
Israel-Hamas War: హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తునే ఉంది. గాజాపై దాడులును నిలిపివేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహును కోరిన విషయం తెలిసిందే. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫొన్‌లో మాట్లాడారు. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ సంభాషణ అనంతరం నెతాన్యహు పాలస్తీనాను స్వంతత్ర దేశంగా అంగీకరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఇజ్జత్ అల్-రిష్క్ స్పందించారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయల్ ప్రధానిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్జత్ తోసిపుచ్చారు.
గాజాలో జరుగుతున్న మారణహోమం వెనుక ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందని మండిపడ్డారు. ఇక పాలస్తీనా ప్రజలకు ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన బైడెన్‌పై సదభిప్రాయం కలిగి ఉండరని చెప్పారు. బైడెన్ మాటలతో తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం పాలస్తీనా ప్రజల్లో లేదని పేర్కొన్నారు. బైడెన్.. నెతన్యహుతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండు దేశాల విధానం ద్వారా చాలా దేశాలు ఉన్నాయని.. అటువంటి దేశాలు కూడా యూఎన్‌ఏలో భాగమై ఉన్నాయని తెలిపారు.
ఇక.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించమని తేల్చి చెప్పారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా ఇచ్చినా హమాస్ వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తప్పదని అన్నారు. ఇక హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపమని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 24, 927 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment