గ్రామపంచాయతీ కార్యాలయం పాపయ్యపల్లె
సాక్షి, జమ్మికుంట రూరల్: నూతన గ్రామపంచాయతీలు కొలువుదీరి 40రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధిలో మాత్రం ఖాతా తెరవలేదు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ అధికారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరుచుకోలేదు. దీంతో పల్లెల్లోని ఏచిన్న అభివృద్ధి పనికాని, మౌళిక వసతుల కల్పనకు గాని నోచుకోవ డం లేదు. మరోవైపు వేసవి సమీపించడంతో గ్రా మాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి.
దీంతో కనీసం తాగునీటి కొరత అధిగమించేందుకు కనీసచర్యలు చేపట్టాలన్నా, బ్యాంకు లా వాదేవీలు ఖాతాలు తెరవడం అనివార్యమైంది. ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటుచేసిన కొత్త పం చాయతీలకు విధులే తప్ప నిధులు లేని పరిస్థితి. గత అక్టోబర్‌లో పెద్ద పంచాయతీలను వీడదీసి నూతన పంచాయతీలను ఏర్పాటుచేశారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా ఇందులో నుంచి కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి గ్రామా లు జమ్మికుంట మున్సిపాలిటీలో విలీనం కాగా నూతనంగా నాగారం, పాపక్కపల్లి, నాగంపేట, పాపయ్యపల్లి,వెంకటేశ్వర్లపల్లి, శంభునిపల్లి గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి.
కొత్త, పాత పం చాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాం ట్ రూపంలో నిధులు వస్తున్పప్పటికీ, కొత్త పం చాయతీలు నిధులు మంజూరుకు నోచుకోవడం లేదు. జిల్లాలో మూడు విడుతలుగా నిర్వహించిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనవరి 30న ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్త పాలకవర్గాలు కొ లువు దీరినప్పటికీ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంతవర కు సంబంధిత రికార్డులు కూడా అందుబాటులో లేవు.
పాత పంచాయతీలను వీడదీసి నూతన పం చాయతీలు ఏర్పాటుచేసే సమయంలో కేవలం ఇంటిపన్నుల రిజిస్టర్ మాత్రమే ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉంచారు. పాలకవర్గాలు గ్రామాల్లో సాధారణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి కొంత నిధులు అందుబాటు లో ఉండాలి. కాని నేటివరకు కొత్త పంచాయతీల్లో బ్యాంకు ఖాతాలు తెరవలేదు.
జాప్యం చేస్తున్న ప్రభుత్వం..
ప్రభుత్వం పంచాయతీ నిధులకు సంబంధించి ఎ లాంటి ఏర్పాటుచేయకపోవడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏం అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ప్రతి పంచాయతీలో నిధులు ఏర్పాటు చే యాలని తెలంగాణ పంచాయతీ రాజ్‌చట్టం స్ప ష్టంగా పేర్కొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో అధికార పార్టీలో ఉన్న సర్పంచ్‌లు ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెప్పకనే చెబుతున్నారు.
గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు మంజూరు అవుతాయి. దీంతో పాటు గ్రామపంచాయాతీల్లో వసూలయ్యే అన్నిరకాల పన్నులను ప్రభుత్వ ట్రేజరీలో జమచేయాల్సి ఉంటుంది. కా నీ బ్యాంకు అకౌంట్లు ఉంటేనే నిధులు సమకూరే అవకాశం ఉంటుంది.
ఆడిట్ తప్పితే అంతే...
గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి పంచా యతీ రాజ్‌చట్టం ప్రకారం నిధులు ఆదాయ, వ్యవ యాలకు సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చే యాల్సిందే. ఒకవేళ సకాలంలో ఆడిట్ చేయకపో తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు ఉంటాయని చ ట్టంలో స్పష్టంగా పేర్కొంది.
నిధులు విడుదల చేయాలి
నూతన గ్రామపంచాయతీలకు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి, నిధులు విడుదల చేయాలి. గ్రామంలో ఏ చిన్నపని చేయాలన్న నిధులు అవసరం. ఇప్పటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. నేడో, రేపో గ్రామసభలు ఉంటాయని అధికారులు తెలిపారు. గ్రామసభలో ఏం జరుగుతుందో చూస్తాం.
– మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, శంభునిపల్లి
Comments
Please login to add a commentAdd a comment