karim nagar distirict
-
రెండున్నర దశాబ్దాలైనా.. వీడని ఎస్ఎస్సి బంధం
కరీంనగర్: ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్‌లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 26 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాల పదవ తరగతి 1996-97 పూర్వ విద్యార్థులు. తిరిగి ఒకే గూటికి చేరిన జ్ఞాపకాలు.. ప్రగతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 26 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో.. అదే తరగతి గదిలో.. అదే బెంచ్ పై కూర్చుని, వారు ఒకరినొకరు పలకరించుకుంటూ.. కలుసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి అధ్యక్షతన జ్యోతి ప్రజల్వను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి జీవితంలో సాధించిన విజయాలు, కష్టాల గురించి చర్చించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ మాట్లాడుతూ.. వారు చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ప్రధానం చేశారు. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కరీంనగర్లో స్థిరపడిన అబు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ.. వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ.. తమ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మనకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి, విద్యార్థులు అబు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, కుమార్, సురేష్, వనజ, కళాజ్యోతి, శ్రావణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో నైట్ కర్ఫ్యూ.. సహకరిస్తున్న ప్రజలు
-
త్వరలో కొత్త పంచాయతీరాజ్ చట్టం: ఎర్రబెల్లి
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల స్థానిక సంస్థల అధికారాలు గల్లంతయ్యాయని, త్వరంలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం తేబోతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి జెడ్పీ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా మళ్లీ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిథులకు అధికారాలు ఇస్తే అభివృద్ధి జరుగుతుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. అసెంబ్లీలో చట్టసవరణ చేశాక స్థానిక సంస్థలకు చెక్‌పవర్, అధికారాలు ఇస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తెస్తున్నామని, పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో లోపాలున్నాయని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి రహిత పాలన అందివ్వాలన్నది సీఎం ఆలోచన, నిధుల విషయంలో కరీంనగర్‌కు పెద్దపీట వేస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ ఉండదు: ఈటల రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ ఉండదని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పదవి ముఖ్యం కాదు.. ఆ పదవిలో ఎంత మంచి పని చేశామన్నది ముఖ్యమన్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు ఎప్పుడూ జరగలేదని, మంత్రిగా సొంత జిల్లాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని, వైద్యరంగంపై దృష్టి పెడతానని చెప్పారు.స్థానిక సంస్థల పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన పనులను వేగవంతం చేస్తామన్నారు. -
స్వదేశానికి ఫారహాద్దీన్ మృతదేహం
కరీంనగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఫారహాద్దీన్ కువైట్‌లో మరణించారు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. మహమ్మద్ ఫేరాజుద్దీన్ కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదం అతను మృతిచెందారు. ఫారహాద్దీన్ మృతదేహాన్ని ఫ్లయిట్ నెం. అల్ జజీరా J9-403లో కువైట్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 1.35గం.లకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అతని బంధువు ఆసాఢహ్మద్ ఖాన్‌ను సిటీస్ బస్సు యాజమాన్యం అదే ప్లయిట్ లో శవపేటికతో పాటు పంపారు. వారి దగ్గరి బంధువు ఖాజా జాహీరోద్దీన్, సామాజిక కార్యకర్త శ్రీ స్వదేశ్ పరికిపండ్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో శవపేటికను స్వీకరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చిట్టి బాబు నేతృత్వంలో అంబులెన్సును ఏర్పాటు చేశారు. మదదు పోర్టల్ ద్వారా, ఎంబసీ సహకారం తీసుకున్నారు. ఖాదర్ సిటీ బస్సు యాజమాన్యం తరపున సెటిల్మెంట్లో ఒకరిని ఇచ్చి పంపడంలో చాలా బాగా సహకరించింది. అతని మిత్రులు సర్వర్, అదిల్ సహకరించారు. శ్రీ భీం రెడ్డి, ఆ ఏరియా సీఐ త్వరగా వెంటనే స్పందించారు. ఈ మొత్తం పనిలో తెలంగాణ ప్రభుత్వం, సిటీ బాస్ యాజమాన్యం, ఇంటివారితో మాట్లాడం పనులు జరుగడంలో గంగుల మురళీధర్ రెడ్డి తన పని చేసారు. భవిష్యత్తులో ఇతని ఇన్సూరెన్సు కు కూడా కంపెనీ తో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు : చిరునామా: ఇంటినెంబర్ 8-14-3/5, కృష్ణ నగర్, కళ్యాణి గార్డెన్ దగ్గర, బొమ్మకల్ (గ్రామం ), కరీంనగర్ జిల్లా -
కొత్త పంచాయతీలకు నిధుల కొరత!
