
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం విశాఖ జిల్లా నక్కపల్లిలో త్రినాథ్ ప్రాణత్యాగానికి పాల్పడటంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
త్రినాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన లక్ష్యం కోసం పోరాడుదామని, ఆత్మహత్య లాంటి తీవ్ర చర్యలకు ఎవరూ పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.