
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ‘చిన్నాన్న హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా... వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణపై నమ్మకం లేదని, వివేకా హత్య కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ హత్యకేసును సీబీఐతో విచారణ చేయించాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కూడా పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సౌభాగ్యమ్మ పిటిషన్‌తో పాటు అంతకు ముందు దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు రేపు విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment