gramapancayati
-
చెంబురాజు..చెత్తరాజు...దొంగరాజు!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నుంచి సోమవారం (30వ తేదీ) వరకు ‘స్వచ్ఛసర్వేక్షణ్ ’కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా చెత్తసేకరణ, నిర్వహణ, తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేస్తారు. అధికారులు పల్లెల్లో బృందాలుగా విడిపోయి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో చెత్తబుట్టలు ఉండేలా చర్యలతో పాటు, ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంప్ యార్డులను తరలిస్తారు. ఈ యార్డుల్లో కంపోస్ట్ ఎరువు తయా రీ, బహిరంగ మలవిసర్జన చేయకుండా చూడడం వంటివి అమలు చేస్తారు. దాతలకు వైవిధ్య గుర్తింపు.. గ్రామాల అభివృద్ధికి రూ.లక్ష అంతకు మించి డబ్బు లేదా వస్తు రూపేణా ఇచ్చిన దాతల పేరును ఏడాదిపాటు నోటీస్ బోర్డుపై ఉంచడంతో పాటు వారికి ‘మా ఊరి మహారాజపోషకులు’గా పరిగణించాలని వివిధ గ్రామ పంచాయతీలు నిర్ణయించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష ఆపైనా డబ్బు లేదా వస్తురూపేణా ఇచ్చే దాతల పేర్లను నోటీస్ బోర్డుపై నెలరోజులపాటు ఉంచి ‘మా ఊరి మహారాజు’గా గుర్తిస్తారు. రూ.5 నుంచి రూ.10 వేలు ఆపైనా ఇచి్చన దాతల పేరును నోటీసుబోర్డుపై వారం పాటు ఉంచడంతో పాటు‘మా ఊరి రాజు’గా వ్యవహరిస్తారు. ఇక బహిరంగ మల విసర్జనకు పాల్పడే వారికి రూ.500 వరకు జరిమానా విధించాలని వివిధ గ్రామపంచాయతీలు, గ్రామసభలు నిర్ణయించాయి. ఈ పనికి పాల్పడేవారికి ‘చెంబురాజు’గా పిలుస్తారు. రోడ్లపై, బహిరంగస్థలాల్లో చెత్తాచెదారం పారవేసే వారికి ‘చెత్తరాజు’గా నిర్ణయించారు. చెత్తా చెదారం, వ్యర్థాలు ఆరుబయట, రోడ్లపై, బహిరంగస్థలాల్లో వేసే వారికి కూడా రూ.500 వరకు జరిమాన వేస్తారు. విద్యుత్ దొంగతనానికి పాల్పడేవారికి ‘దొంగరాజు’గా వ్యవహరించనున్నారు. బుధవారం నుంచే ఇవి అమలులోకి వచ్చాయి. -
కొత్త పంచాయతీలకు నిధుల కొరత!
సాక్షి, జమ్మికుంట రూరల్: నూతన గ్రామపంచాయతీలు కొలువుదీరి 40రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధిలో మాత్రం ఖాతా తెరవలేదు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ అధికారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరుచుకోలేదు. దీంతో పల్లెల్లోని ఏచిన్న అభివృద్ధి పనికాని, మౌళిక వసతుల కల్పనకు గాని నోచుకోవ డం లేదు. మరోవైపు వేసవి సమీపించడంతో గ్రా మాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో కనీసం తాగునీటి కొరత అధిగమించేందుకు కనీసచర్యలు చేపట్టాలన్నా, బ్యాంకు లా వాదేవీలు ఖాతాలు తెరవడం అనివార్యమైంది. ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటుచేసిన కొత్త పం చాయతీలకు విధులే తప్ప నిధులు లేని పరిస్థితి. గత అక్టోబర్‌లో పెద్ద పంచాయతీలను వీడదీసి నూతన పంచాయతీలను ఏర్పాటుచేశారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా ఇందులో నుంచి కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి గ్రామా లు జమ్మికుంట మున్సిపాలిటీలో విలీనం కాగా నూతనంగా నాగారం, పాపక్కపల్లి, నాగంపేట, పాపయ్యపల్లి,వెంకటేశ్వర్లపల్లి, శంభునిపల్లి గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త, పాత పం చాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాం ట్ రూపంలో నిధులు వస్తున్పప్పటికీ, కొత్త పం చాయతీలు నిధులు మంజూరుకు నోచుకోవడం లేదు. జిల్లాలో మూడు విడుతలుగా నిర్వహించిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనవరి 30న ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్త పాలకవర్గాలు కొ లువు దీరినప్పటికీ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంతవర కు సంబంధిత రికార్డులు కూడా అందుబాటులో లేవు. పాత పంచాయతీలను వీడదీసి నూతన పం చాయతీలు ఏర్పాటుచేసే సమయంలో కేవలం ఇంటిపన్నుల రిజిస్టర్ మాత్రమే ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉంచారు. పాలకవర్గాలు గ్రామాల్లో సాధారణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి కొంత నిధులు అందుబాటు లో ఉండాలి. కాని నేటివరకు కొత్త పంచాయతీల్లో బ్యాంకు ఖాతాలు తెరవలేదు. జాప్యం చేస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వం పంచాయతీ నిధులకు సంబంధించి ఎ లాంటి ఏర్పాటుచేయకపోవడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏం అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ప్రతి పంచాయతీలో నిధులు ఏర్పాటు చే యాలని తెలంగాణ పంచాయతీ రాజ్‌చట్టం స్ప ష్టంగా పేర్కొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో అధికార పార్టీలో ఉన్న సర్పంచ్‌లు ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెప్పకనే చెబుతున్నారు. