వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందాడు. ఈ క్రమంలో సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇది ఎంతో శుభసూచకం. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి కాంట్జ్ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని చెప్పుకొచ్చారు.
Yahya Sinwar is dead.
He was killed in Rafah by the brave soldiers of the Israel Defense Forces.
While this is not the end of the war in Gaza, it's the beginning of the end. pic.twitter.com/C6wAaLH1YW— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 17, 2024
మరోవైపు, సిన్వర్ మృతిపై జో బైడెన్ స్పందిస్తూ.. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభదినం. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్, డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించింది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్
Comments
Please login to add a commentAdd a comment