Hunger Stirke
-
Israel-Hamas war: గాజాకు అమెరికా మానవతా సాయం
వాషింగ్టన్: ఒకవైపు ఇజ్రాయెల్ భీకర దాడులు.. మరోవైపు ఆహారం దొరక్క ఆకలి కేకలు.. గాజాలో లక్షలాది మంది పాలస్తీనియన్ల దుస్థితి ఇది. వారికి సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచి్చంది. బాధితులకు మానవతా సాయం పంపిణీని ప్రారంభించింది. ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా సైన్యానికి చెందిన సి–130 సరుకు రవాణా విమానాల ద్వారా శనివారం ఉదయం గాజాలో 38 వేల ఆహార ప్యాకెట్లను జారవిడిచారు. 66 పెద్ద బండిళ్లలో ఈ ప్యాకెట్లను భద్రపర్చి, బాధితులకు చేరేలా కిందికి జారవిడిచారు. ఇందుకోసం జోర్డాన్ సహకారంతో మూడు విమానాలను ఉపయోగించినట్లు అమెరికా సైనికాధికారులు తెలిపారు. గాజాలో విమానం ద్వారా ఆహార పదార్థాలు అందించిన అనుభవం జోర్డాన్‌కు ఉంది. -
సద్గుణాల్లో ఉద్గుణం దాతృత్వం
దాతృత్వం లేదా ఈవి అన్నది ఉద్గుణాలు అన్నిటిలోకెల్లా ఉద్గుణం; సద్గుణాలు అన్నిటిలోకెల్లా సద్గుణం. అవసరమైంది లేనివాళ్లకు తగిన విధంగా అందించడానికి తన శక్తిమేరకు ప్రయత్నించడం ప్రతి మనిషికీ తప్పకుండా ఉండాల్సిన లక్షణం. అది లక్షణంగా మాత్రమే కాకుండా అంతకుమించి ప్రతివ్యక్తికీ ఉండాల్సిన ప్రధాన లక్ష్యంగా కూడా ఉండాలి. వేదవాఙ్మయంలో భాగంగా మనకు అందుబాటులో ఉన్న భిక్షుసూక్తం కమ్యూనిజంకన్నా ఎంతో ముందే అన్నార్తులకు అన్నం పెట్టడం, దీనులకు దానం చెయ్యడం గురించి ప్రగాఢంగా ప్రపంచానికి తెలియజెప్పింది. ‘దేవతలు ఆకలిని మరణానికి కారణంగా విధించలేదు. బాగా ఆహారం తిన్న వాళ్లకు కూడా మరణం వచ్చి తీరుతుంది. దానశీలికి సంపద తగ్గదు. ఇవ్వని లేదా పెట్టని వాడిని ఓదార్చే వారు కూడా ఉండరు‘ అంటూ భిక్షుసూక్తం తొలి శ్లోకం అర్థం చేసుకుని ఆచరించాల్సినదాన్ని ఆవిష్కృతం చేసింది. ఆకలికి ఆహారం కూడా కరువై అలమటిస్తున్నవాళ్లు ప్రపంచంలో ఇంకా ఉన్నారు. వాళ్లు ఎక్కడో, అక్కడక్కడో మాత్రమే కాదు మన చుట్టుపక్కల కూడా ఉన్నారు. వాళ్లను మనం చూడకపోవడం, చూడలేకపోవడం కాదు చూసినా చూడనట్టు ఉన్నాం, ఉంటున్నాం. మనకు ఎందుకులే అనుకుంటూ, అంటూ మనం వాళ్ల పక్కనే నివసిస్తున్నాం. ఇది అమానవీయం. ఈ అమానవీయత మనలో కొత్తగా చోటు చేసుకున్న అవలక్షణం కాదు. అది మనలో ఎప్పటి నుంచో గూడుకట్టుకుని లేదా పేరుకుపోయి ఉంది. ఆ లక్షణం మనలో ఉండకూడదు అని తెలియజేస్తూ, మనకు తగిన స్ఫూర్తిని ఇస్తూ ఎప్పటి నుంచో ఎంతో చెప్పబడింది; ఎందరో మహనీయులు మనకు ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. అయినా కూడా ఆ అవలక్షణం అవనిలో అంతరించిపోలేదు. ప్రపంచం పరిణామాల్ని పొందుతూ ఇవాళ ఉన్న స్థితికి వచ్చాక కూడా ఆకలి అన్నది ప్రపంచంలో ఇంకా ఎందరినో బాధిస్తోంది. ఆకలి తన ఆకలిని తీర్చుకోలేకపోతోందేమో? అందువల్ల అది ఇంకా మనుషుల ప్రాణాల్ని తింటూనే ఉందేమో? ఎప్పటినుంచో ప్రపంచంలో ఆకలి అగ్నికి మనుషుల ప్రాణాలు ఆహుతి అవుతూనే ఉన్నాయి. ‘అన్నం కలిగిన వాడై ఉండీ, అవసరమైన దీనులకి ఆహారం పెట్టకుండా మనసును చంపుకుని ఆ దీనుల ముందే ఎవడయితే తాను అనుభవిస్తూ తింటాడో వాడికి అనునయించే వాళ్లు దొరకరు’ అన్న విషయాన్ని ఒక హెచ్చరికగా భిక్షుసూక్తం మనకు తెలియజెప్పింది. ఈ సూక్తం లో చెప్పబడినట్టుగా ఆకలి కారణంగా మన సమాజంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ‘ధనవంతుడు పేదలకు తప్పకుండా ఇవ్వాలి. దూరదృష్టితో మార్గాల్ని ఆలోచించి ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే రథచక్రాలు