
దోహా : ఖతర్ రాజధాని దోహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడి విల్లాలో 8 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. పార్టీ ఖతర్ ఐటీ ఇంచార్జ్ నరీం హేమంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినట్టు గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ దోహా కన్వీనర్ దొండపాటి శశికిరణ్ మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ అని, రాష్ట్రం విడిపోకముందు సమైఖ్య రాష్ట్రం కోసం, విడిపోయాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల హామీల అమలు కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. వైసీపీలో సభ్యుడైనందుకు తాను గర్వపడుతున్నట్టు చెప్పారు.
అదే విధంగా కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన హేమంత్‌కు కమీటీ సభ్యుల తరుఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని నిర్వహించిన హేమంత్ మాట్టాడుతూ.. రాష్ట్ర రాజకీయలలో నైతిక విలువలకు కట్టుబడి ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. మోస పూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు, కో కన్వీనర్లు జాఫర్ హుస్సేన్, గిరిధర్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు నాగేశ్వర్ రావు, ప్రశాంత్, యూత్ ఇంచార్జ్ ఆరోన్ మనీష్, గౌరవ సలహాదారు ఎస్.ఎస్.రావు, విల్సన్ బాబు, సహాయ కోశాధికారి సభ్యులు అరుణ్, భార్గవ్, జయరాజు, పిల్లి మురళి కృష్ణా, రాజు, వసంత్, పవన్ రెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.