విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా : తెలంగాణలో టీఆర్ఎస్ 34 మాసాల పాలనలో అప్పులు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే మార్చి వరకు అప్పు రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని జోస్యం చెప్పారు. ఆంద్ర గుత్తేదార్ల కొమ్ముకాస్తూ మిషన్ భగీరథ పేరుతో రూ.45 వేల కోట్ల అప్పు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలోని ఒక్కొక్కరిపై రూ.20 వేలు వెచ్చిస్తున్నారని, మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తే ప్రతి గ్రామానికి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వవచ్చునని వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు, తాగు నీటి కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. నీటి సమస్య పరిష్కారానికి వెంటనే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితో చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment