సాక్షి,సిటీబ్యూరో: ఈనెల 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు జనం పోటెత్తుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో అంబులెన్సులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వాహనాలు రావొద్దని ట్రాఫిక్ పోలీ సులు సూచించారు. ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ విజయేందర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ మైదానం మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటోందని.. ఈ సమయాల్లో ‘108’ సహా అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలన్నీ ఎంజే మార్కెట్-తాజ్ ఐలాండ్ మధ్య మార్గాన్ని ఎంచుకోవద్దన్నారు. వీరు ఎంజేమార్కెట్, అబిడ్స్, జీపీవో, స్టేషన్‌రోడ్, నాంపల్లి టీజంక్షన్, పబ్లిక్‌గార్డెన్స్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఎగ్జిబిషన్ సందర్శకులు మినహా సాధారణ వాహనచోదకులు సైతం ఈ మార్గంలోనే వెళ్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు.
సారీ..ఇటు రావొద్దు
Published Thu, Jan 16 2014 4:09 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement
Advertisement