సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించింది. పిటిషర్ల తరపున న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ సౌభాగ్యమ్మ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిట్ పేరుతో వైఎస్ కుటుంబ సభ్యులపై బురదజల్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని న్యాయవాదులు కోర్టుకు వివ్నవించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ అజమాయిషీలో లేని దర్యాప్తు సంస్థకు కేసు విచారణ అప్పగించాలని కోరారు. కాగా, తదుపరి విచారణను మధ్యాహ్నాం 2.15కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment