huzuarabad
-
మూగబోనున్న మేకులు..నేటితో ప్రచారనికి తెర
-
హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: హరీశ్ రావు
-
జర్మన్ హంగర్ టెక్నాలజీతో కేసీఆర్ సభ.. ఎందుకంటే?
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి సభా ప్రాంగణం ముస్తాబైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 మేలో ఇదే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సైతం ఇదే శాలపల్లి వేదికగా ప్రారంభించడం గమనార్హం. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల కంటే ఈ పథకం ఆది నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే.. సభను అనుకున్నదాని కంటే ఎక్కువరెట్లు విజయవంతం చేసేలా సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శాలపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి సభాస్థలికి వస్తారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే సభ మొదలవుతుంది. సభా ఏర్పాట్లను ఆదివారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సభకు నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్షా ఇరవై వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకుగాను అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ.. జర్మన్ హంగర్ టెక్నాలజీతో సభ ఏర్పాట్ల పూర్తి చేశారు. ఎంత భారీవర్షం పడినా, గాలులు వీచినా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినా ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. 15 మంది ఎంపిక ఇలా జరిగింది..! నియోజకవర్గం నుంచి ఎంపికైన 15 మంది దళిత కుటుంబాల ఎంపికపై సంఖ్యాపరమైన సమాచారాన్ని అధికారులు అందజేశారు. అందులో జమ్మికుంట మండలం గ్రామీణ ప్రాంతం నుంచి ఇద్దరు, టౌన్ నుంచి ఇద్దరు, హుజూరాబాద్ మండలం టౌన్ నుంచి ఇద్దరు, రూరల్ నుంచి ఇద్దరు, వీణవంక మండలం నుంచి ఇద్దరు, ఇల్లందకుంట నుంచి ఇద్దరు, కమలాపూర్ నుంచి ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరంతా కుటంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. అధికారులు వీరి వివరాలు వెల్లడించకపోయినా.. ఈ కుటుంబాలను సభాస్థలికి రప్పించేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశారు. వీరికి సభాప్రాంగణంపై కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. 200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్ ఈ సభలో 200 మంది కూర్చుండేలా పెద్ద డయాస్ ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్ పక్కనే మరో డయాస్ కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్‌లో వెనుక కూర్చున్న వారు కనిపించేలా నిర్మాణం చేశారు. ఈ సభలో మొత్తంగా 10 బ్లాకులు ఏర్పాట్లు చేశారు. 5 బ్లాకుల్లో మహిళలు, మరో 5 బ్లాకుల్లో పురుషులు కూర్చుండేలా కుర్చీలను సమకూర్చారు. లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం.. దళితబంధు సభకు లక్షా 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు గాను అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 825 బస్సుల్లో దళితబంధువులు హాజరవుతారని సమాచారం. బస్సులు సభా వేదికకు దాదాపు 500 మీటర్ల దూరంలో నిలుపుతారు. అక్కడ వారు దిగిన తర్వాత సభా వేదికకు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 25 ఎకరాల స్థలంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గులాబీమయంగా హుజూరాబాద్ ప్రతిష్టాత్మకమైన దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి శాలపల్లి వరకు టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ తోరణాలను కట్టారు. వరంగల్–కరీంనగర్ రహదారి, జమ్మికుంట రోడ్ రహదారి గులాబీమయంగా మారింది. సభా వేదికకు సమీపంలో సీఎం కేసీఆర్ భారీ కటౌట్లను ఏర్పాటుచేశారు. 20 మంది ఐపీఎస్.. 4,600 మందికిపైగా పోలీసులు దళితబంధు సభా సజావుగా సాగేందుకు 4,600 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దళితబంధు ఎంపికపై ఇప్పటికే పలుచోట్ల ప్రజలు, పార్టీలు వరుసగా నిరసనలు చేస్తుండటంతో ముందుజాగ్రత్తగా భారీ రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆందోళనలు జరగవచ్చన్న నిఘావర్గాల సమాచారంతో డేగ కళ్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఒక అడిషనల్ డీజీ అధికారి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణ, రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం సీపీ విష్ణువారియర్, వరంగల్ సీపీ తరుణ్‌జోషితోపాటు పలువురు ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్‌లతో కలిపి మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారు. దాదాపు 60 మంది డీఎస్పీలు, 200 సీఐలు బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. వీరికితోడు ఆర్మ్డ్ ఫోర్సెస్, ఫైర్‌సిబ్బంది అదనం. -
‘దళిత బంధు’ కాదు.. ఎన్నికల బంధు
సాక్షి, వర్ధన్నపేట(వరంగల్): దళిత సాధికారత పేరుతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు దళిత బంధు పథకం అంటూ దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని, అది దళిత బంధు కాదని ఎన్నికల బంధు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు దుయ్యబట్టారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీసం దళిత రిజర్వేషన్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని, తదుపరి రాష్ట్రంలో ఉన్న దళితులందరికి వర్తింప చేసి తమ చిత్త శుద్ది చాటుకోవాలని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో కాకుండా దళిత రిజర్వేషన్ నియోజకవర్గంలో చేపట్టే విధంగా మంత్రులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. ఎన్నిక ముందే సీఎం కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. అధికారులు సైతం పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. సమ్మెట సుధీర్, బంగారు సదానందం, బెజ్జం పాపారావు పాల్గొన్నారు. ‘కోడ్’ కు ముందే పది లక్షలు పంపిణీ చేయాలి రాయపర్తి: ఎలక్షన్ కోడ్ రాకముందే హుజురాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించి ఎన్నికలకు వెళ్లాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నయా మోసానికి కేసీఆర్ శ్రీకారం దుగ్గొండి: హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నయా మోసానికి శ్రీకారం చుట్టారని బీఎస్పీ నాయకుడు గజ్జి దయాకర్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ ఓట్లు కొల్లగొట్టడానికి దళిత బంధు పథకం తీసుకువచ్చారన్నారు, ఏడేళ్లుగా గుర్తుకు రాని ఎస్సీలు ఇప్పుడు గుర్తుకు రావడానికి ప్రజలు గమనించాలన్నారు. మోసాలు, మాయలతోనే ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని ఏనాటికయినా ప్రజలు గుర్తించి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. -
తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది: ఈటల
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గొప్ప పార్టీలు ప్రజలను, వ్యవస్థను నమ్ముకుంటాయని, సీఎం కేసీఆర్ డబ్బు, మోసం, కుట్రలను నమ్ముకున్నారని మండిపడ్డారు.టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుట్రలకు చరమగీతం పాడే నియోజకవర్గం హుజురాబాద్ అని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
Etela Rajender: కేసీఆర్ పతనం కావడానికి హుజూరాబాద్ వేదిక కావాలి
సాక్షి, వీణవంక (కరీంనగర్): ‘రాష్ట్రంలో అధికారులను కూడా బానిసలుగా మార్చారు. మీ ప్రాప్తం లేకుండా వారికి మంచి పదవి కూడా రాని పరిస్థితి నెలకొంది. బానిసలుగా మారితే తప్పా పోస్టింగ్‌లు రాని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. వల్బాపూర్ గ్రామం నుంచి గంగారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్లూరులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని.. ఓటు మాత్రం తనకు వేయాలని కోరారు. 20 ఏళ్లలో ఎప్పుడూ గొడవలకు తావు లేదని.. ఎప్పుడైనా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఈసారి సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వృత్తి ధర్మాన్ని పక్కనపెట్టి కొంత మంది బానిసలుగా మారారని.. మండలానికి ఒకరి చొప్పున ఐదు మంది మంత్రులు, గ్రామానికి ఒక ఎమ్మెల్యే లెక్క గొర్ల మంద మీద తోడేలు పడ్డటు పడుతున్నారని విమర్శించారు. ఇంత దౌర్భాగ్యం దేశంలో ఎక్కడైన ఉందా అని ప్రశ్నించారు. కొంతమంది కురుస నాయకులు పోయినంత మాత్రాన పోయేది లేదని, హుజూరాబాద్‌లో ఏం జరుగుతోందని అమెరికాలో ఉన్నవారు, దేశవ్యాప్తంగా ఉన్నవారు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మగౌరవం దక్కించుకోవాలని అందరూ చూస్తున్నారని.. అందుకే కమలం గుర్తుకు ఓటు వేయాలని కో రారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. జమ్మికుంటలో ఘన స్వాగతం జమ్మికుంట: జమ్మికుంటలో మంగళవారం బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గాంధీచౌరస్తా వద్ద ముస్లిం మహిళలు స్వాగతం పలికారు. అనంతరం ఈటల గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెళ్లి సంపత్‌రావు, పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. చదవండి: వైఎస్సార్ చేయూతతో కోటి మందికి మేలు -
Etela Rajender: రాజీనామా ప్రకటన తరువాత తొలిసారి..
సాక్షి, కరీంనగర్: గులాబీ గూటికి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం కూడా ఖాయమైంది. బీజేపీలో చేరడానికి ముందు ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తన రాజీనామాతో ఆరు నెలలలోపు జరిగే ఉప ఎన్నికలో పోటీ చేసి విజయకేతాన్ని ఎగరేసి తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని రాష్ట్రంలో వినిపించనున్నట్లు ఆయన చెపుతున్నారు. ఇందులో భాగంగా రాజీనామా ప్రకటన తరువాత తొలిసారిగా మంగళవారం ఆయన తన సొంత గ్రామం కమలాపూర్‌కు విచ్చేశారు. ఈటలకు ఆయన వర్గీయులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలో విజయం అందిస్తామని ప్రజలు భరోసా ఇచ్చినట్లు వివరించారు. ఈ ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగనున్న సంగ్రామంగా అభివర్ణించారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధి చెపుతామని, తెలంగాణ ద్రోహులతో కేసీఆర్ రాజ్యమేలుతున్నారని ఆయన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. తనను టార్గెట్ చేసిన మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ గురించి మాట్లాడకుండా కేసీఆర్‌పైనే విమర్శలకు దిగారు. హుజూరాబాద్‌లోనే కొద్దిరోజులు మకాం వేసే ఆలోచనతో ఉన్న ఈట ల బుధవారం కూడా కమలాపూర్ మండలంలోనే ఉండనున్నారు. తరువాత నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో పర్యటించే అవకాశం ఉంది. కాగా ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. స్పెషల్ ఫోకస్.. హుజూరాబాద్‌లో ఇన్నాళ్లూ ఈటల వెంట ఉన్న నాయకుల్లో 90 శాతానికి పైగా టీఆర్ఎస్ గూటికి చేరారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలతోపాటు జెడ్పీటీసీలను ఈటల వెంట వెళ్లకుండా అడ్డుకోవడంలో మంత్రి గంగుల కమలాకర్ విజయం సాధించారు. గ్రామాల్లో ఈటలకు మంచి సంబంధాలు ఉండడంతో ఆయా గ్రామాల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. గ్రామాల వారీగా పెండింగ్ పనులు, ఇప్పటికే పనులు మొదలై ఆగిపోయినవి, సర్పంచులు, ఎంపీటీసీలు చేసిన కాంట్రాక్టులకు బిల్లులు విడుదల కాకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లా యంత్రాంగం ద్వారా ఆ పనులు పూర్తి చేయించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలు ప్రభుత్వం ద్వారా ‘సంతృప్తి’ చెందే విధంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను డిజైన్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 11 నుంచి టీఆర్ఎస్ ఆపరేషన్ ఈనెల 11వ తేదీన మంత్రులు హరీశ్‌రావు, గంగుల, కొప్పులతోపాటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్, ఇతర ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. పార్టీ కేడర్‌కు తామున్నామని ధైర్యం చెప్పడంతో పాటు స్థానిక పరిస్థితుల ఆధారంగా వచ్చే ఉప ఎన్నికలో హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థి విజయానికి సంబంధించిన రోడ్‌మ్యాప్ తయారు చేసే అవకాశం ఉంది. పార్టీ నాయకుల ద్వారా ఈటలపై విమర్శలు చేయించడమే కాకుండా కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న నాయకులను టీఆర్ఎస్లో చేర్పించుకొనే ఆలోచనతో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నాయకులను ఇప్పటి నుంచే హుజూరాబాద్‌లో తిష్ట వేయించే ఆలోచనతో ఉన్నారు. ఈటల వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ‘కౌంటర్ ఆపరేషన్’ నిర్వహించే ప్లాన్లను అమలు చేస్తున్నారు. ఈటలపై వ్యూహాత్మక దాడికి మంత్రుల సన్నాహాలు టీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఈటల ఎమ్మెల్యే పదవిని వదులుకొని టీఆర్ఎస్పై పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను రాజకీయంగా ఒంటరిని చేసే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో భేటీ అయిన ఇతర మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహిత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, వరంగల్‌కు చెందిన చల్లా ధర్మారెడ్డి, రమేశ్, కరీంనగర్ మేయర్ వై.