తిరుతున్నట్టుగా సంపద ఒకరి నుంచి మఱొకరికి వెళుతూ ఉంటుంది’ అనీ,‘మూర్ఖుడు అహారాన్ని ఇతరులకి పెట్టకుండా ఆశగా సేకరించి నిల్వ ఉంచుకుంటాడు. నిజం చెబుతున్నాను అది వాడికి చావునే ఇస్తుంది. దేవుడికో, స్నేహితుడికో ఇవ్వకుండా తాను తినే వాడు ఒట్టి పాపి అవుతాడు‘ అనీ భిక్షుసూక్తం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. కానీ మానవులు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా పాపులుగా లేదా దోషులుగా మనుగడ చేస్తున్నారు. ‘ఆహారాన్ని వెతుక్కుంటూ తిరిగే బలహీనులకు ఎవరు వెంటనే ఆహారాన్ని ఇస్తారో వారి కోసం విలువైనవి వేచి ఉన్నాయి. వారు విరోధులతో కూడా స్నేహాన్ని పొందుతారు’ అని భిక్షుసూక్తం ఉపదేశించి దాన్ని మనం మనసుతోనూ, మెదడుతోనూ అందుకుని ఆచరణలోకి తీసుకురావాలి. ఆ పని చేస్తూ మనల్ని మనం మనుషులుగా మలుచుకోవాలి; తథాస్తు. పూవుకే కాదు ఈవికి కూడా తావి ఉంటుంది! ఆ తావి పేరు కీర్తి!! ఈవివల్ల మనం కీర్తిమంతులం అవుదాం. బతికి ఉండగానే కాదు, మరలిపోయాక కూడా మనం పరిమళిద్దాం. ఈవితో మనకు మనం తావిని అద్దుకుందాం. – రోచిష్మాన్ -
ఆమరణ దీక్షకు ఖతర్ సభ్యుల సంఘీభావం
ఖతర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు రాజీనామ చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ ఖతర్ సభ్యులు సంఘీభావం తెలియచేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు శశికిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్న తెలుగుదేశం పార్టీతోనే ప్రత్యేక హోదా కావాల్సిందే అనిపించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉందంటే అది కేవలం జగన్ పోరాటంతోనే అని అన్నారు. సుమారు 15 నెలల పదవీకాలాన్ని త్యాగం చేస్తూ ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖతర్‌లోని ప్రవాస ఆంధ్రుల నుంచి హృదయ పూర్వక ధన్యవాదాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, వర్ధనపు ప్రకాశ్ బాబు, నల్లి నాగేశ్వరరావు, ముత్తబత్తుల ప్రశాంత్, ప్రధాన కోశాధికారి నేమాని లియోపోడ్ కింగ్, ప్రముఖ సామాజిక కార్యకర్త బి.విల్సన్ బాబు, యూత్ ఇంచార్జీ ఆరోన్ మనీష్, సోషల్ మీడియా ఇంచార్జీ గెడ్డం చంటీ, ఐటీ ఇంచార్జీ హేమంత్ గణేష్, స్పోర్ట్ష్ ఇంచార్జీ వర్థనపు ఏసురత్నం, సహాయ కోశాధికారులు అరుణ్, నేతల జయరాజు, ఇంజెటి శ్రీను, రఫీ ఖాదర్, దర్బార్ షేక్ బాషా, మౌలా తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాపై పెదవి విప్పరేం..? సినీనటుడు శివాజీ
గుంటూరు ఈస్ట్ : మ్యానిఫెస్టోల్లో లక్ష కబుర్లు చెప్పే రాజకీయ పార్టీ నాయకులు నేడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పెదవి విప్పకపోవడం అన్యాయమని సినీ నటుడు శివాజీ విమర్శించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రత్యేక హోదా కోరుతూ శివాజీ చేపట్టిన 48 గంటల దీక్ష పూర్తయిన అనంతరం ఆయన మంగళవారం మధ్యాహ్నం నుంచి దానిని ఆమరణ దీక్షగా కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉద్యమం ఇంతటితో ఆపేది లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలోకి రావాలని కోరారు. బహిరంగంగా ముందుకు రావడానికి వీలులేని వారు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కేంద్రానికి మెసేజ్‌లు పంపాలని సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా తాను ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తన