
ఖతర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామ చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ ఖతర్ సభ్యులు సంఘీభావం తెలియచేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు శశికిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్న తెలుగుదేశం పార్టీతోనే ప్రత్యేక హోదా కావాల్సిందే అనిపించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉందంటే అది కేవలం జగన్ పోరాటంతోనే అని అన్నారు. సుమారు 15 నెలల పదవీకాలాన్ని త్యాగం చేస్తూ ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖతర్‌లోని ప్రవాస ఆంధ్రుల నుంచి హృదయ పూర్వక ధన్యవాదాలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, వర్ధనపు ప్రకాశ్ బాబు, నల్లి నాగేశ్వరరావు, ముత్తబత్తుల ప్రశాంత్, ప్రధాన కోశాధికారి నేమాని లియోపోడ్ కింగ్, ప్రముఖ సామాజిక కార్యకర్త బి.విల్సన్ బాబు, యూత్ ఇంచార్జీ ఆరోన్ మనీష్, సోషల్ మీడియా ఇంచార్జీ గెడ్డం చంటీ, ఐటీ ఇంచార్జీ హేమంత్ గణేష్, స్పోర్ట్ష్ ఇంచార్జీ వర్థనపు ఏసురత్నం, సహాయ కోశాధికారులు అరుణ్, నేతల జయరాజు, ఇంజెటి శ్రీను, రఫీ ఖాదర్, దర్బార్ షేక్ బాషా, మౌలా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment