38 వేల ఆహార ప్యాకెట్లు జారవిడిచిన అమెరికా సైన్యం
వాషింగ్టన్: ఒకవైపు ఇజ్రాయెల్ భీకర దాడులు.. మరోవైపు ఆహారం దొరక్క ఆకలి కేకలు.. గాజాలో లక్షలాది మంది పాలస్తీనియన్ల దుస్థితి ఇది. వారికి సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచి్చంది. బాధితులకు మానవతా సాయం పంపిణీని ప్రారంభించింది. ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా సైన్యానికి చెందిన సి–130 సరుకు రవాణా విమానాల ద్వారా శనివారం ఉదయం గాజాలో 38 వేల ఆహార ప్యాకెట్లను జారవిడిచారు. 66 పెద్ద బండిళ్లలో ఈ ప్యాకెట్లను భద్రపర్చి, బాధితులకు చేరేలా కిందికి జారవిడిచారు. ఇందుకోసం జోర్డాన్ సహకారంతో మూడు విమానాలను ఉపయోగించినట్లు అమెరికా సైనికాధికారులు తెలిపారు. గాజాలో విమానం ద్వారా ఆహార పదార్థాలు అందించిన అనుభవం జోర్డాన్‌కు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment