
దోహా ఖతార్ : ప్రత్యేక హోదాతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దోహా ఖతార్ విభాగం పేర్కొంది. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఎస్ ఎస్. రావు గారి విల్లా, ఆయిన్ ఖాలిద్ ప్రాంతములో నేడు పార్టీ యూత్ ఇన్‌ఛార్జీ మనీష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ వివరాలను గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కన్వీర్ శశికిరణ్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఉసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, పూటకో మాట మారుస్తున్న అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు. ఇక ఇన్‌ఛార్జీ మనీష్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరమని పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపారు. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, రాయితీలు వచ్చి ఉద్యోగాల కల్పన పెరుగుతుందని, తద్వారా గల్ఫ్ వలసల బారిన పడకుండా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుందని ఆయన చెప్పారు. అందుకే వైఎస్ జగన్ పోరాటానికి ఏపీ యువత మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ జాఫర్, ప్రధాన సలహాదారులు ఎస్ ఎస్ రావు, విల్సన్ బాబు, గావర్ని0గ్ కౌన్సిల్ సభ్యులు వర్ధనపు ప్రకాష్ బాబు, నల్లి నాగేశ్వరరావు, సహాయ కోశాధికారి భార్గవ్, బిసి సభ్యుడు పిల్లి మురళి కృష్ణ, స్పోర్ట్స్ సభ్యుడు నేతల జయరాజు, సోషల్ మీడియా వింగ్ సభ్యుడు ఇంజేటి శ్రీను, మరియు యం. రాజు, మోహన్ రెడ్డి, పవన్ రెడ్డి, నాగరాజు, కె. అరుణ్ తదితరులు పాల్గొన్నారు.