సునీల్‌రావు తదితరులు హుజూరాబాద్‌లో అనుసరించబోయే వ్యూహాలపై చర్చించారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైన నేపథ్యంలో గత ఎన్నికల్లో అక్కడ బీజేపీకి గల బలంపై చర్చించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో నోటా కన్నా తక్కువగా 2 వేలలోపు ఓట్లు పోలు కాగా, ఎంపీ ఎన్నికల్లో మోదీ హవాలో కరీంనగర్‌ను గెలుచుకున్న బీజేపీ హుజూరాబాద్‌లో మాత్రం మూడోస్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఈటలతో బలం పెరుగుతుందే తప్ప బీజేపీ వల్ల ఈటలకు ఉపయోగం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల ఇమేజ్ను దెబ్బకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. చదవండి: హుజూరాబాద్ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల -
Huzurabad: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా..
భీమదేవరపల్లి: దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నూతన జిల్లాల ఏర్పాటు సమయంలో హుజురాబాద్ కేంద్రంగా పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని హుజురాబాద్ జిల్లా సాధన సమితి పేరిట ఉద్యమాలు జరిగాయి. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో.. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌పై ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే స్థానిక ప్రజలను టీఆర్ఎస్కు మరింత అనుకూలంగా మలుచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదన్న వాదన సైతం ఉంది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లా స్థానంలో హుజురాబాద్‌ను ప్రకటించే అవకాశాలు సైతం లేకపోలేదని తెలుస్తోంది. వంగరలోని పీవీ విగ్రహం పట్టించుకోని నాయకులు పీవీ మరణానంతరం సొంత పార్టీ నాయకులే ఆయనను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అయితే దక్షాణాది రాష్ట్రాల నుంచి అత్యున్నతమైన ప్రధాని పీఠాన్ని అధిష్టించిన పీవీపై టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆయన జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతో పాటుగా రూ.11కోట్ల వ్యయంతో పీవీ స్వగ్రామమైన వంగరలో పీవీ స్మృతివనం, భీమదేవరపల్లి కస్తూరీబాగాంధీ పాఠాశాల నుంచి వంగర వరకు డబుల్ బీటీ రోడ్డు, ఆర్చీ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టింది. ఈనెల 28న పీవీ శతజయంతి నేపథ్యంలో వంగరలోని పోలీస్‌స్టేషన్ ఎదుట పీవీ స్మృతివనం పనులు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే పీవీ నివాస గృహాన్ని వారి కుటుంబ సభ్యులు ఆధునీకరించడంతో పాటుగా పీవీ ఉపయోగించిన వస్తువులను హైదరాబాద్ నుంచి వంగరకు తరలించి భద్రపరిచారు. వాటిని పీవీ ఇంట్లో ఏర్పాటు కానున్న మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. 12 మండలాలతో నూతన జిల్లా.. కాగా హుజురాబాద్ జిల్లా ఏర్పాటుకు 12 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీవీ గ్రామమైన వంగరకు 8 కిలోమీటర్ల దూరంలోని హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించి అందులోకి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలు, కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శం కరపట్నం, సైదాపూర్, చిగురుమామిడితో పాటుగా భీమదేవరపల్లి మండల పరిధిలోని పీవీ స్వగ్రామం వంగర, వీరభద్రస్వామి దేవస్థానం కల్గిన కొత్తకొండను మండలాలుగా ఏర్పాటు చేసి మొత్తం 12 మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు కు అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. వంగరలోని పీవీ ఇల్లు శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించే అవకాశం ఈనెల 28న జరగనున్న పీవీ శతజయంతి ఉత్సవాల్లో హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఈటలకు చెక్ పెట్టడంతో పాటుగా ఈ ప్రాంత ప్రజలను టీఆర్ఎస్ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతం కావచ్చనే అభిప్రాయం ఆ పార్టీలో నెలకొంది. అయితే ఇప్పటికే పీవీ కూతురు సురభి