సాక్షి, వైఎస్సార్ జిల్లా : పారిశ్రామిక విప్లవం రావాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా అనేక ఉద్యమాలతో ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచామన్నారు. చివరి అస్త్రంగా తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించామని తెలిపారు. విభజన హమీలతో పాటు నదుల అనుసంధానమైన దొమ్మగూడెం, బ్రహ్మం సాగర్, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వేలిగోండ వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకోరావాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీ ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీలు సహకరిస్తామంటున్నారని, మొత్తం 42 ఎంపీలతో కలిసి పోరాడితేనే తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని తెలిసినా.. టీడీపీ, కాంగ్రెస్‌లు ఏనాడు అడిగింది లేదని, బీజేపీ ఇచ్చింది లేదన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు హోదా కావాలంటూ ప్రజాస్వామ్యాన్ని పునరుధ్ధరిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఘాటుగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment