
సాక్షి, విజయవాడ : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వివేకా హత్యకేసును సీబీఐతో విచారణ చేయించాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ పిటిషన్ వేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐతో దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని కోరారు. హైకోర్టు మంగళవారం (నేడు) ఈ పిటిషన్‌ను విచారించనుంది.
(బాబు స్టేట్‌మెంట్‌కు అనుగుణంగానే సిట్ విచారణ?)
Comments
Please login to add a commentAdd a comment