వాణీదేవీకి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించిన విషయం తెలిసిందే. అయితే పీవీ శతజయంతి ఉత్సవాలకు వంగరకు సీఎం కేసీఆర్ హాజరై జిల్లా ప్రకటనతో పాటుగా ఈ ప్రాంత అభివృద్ధిపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు, రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. దీక్షకు సిద్ధమవుతున్న గ్రామస్తులు అయితే పీవీ పేరిట జిల్లా ఏర్పాటుతో పాటుగా వంగరను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కండె రమేశ్, కండె చక్రపాణి, కండె సుధాకర్ తదితరులు దీక్షకు సిద్ధమవుతున్నారు. వీరితో పాటు కొత్తకొండను మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చెప్యాల ప్రకాశ్, ఉప్పుల కుమారస్వామి, సిద్దమల్ల కృష్ణ తదితరులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: Huzurabad: ఉప ఎన్నికపై గులాబీ వ్యూహం -
Huzurabad: పట్టుబిగిస్తున్న అధిష్టానం.. ఈటల ఒంటరేనా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ కేడర్‌ను దూరం చేసేలా పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. రాజీనామా చేయకుండా పోటాపోటీగా ప్రెస్మీట్ల ద్వారా ఎదురుదాడి చేస్తున్న ఆయనను ఒంటరిని చేసేందుకు వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ రాజేందర్ పార్టీ వీడినా టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ చేజారకుండా హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ పట్టు బిగిస్తోంది. సుమారు వారం పాటు స్థబ్దత నెలకొనగా... రెండు రోజులుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు వేచిచూసే ధోరణి ప్రదర్శించిన నాయకులు ‘కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తాం... టీఆర్ఎస్లోనే ఉంటాం’ అని ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్‌పై ‘ఆపరేషన్ గంగుల’ పేరిట బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాపూర్ కమలాపూర్, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటుండగా, త్వరలోనే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ టి.హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ రంగంలోకి దిగుతారన్న ప్రచారం కమలాపూర్‌లో సాగుతోంది. ఫలిస్తున్న టీఆర్ఎస్ వ్యూహం.... మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురై ఇరవై రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న వ్యూహాలు సత్పలితాలు ఇస్తున్నాయి. రాజేందర్ తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లాక పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇరవై రోజుల పాటు వేచిచూసిన పలువురు టీఆర్ఎస్ సీనియర్లు బుధవారం ప్రెస్మీట్ల ద్వారా తమ వైఖరి స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాక తర్వాత తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేస్తుండగా, ఒక్కొక్కరుగా ఆయన శిబిరం నుంచి బయట పడుతున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సమయంలో రాజేందర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పలువురు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారు. కరీంనగర్లో మకాం వేసిన గంగుల కమలాకర్‌ను కలిసొచ్చి హుజూరాబాద్, కమలాపూర్‌ల్లో ప్రెస్మీట్లు పెడుతున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తాం టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న పలువురు సీనియర్లతో పాటు మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు గులాబీ జెండా కిందే పని చేస్తామని బుధవారం ఖరాకండిగా ప్రకటించారు. కమలాపూర్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీలోనే కొనసాగుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పింగిలి ప్రదీప్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధికా శ్రీనివాస్, వైస్‌చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, ఎంపీటీసీలు తాళ్లపెల్లి శ్రీనివాస్ తదితరులు ప్రెస్మీట్లో ఈటల రాజేందర్ వైఖరిని ఖండించారు. టీఆర్ఎస్లోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని, డబ్బులు, ప్రలోభాలకు లొంగే నాయకులు టీఆర్ఎస్లో, నియోజకవర్గంలో లేరని వెల్లడించారు. చదవండి: హుజురాబాద్: హరీశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారా? -