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు మంజూరు అవుతాయి. దీంతో పాటు గ్రామపంచాయాతీల్లో వసూలయ్యే అన్నిరకాల పన్నులను ప్రభుత్వ ట్రేజరీలో జమచేయాల్సి ఉంటుంది. కా నీ బ్యాంకు అకౌంట్లు ఉంటేనే నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. ఆడిట్ తప్పితే అంతే... గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి పంచా యతీ రాజ్‌చట్టం ప్రకారం నిధులు ఆదాయ, వ్యవ యాలకు సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చే యాల్సిందే. ఒకవేళ సకాలంలో ఆడిట్ చేయకపో తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు ఉంటాయని చ ట్టంలో స్పష్టంగా పేర్కొంది. నిధులు విడుదల చేయాలి నూతన గ్రామపంచాయతీలకు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి, నిధులు విడుదల చేయాలి. గ్రామంలో ఏ చిన్నపని చేయాలన్న నిధులు అవసరం. ఇప్పటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. నేడో, రేపో గ్రామసభలు ఉంటాయని అధికారులు తెలిపారు. గ్రామసభలో ఏం జరుగుతుందో చూస్తాం. – మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, శంభునిపల్లి -
ప్రభ కోల్పోతున్న జెడ్పీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లు (జెడ్పీలు) క్రమక్రమంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ప్రస్తుతం జెడ్పీలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇవి గత కాలపు వైభవానికి చిహ్నాలుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోవడానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు 14వ ఆర్థికసంఘం సిఫార్సులు ప్రధాన కారణం కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు తగ్గిపోవడం మరో కారణం. 2015 సంవత్సరం నుంచి 14వ ఆర్థికసంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక నేరుగా గ్రామపంచాయతీలకే అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నారు. దీంతో వివిధ పథకాల కింద జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా విడుదలయ్యే నిధులు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 మేలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జెడ్పీల సంఖ్య 9 ఉండగా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు (తాజాగా ప్రకటించిన రెండు జిల్లాలు కలిపి), మండలాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు పెరగబోతోంది. అక్కడ సాధ్యమేనా? ఈ ఏడాది జూలైతో పాత జిల్లాపరిషత్‌ల కాలపరిమితి ముగిశాక, కొత్త జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మేడ్చల్ జిల్లా పరిధిలో 5, వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 7 మండలాలు, గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాల్లోని మండలాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపై స్పష్టత రాలేదు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానికసంస్థలకు అధికారాలను కట్టబెట్టడంలో భాగంగా సాధారణంగా జిల్లాగా ప్రకటించిన ప్రాంతాన్నే జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ)గా పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా మార్పులు,చేర్పులు చేపడుతుందా? లేక ఇప్పటికే ఏర్పాటు చేసిన 31 జిల్లాలతోపాటుగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలతో కలసి మొత్తం 32 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన ప్రకారమేనా? జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారమే కొత్త జిల్లా,మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు అవుతాయని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కూడా స్పష్టం చేసినందున తదనుగుణంగానే కొత్త జిల్లాలు, మండలాలు ప్రత్యేక యూనిట్లుగా మారతాయి. 1974 తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారం కూడా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలు,కొత్త మండలాల ప్రాతిపదికన మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడతాయి. గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజాగా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది. -
తండాలన్నీ ఎస్టీలకు కాదు!