దీక్షను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాలు, గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతమై దీక్షలు ప్రారంభిస్తారనే ఆశతోనే తాను దీక్షను ప్రారంభించానన్నారు. తనకు ఏ పదవులూ అక్కర్లేదన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజి మాట్లాడుతూ నటుడు శివాజీ ఆరోగ్యం క్షీణించిందని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. దీక్షకు మద్దతు తెలిపిన వారిలో మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలక బాలారామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కృష్ణ, జైభీమ్ కార్మిక సంక్షేమ సంఘ నాయకులు, ఆంధ్ర కృష్ణబలిజ సంఘం నాయకులు, దళిత బహుజన సమైక్య వేదిక నాయకులు ఉన్నారు. మాలమహానాడు మహిళా కార్యవర్గ సభ్యులు బి.జోనికుమారి, కార్యవర్గ సభ్యులు శివాజీ దీక్షకు మద్దతు ప్రకటించారు. శివాజీ దీక్షను భగ్నం చేస్తే అవసరమైతే అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటామని అంటూ పెట్రోలు సీసాలు చూపించి హెచ్చరించారు. -
జగన్ దీక్షలు
-
జగనన్న రావాలి సాంగ్
-
20 నుంచి వైఎస్సార్ సీపీ రిలే దీక్షలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 19 నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. అందరికీ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌కు సానుకూల స్పందన లభించనందుకు నిరసనగా విజయమ్మ ఆమరణ దీక్షకు పూనుకుంటున్నారని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, మండల శాఖల కన్వీనర్లు రిలే నిరాహార దీక్షల విషయంలో ఉమ్మడిగా చర్చించుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోరారు. విజయమ్మ ఆమరణ దీక్ష కొనసాగినంత కాలం మండల కేంద్రాల్లో కూడా రిలే దీక్షలు కొనసాగించాలని ఆయన కోరారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ మండల కన్వీనర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విభజన విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజలకు వివరించి చైతన్యవంతుల్ని చేయాలని కోరారు. -
మంత్రి సతీమణి తోట వాణి దీక్ష భగ్నం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి తోట నరసింహం భార్య వాణి గత ఆరు రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను హై డ్రామాను తలపించే విధంగా శుక్రవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. కాకినాడలోని భాను గుడి సెంటర్ లోని దీక్ష శిబిరానికి జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్, జిల్లా ఎస్పీ శివ శంకర్ రెడ్డిలు చేరుకుని తోట వాణి దీక్షను భగ్నం చేశారు. వాణి దీక్షను భగ్నం చేయడాన్ని కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు పరిస్థితి చక్కదిద్ది వెంటనే తోట వాణిని కాకినాడ జనరల్ ఆస్పత్రికి తరలించి, బలవంతంగా దీక్షను విరమింప చేసినట్టు పోలీసుల అధికారి ఒకరు వెల్లడించారు. వాణి దీక్ష విరమించిందని.. ఆమెకు చికిత్సను అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకట్ తెలిపారు. వాణి దీక్ష విరమించాలని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు పల్లం రాజు, చిరంజీవి, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మిలు కోరిన సంగతి తెలిసింది. అంతేకాకుండా ఆంటోని కమిటికి తమ అభిప్రాయాలను తెలుపాలని అభ్యర్థించారు. వాణి ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. దీక్షను కొనసాగిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు దీక్షను భగ్నం చేశారు.