమీద కేసు పెట్టాలి. అంతేకాని రక్తసంబంధీకులైన పాపానికి ఎక్కడో దేశం దాటిపోయినవాళ్లమీద కేసులు పెట్టి వారి కుటుంబాల్ని బజారుకీడ్చే హక్కు ఈమెకి ఎవరిచ్చారు? పెళ్లిచేసి నా బతుకు నాశనం చేశారనే అమ్మాయిలెంత మంది ఉన్నారో, అందులో పదోవంతు అబ్బాయిలు కూడా తమ జీవితభాగస్వాములతో ఇంచుమించు ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఎన్నోవిషయాల్లో ఎంతో పురోగమిస్తున్న మనం మన చట్టాలకు మగవాళ్ల సంక్షేమం ఎందుకు పట్టదో అర్థం కావట్లేదు. అందుకే ఎనిమిదేళ్ల క్రితం ముంబయిలో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ వెలిసింది’’ అని చెప్పారు సిఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అలీ షా. దేశవ్యాప్తంగా... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంస్థలో 13, 500 మంది సభ్యులున్నారు. స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారు ఇంతకు మూడింతలున్నారు. వీరి పోరాటం 498 ఎ చట్టం దుర్వినియోగం మీద మాత్రమే కాదు... ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ కన్నబిడ్డలతో గడిపే అవకాశాన్ని కోల్పోతున్న మగవారి కోసం కూడా. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిఫ్ సభ్యులు ఉన్నారు. మొన్నటివరకూ 498ఎ సెక్షన్‌కింద కేసు పెడితే వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. రెండేళ్లక్రితం ట్యాంక్‌బండ్‌పై మేం చేసిన పోరాట ఫలితంగా మన రాష్ర్ట హైకోర్టు కేసుని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. కాని, ఏం లాభం... కొందరు మహిళలు కేసు పెట్టి వెనక్కి తీసుకోడానికి బేరాలాడుతున్నారు. భార్యాభర్తలమధ్య మధ్యవర్తుల పేరుతో పుట్టుకొచ్చే కొందరు పెద్దలు మరీ అన్యాయంగా డబ్బు సెటిల్మెంట్లు చేస్తున్నారు. దీనివల్ల వివాహవ్యవస్థ పైనే విరక్తి పుడుతోంది. ఇదిగో...ఇక్కడ ఉన్నవారిలో ఓ పదిమంది విదేశాల్లో స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ కేసు పుణ్యాన అక్కడ ఉద్యోగం ఊడగొట్టుకుని ఇక్కడకొచ్చి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ల భార్యలేమో ఉద్యోగాలు చేసుకుంటూ వీళ్లదగ్గర పోషణకు డబ్బులు తీసుకుంటూ హాయిగా బతికేస్తున్నారు. ఇక్కడ మా ఉద్దేశ్యం వీళ్లంతా మంచివారు, వీరి భార్యలు చెడ్డవారు అని కాదు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవడం ఎందుకు...అని!’’ అంటూ తన వాదనని వివరించారు మరో సభ్యుడు. కుటుంబం కోసం... మా పోరాటం మగవారికోసం కాదు...కుటుంబ సంక్షేమం కోసం అంటోన్న ఈ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉచిత కౌన్సిలింగ్‌లు కూడా ఇస్తోంది. లోక్ అదాలత్ కింద న్యాయ సేవా సదన్‌లో ప్రీ ప్రివెన్షన్ కౌన్సిలింగ్లో పాల్గొంటోంది. కుటుంబంలో ఎవరితోనైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా లోక్ అదాలత్‌ని ఆశ్రయిస్తే అక్కడ అధికారులు సమస్య పరిష్కారానికి సహకరిస్తారు. ఇలాంటి సంస్థల్ని ఆశ్రయించి కుటుంబాలను పదికాలలపాటు పచ్చగా ఉండేలా చూసుకోకుండా పోలీసుల్ని ఆశ్రయించి పొరపాటు చేస్తున్న మహిళలు కళ్లు తెరవాలని కోరుకుంటున్నారు సిఫ్ బృందం. 498ఎ చట్టం విలువైంది. శక్తిమంతమైన ఆయుధం. అయితే ఆ ఆయుధాన్ని జాగ్రత్తగా వాడాలి కాని దుర్వినియోగం చేయకూడదు. వందమంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు కాని... ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అన్న మన న్యాయశాస్త్ర సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని, హింసకు గురవుతున్న మహిళలకు రక్షణకవచంలా ఉన్న ఈ చట్టం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడదాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదొక్కటే కాదు... మన దేశంలో ఒక్క మహిళా చట్టాలే కాదు అన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న చట్టాలివి. భర్త కొట్టినా, బాధ్యతగా ప్రవర్తించకపోయినా, అనుమానించినా... ఎలాంటి ఇబ్బంది అయినా వాటి నుంచి బయటపడడానికి నేటి మహిళలకి 498 సెక్షన్ ఒక్కటే దిక్కు. సమస్య చిన్నదయినా, పెద్దదయినా తట్టుకునే శక్తిలేనప్పుడు ఎవ్వరూ తనకు తోడుగా నిలబడనపుడు ఆ మహిళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం 498. ఆడ, మగ భేదాలు పక్కనపెడితే ఎవరికి అన్యాయం జరిగిందో కేసు విచారణ చేస్తేగాని చెప్పలేం. - నిశ్చల సిద్దారెడ్డి, ఎడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్ దుర్వినియోగం పెరుగుతోంది... రక్షణగా ఉపయోగపడాల్సిన చట్టాన్ని అవగాహన లేకుండా, క్షణికావేశంతో దుర్వినియోగం చేస్తున్నవారి సంఖ్య నిజంగానే పెరుగుతోంది. వాస్తవం చెప్పాలంటే నిజంగా హింసకు గురవుతున్న మహిళలు నేరాల్ని రుజువుచేయడంలో విఫలమై ఇబ్బందులు పడుతుంటే... తమ స్వార్థాలకు కేసులు పెట్టి జీవితాల్ని నాశనం చేసున్న మహిళలు కూడా మన కళ్లముందే ఉన్నారు. భార్యా, భర్త సంగతేమోగాని మధ్యలో పెద్దలు, మధ్యవర్తులు బాగుపడిపోతున్నారన్నది కూడా వాస్తవం! - పుణ్యవతి, ఐద్వా సంఘం ఉపాధ్యక్షురాలు