సాక్షి, హైదరాబాద్ : .. ఈ పరిస్థితి రెండు గ్రామ పంచాయతీలకే పరిమితం కావడం లేదు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటవుతున్న వందలాది తండాల్లో ఈ సమస్య తలెత్తనుంది. ఇతర వర్గాల ఓటర్లు కనీసం పది మంది కూడా లేనిచోట రిజర్వేషన్ల రొటేషన్లతో ఆయా వర్గాలకు సర్పంచ్ పదవి కేటాయించే పరిస్థితి ఉంటుంది. దీనితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు పాలనా అవకాశం కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోనుంది. ఈ పరిస్థితిని ఊహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చే విషయంపై న్యాయశాఖతో కలసి అధ్యయనం చేస్తున్నారు. 4,122 కొత్త పంచాయతీలు రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో 500 మంది జనాభా ప్రాతిపదికన.. కొండలు, గుట్టల ప్రాంతాల్లో, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో 300 జనాభా ప్రాతిపదికన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. చివరిగా మరోసారి జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నారు. కొత్త పంచాయతీలతో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొత్తంగా 12,806కు చేరనున్నాయి. 957 కొత్త పంచాయతీల్లో సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ మారుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని పదవులను పూర్తిగా ఎస్టీ వర్గం వారికే కేటాయిస్తారు. కానీ మైదాన ప్రాంతాల్లోని తండాల్లో రిజర్వేషన్ల రొటేషన్ సమస్య తలెత్తనుంది. రాష్ట్రంలో కొత్తగా 2,243 తండాలు గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుండగా.. ఇందులో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,286 మాత్రమే. మిగతా 957 తండాల్లో ఇతర వర్గాలకు చెందినవారు కొద్ది సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో సర్పంచ్‌తోపాటు కొన్ని వార్డు సభ్యుల పదవులు ఇతర వర్గాలకు రిజర్వు అయ్యే పరిస్థితి ఉండనుంది. ప్రత్యేక నిబంధనపై కసరత్తు! గ్రామ పంచాయతీలుగా మారే తండాల్లోని ఓటర్లలో ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారన్న విషయంపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పూర్తిగా ఎస్టీ వర్గం వారికే రిజర్వు అయ్యేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనను చేర్చాలన్న అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఇక కేవలం నలుగురైదుగురు ఇతర వర్గాల వారున్న పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్ అంశంపైనా చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. డీసీ తండా.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఒక గ్రామ పంచాయతీ. నాలుగు తండాలు కలిపి గ్రామ పంచాయతీగా ఉంది. సమీపంలోని ఓ గ్రామం నుంచి నలుగురు బీసీ వర్గం వారు డీసీ తండాలో స్థిరపడ్డారు. 2013 పంచాయతీ ఎన్నికల సమయంలో డీసీ తండా సర్పంచ్ పదవి రొటేషన్‌లో బీసీలకు వచ్చింది. నలుగురే ఓటర్లున్న వర్గానికి రిజర్వేషన్ రావడంతో గిరిజనులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో ఎవరూ నామినేషన్ వేయక, సర్పంచ్ ఎన్నిక జరగలేదు. వార్డు సభ్యులలో ఒకరు ఉప సర్పంచ్ అయ్యారు. ఆయనే ఇన్చార్జి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాంధన్ తండా.. వర్ధన్నపేట మండలంలోని మరో గ్రామ పంచాయతీ. ఒక్క కుటుంబం మినహా అంతా లంబాడీ తెగవారే. కానీ 2013 ఎన్నికలప్పుడు రిజర్వేషన్ రొటేషన్‌లో సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. ఉన్న ఒక్క కుటుంబంలోని వారే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. -
చిగురిస్తున్న ఆశలు..!
రాజాపూర్ : సరైన రోడ్లు, విద్యుత్, నీటి వసతి లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఇన్నాళ్లు గిరిజన తండాలు ఉండేవి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను గ్రామపంచాయతీగా ప్రకటించి అభివృద్ధి చేస్తామని ఎన్నికల హామీలో పేర్కొన్న విషయం విధితమే. ఈమేరకు తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించేందుకు ఇటీవల నివేదికలు సిద్ధం చేస్తుండడం.. మండల అధికారుల నుంచి సమాచారం తీసుకుంటుండడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ కష్టాలు ఇక తీరనున్నాయని.. అన్ని వసతులు కల్పనతోపాటు తండాలు అభివృద్ధి చెందనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 8 తండాలకు జీపీలుగా అవకాశం నూతనంగా ఏర్పాటైనన రాజాపూర్ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా మరో 8 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలంలో ఇప్పటికే కుత్నపల్లె, రాఘవాపూర్, నర్సింగ్‌తండా, సింగమ్మగడ్డతండా, మోత్కులకుంటతండా, పల్గుతండా, బీబీనగర్‌తండా, నాన్‌చెరువుతండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు నివేదికలు తయారు చేశారు. అయితే 8 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేస్తే మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో తండాలకు ప్రత్యేక నిధులు వస్తే తండాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామాలకు తండాలు అనుబంధంగా ఉండటంతో తండాలను పట్టించుకునేవారు కాదని మా తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయితే అభివృద్దికి వీలు ఉంటుందని గిరిజనులు అంటున్నారు. అభివృద్ధి చెందుతాయి మా తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అవుతున్నందున సంతోషంగా ఉంది. గతంలో తండాలను అసలు పట్టించుకునే వారు కాదు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటవుతున్నందున ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. పాఠశాలలు ఏర్పాటుచేయడంతోపాటు, నీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యాలు మెరుగు పర్చనున్నారు. – గీత, మోత్కులకుంట తండా హామీ నెరవేరుస్తున్నాం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించనుంది. దీంతో ప్రత్యేక నిధులు కేటాయించి తండాల్లో సమస్యలు పరిష్కరించనుంది. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పని చేస్తున్నారు. 8 తండాలు గ్రామపంచాయతీలుగా మారనున్నాయి. – ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ -
అర్హులకు సంక్షేమ ఫలాలు
జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి నేరడిగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడడమే ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వాగ్ధారి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ ఫలాలు అర్హులకు చేరుతున్నాయా.. లేదా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను జేసీకి విన్నవించగా, ఓపికగా ప్రతీ సమస్యకు పరిష్కార మార్గాలు చూపించారు. సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, పేదలు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కొందరు పింఛన్లు రావడం లేదని, రేషన్‌కార్డులు లేవని జేసీకి తెలిపారు. అర్హులకు వెంటనే పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు మరుగుదొడ్ల నిర్మాణానికి జేసీ భూమిపూజ చేశారు. స్థానిక సర్పంచ్ సిడాం పార్వతిబాయి, ప్రత్యేక అధికారి మధుసూదనచారి, తహసీల్దార్ కూనాల గంగాధర్, ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్, ఎంఈవో భూమారెడ్డి, వైద్యాధికారి శ్రీధర్‌రెడ్డి, పశువైద్యాధికారిణి నేహ, ఈజీఎస్ ఏపీవో మంజులారెడ్డి, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు వేణుగోపాల్‌రెడ్డి, ఇర్ఫాన్, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ-పాలన ఎప్పుడో..?
పల్లెలను ప్రపంచంతో అనుసంధానం చేసే బృహత్తర కార్యక్రమం ఈ-పాలన ఎందుకో జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు పంచాయతీ కార్యాలయాల్లో అలంకార ప్రాయంగా మారాయి. మరో వైపు ఈ-పాలన కోసం పది నెలల క్రితం శిక్షణ ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్లకు నేటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. - మిర్యాలగూడ * నిర్వాహకులు, అధికారుల మధ్య కొరవడిన సమ్వయం * ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చినా.. పోస్టింగ్ ఇవ్వని అధికారులు * గ్రామపంచాయతీల్లో నిరుపయోగంగా కంప్యూటర్లు పాలనలో పారదర్శకతతో పాటు మారుమూల గ్రామాలను సైతం ఇంటర్నెట్ అనే వ్యవస్థ ద్వారా ప్రపంచంతో అనుసందానం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ-పాలనకు శ్రీకారం చుట్టింది. కానీ నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం నిర్వాహకులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ-పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 2440 గ్రామ పంచాయతీలలో ఈ-పాలన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలోని 171 పంచాయతీలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో నల్లగొండ డివిజన్ పరిధిలో 65, మిర్యాలగూడ డివిజన్లో 53, భువనగిరి డివిజన్ పరిధిలో 53 గ్రామాలు ఉన్నాయి. ఎంపిక చేసిన గ్రామాలకు మూడు నెలల క్రితమే కంప్యూటర్లు పంపిణీ చేసి బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా ఇచ్చారు. కానీ ఆపరేటర్లను నియమించకపోవడంతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. పది నెలల క్రితం శిక్షణ పల్లెల్లో ఇంటర్నెట్ ద్వారా పాలన అందించడానికి గానూ కంప్యూటర్ ఆపరేటర్లను పది నెలల క్రితమే ఎంపిక చేశారు. వీరికి హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేసి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చింది. కానీ ఆపరేటర్లను మాత్రం నియమించలేదు. పంచాయతీలకు కంప్యూటర్లు వచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో శిక్షణ పొందిన అభ్యర్థులు ఆయోమయంలో పడిపోయారు. జిల్లాలో 237 కంప్యూటర్ల పంపిణీ జిల్లాలో ఈ-పాలన అమలు చేయడానికి గానూ 237 కంప్యూటర్లు పంపిణీ చేశారు. జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయానికి ఒకటి చొప్పున 59, ఈ-పాలనకు ఎంపికైన గ్రామపంచాయతీలకు 171, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి రెండు, డివిజన్ పంచాయతీల కార్యాలయాలకు మూడు, జిల్లా పరిషత్ కార్యాలయానికి రెండు కంప్యూటర్లు కేటాయించిన పంపిణీ చేశారు.