సాక్షి, జమ్మికుంట రూరల్: నూతన గ్రామపంచాయతీలు కొలువుదీరి 40రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధిలో మాత్రం ఖాతా తెరవలేదు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ అధికారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరుచుకోలేదు. దీంతో పల్లెల్లోని ఏచిన్న అభివృద్ధి పనికాని, మౌళిక వసతుల కల్పనకు గాని నోచుకోవ డం లేదు. మరోవైపు వేసవి సమీపించడంతో గ్రా మాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో కనీసం తాగునీటి కొరత అధిగమించేందుకు కనీసచర్యలు చేపట్టాలన్నా, బ్యాంకు లా వాదేవీలు ఖాతాలు తెరవడం అనివార్యమైంది. ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటుచేసిన కొత్త పం చాయతీలకు విధులే తప్ప నిధులు లేని పరిస్థితి. గత అక్టోబర్‌లో పెద్ద పంచాయతీలను వీడదీసి నూతన పంచాయతీలను ఏర్పాటుచేశారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా ఇందులో నుంచి కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి గ్రామా లు జమ్మికుంట మున్సిపాలిటీలో విలీనం కాగా నూతనంగా నాగారం, పాపక్కపల్లి, నాగంపేట, పాపయ్యపల్లి,వెంకటేశ్వర్లపల్లి, శంభునిపల్లి గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త, పాత పం చాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాం ట్ రూపంలో నిధులు వస్తున్పప్పటికీ, కొత్త పం చాయతీలు నిధులు మంజూరుకు నోచుకోవడం లేదు. జిల్లాలో మూడు విడుతలుగా నిర్వహించిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనవరి 30న ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్త పాలకవర్గాలు కొ లువు దీరినప్పటికీ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంతవర కు సంబంధిత రికార్డులు కూడా అందుబాటులో లేవు. పాత పంచాయతీలను వీడదీసి నూతన పం చాయతీలు ఏర్పాటుచేసే సమయంలో కేవలం ఇంటిపన్నుల రిజిస్టర్ మాత్రమే ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉంచారు. పాలకవర్గాలు గ్రామాల్లో సాధారణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి కొంత నిధులు అందుబాటు లో ఉండాలి. కాని నేటివరకు కొత్త పంచాయతీల్లో బ్యాంకు ఖాతాలు తెరవలేదు. జాప్యం చేస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వం పంచాయతీ నిధులకు సంబంధించి ఎ లాంటి ఏర్పాటుచేయకపోవడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏం అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ప్రతి పంచాయతీలో నిధులు ఏర్పాటు చే యాలని తెలంగాణ పంచాయతీ రాజ్‌చట్టం స్ప ష్టంగా పేర్కొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో అధికార పార్టీలో ఉన్న సర్పంచ్‌లు ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెప్పకనే చెబుతున్నారు. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు మంజూరు అవుతాయి. దీంతో పాటు గ్రామపంచాయాతీల్లో వసూలయ్యే అన్నిరకాల పన్నులను ప్రభుత్వ ట్రేజరీలో జమచేయాల్సి ఉంటుంది. కా నీ బ్యాంకు అకౌంట్లు ఉంటేనే నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. ఆడిట్ తప్పితే అంతే... గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి పంచా యతీ రాజ్‌చట్టం ప్రకారం నిధులు ఆదాయ, వ్యవ యాలకు సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చే యాల్సిందే. ఒకవేళ సకాలంలో ఆడిట్ చేయకపో తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు ఉంటాయని చ ట్టంలో స్పష్టంగా పేర్కొంది. నిధులు విడుదల చేయాలి నూతన గ్రామపంచాయతీలకు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి, నిధులు విడుదల చేయాలి. గ్రామంలో ఏ చిన్నపని చేయాలన్న నిధులు అవసరం. ఇప్పటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. నేడో, రేపో గ్రామసభలు ఉంటాయని అధికారులు తెలిపారు. గ్రామసభలో ఏం జరుగుతుందో చూస్తాం. – మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, శంభునిపల్లి -
టీఆర్ఎస్ పాలనలో అప్పులు రెట్టింపు
కరీంనగర్ జిల్లా : తెలంగాణలో టీఆర్ఎస్ 34 మాసాల పాలనలో అప్పులు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే మార్చి వరకు అప్పు రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని జోస్యం చెప్పారు. ఆంద్ర గుత్తేదార్ల కొమ్ముకాస్తూ మిషన్ భగీరథ పేరుతో రూ.45 వేల కోట్ల అప్పు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని ఒక్కొక్కరిపై రూ.20 వేలు వెచ్చిస్తున్నారని, మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తే ప్రతి గ్రామానికి ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వవచ్చునని వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు, తాగు నీటి కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. నీటి సమస్య పరిష్కారానికి వెంటనే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితో చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. -
అలా అయితే బిల్లును అడ్డుకుంటాం: టీఆర్ఎస్ ఎంపీ
కరీంనగర్ : తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా ఏపీకి మాత్రమే ఇస్తూ పార్లమెంటులో బిల్లు పెడితే అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్లో ఎంపీ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలపై శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టు వివరణ ఇవ్వాలని కోరారు. ఎవ్వరైనా చట్టాన్ని గౌరవించక తప్పదని చెప్పారు. -
కరీంనగర్ టు కాళేశ్వరం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 9.50 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పరిశీలనలో భాగంగా బుధవారం సాయంత్రం 5.15 తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేరుకున్నారు. రాత్రి బస అనంతరం ఉదయం జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితాసబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి రెండు హెలికాప్టర్లలో వెళ్లారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ భవన్లో ఉదయం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎంను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు బారులు తీరగా కొద్దిసేపు తోపులాట జరిగింది. పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ ‘ఆగండి.. తోపులాటలు వద్దు.. అందరినీ కలుస్తా.. అందరితో మాట్లాడుతా..’ అంటూ కరచాలనం చేస్తూ పలకరించారు. ప్రాజెక్టుబాటకు బయలుదేరుతున్న సమయంలోనూ తనను కలిసేందుకు వచ్చిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ టు గోలివాడ వరకు.. నేడు కూడా ప్రాజెక్టుల బాట.. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు కరీంనగర్ తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్ నుంచి బయలు దేరిన సీఎం కేసీఆర్ మేడిగడ్డ నుంచి గోలివాడ పంపుహౌజ్ పనుల తీరును పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట తుపాకుల గూడెంకు చేరుకుని అక్కడి నుంచి సుమారు ఎనిమిది ప్రాంతాలలో హెలికాప్టర్ ద్వారా ఆగుతూ సాగారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పనులను కన్నెపల్లి, శ్రీపురం, గోలివాడ పంప్‌హౌజ్ పనులను ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం శుక్రవారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పనులు పర్యవేక్షించేందుకు రామగుండం ఎన్టీపీసీ అతిథి గృహంలోనే రాత్రి బస చేశారు. శుక్రవారం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టుల బాటను సీఎం కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా శుక్రవారం మేడారం, రామడుగు, మల్యాల మండలంలో కొనసాగుతున్న పంప్ హౌజ్ పనులను, సొరంగ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్ అధికారులతో రామడుగులో సమీక్ష సమావేశం నిర్వహించి మధ్యాహ్నం హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే మధ్య మానేరు పనుల పురోగతిని పరిశీలించి సాయంత్రం నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
తాగి తన్నుకున్నారు..!
మద్యం సేవించిన ఇద్దరు కానిస్టేబుల్లు విధుల్లో ఉన్న మరో కానిస్టేబుల్ పై దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు... టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నర్సింగ్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సతీష్ ఇద్దరు కలిసి ఆదివారం రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో తన స్నేహితుడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని సతీష్ నర్సింగ్ తో చెప్పడంతో ఇద్దరూ కలిసి స్టేషన్ కు బయలు దేరారు. స్టేషన్ ముందు సెంట్రిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి మీరు ఎవరు? అని ప్రశ్నించగా.. మమ్మల్నే ఎవరంటావా.... అంటూ అతనిపై దాడి చేశారు. వివాదం ముదరడంతో.. తోటి పోలీసులు కల్పించుకుని వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే దాడి చేసిన పోలీసులపై ఇంత వరకూ కేసు నమోదు కాలేదు. -
సంపులో పడి బాలుడి మృతి
ప్రమాద వశాత్తు సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పట్టణంలోని గంగానగర్ లో ఆదివారం జరిగింది. సునీల్(5) అనే బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడ్డాడు. సంపులో బాలుడు పడి సంగతి ఎవరూ గమనించక పోవడంతో.. ఊపిరాడక బాలుడు మరణించాడు. -
వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్: హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన పడమటింటి భాస్కర్ (32) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. పెళ్లి సంబంధం కోసం వివరాలు తీసుకురమ్మని స్నేహితుడు ఫోన్ చేయడంతో ఇంటి నుంచి బయలుదేరిన బాస్కర్ శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. అలకాపురి వద్ద గుర్తుతెలియని దుండగులు అతన్ని కత్తులతో పొడిచి ఆపై బండరాయితో మోది అతి కిరాతకంగా చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.