ఆత్మగౌరవం పేరిట కొత్త నాటకం: మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని, పనిచేసే వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం పార్టీలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం మీ సేవా కార్యాలయంలో హుజూరాబాద్ నియోజక వర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి పార్టీని వీడేది లేదని, సీఎం కేసీఆర్ బొమ్మ మీద గెలిచామని, జెండా ఏజెండా లేని ఈటల వెంట వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజక వర్గానికి చెందిన మెజార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, కన్నతల్లి లాంటి పార్టీని వీడేది లేదని చెబుతున్న కార్యకర్తల ధైర్యం ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. ఆత్మగౌరవం అంటూ సరికొత్త నాటకంతో ప్రజల ముందుకు వస్తున్న నాయకులను నమ్మవద్దని, కేసీఆర్ నాయకత్వంలోనే సమిష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని తనను విమర్శిస్తున్న వారు తమ తీరు మార్చుకోవాలని జిల్లా కేంద్రంలో జరిగిన ఉద్యమంలో తాను పాల్గొన్నానని, తనపై కేసులు సైతం నమోదయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పేర్యాల రవీందర్రావు, పొనగంటి మల్లయ్య, తదితరులు ఉన్నారు. సోమవారం మంత్రి గంగుల కలిసిన వారిలో హుజురాబాద్, జమ్మికుంట పీఏసీఎస్ చైర్మన్లు ఎడవెల్లి కొండల్‌రెడ్డి, పొనగంటి సంపత్, కమలాపూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇంద్రాసేనరెడ్డి, గోపాల్పూర్, శనిగరం, మరిపల్లి గూడెం, మాదన్నపేట్, అంబాల, చేల్పూర్, జూపాక గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలతోపాటు తదితరులు పాల్గొన్నారు. చదవండి: 2023 తర్వాత నువ్వు అధికారంలో ఉండవు: ఈటల గంగుల vs ఈటల.. ఎవరి బలమెంత? -
అయ్యో కొడుకా: తండ్రి ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా..
హుజూరాబాద్‌రూరల్: ప్రమాదవశాత్తు తండ్రి ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతిచెందిన ఘటన కందుగులలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మప్పు రాజు–రమాదేవి దంపతులకు వర్షిత, కార్తీకేయ(5) సంతానం. ప్రస్తుతం వరికోతల సమయం కావడంతో దంపతులిద్దరూ వ్యవసాయ పనుల్లో ఉన్నారు. ఆదివారం ఉదయం రమాదేవి ముందుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వచ్చి ఇంట్లో సేదతీరుతున్న సమయంలో రాజు కూడా ట్రాక్టర్ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ను ఇంటి ముందు షెడ్డులో రివర్స్‌లో పెడుతున్న సమయంలో తండ్రి రాకను గమనించిన కార్తీకేయ సంతోషంతో ఇంట్లో నుంచి పరుగెత్తుకొని రావడం తండ్రి గమనించలేదు. ప్రమాదవశాత్తు కార్తీకేయ పై నుంచి ట్రాక్టరు ట్రాలీ టైరు వెళ్లడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు టౌన్ సీఐ సదన్‌కుమారు తెలిపారు. చదవండి: ఇనుపరాడ్లతో ఆకతాయిల దాడి: ఆర్ట్ డైరెక్టర్‌కు గాయాలు -
మూడు గంటల్లోనే పెళ్లి పెటాకులై..
-
మూడు గంటల్లోనే పెళ్లి పెటాకులై..
సాక్షి, కరీంనగర్/హుజురాబాద్ టౌన్: పెద్దల మాట కాదనలేకనో, సమాజంలో ఎదురయ్యే అవమానాలు భరించలేకనో మూడు ముళ్ళ బంధంతో ఏడు అడుగులు నడిచింది ఓ యువతి. కానీ అంతలోనే వరుడి జీవితంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో వివాహమై మూడు గంటలు కూడా గడవకముందే పెళ్లి పెటాకులై.. ఆ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. సినిమాలోని సీన్లను తలపించే ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. హుజూరాబాద్‌కు చెందిన దివ్య వంశీ అనే యువకుడిని ప్రేమించింది. అయితే, తల్లిదండ్రుల మాట కాదనలేకనో లేదా బలవంతంగానో గానీ వారు కుదిర్చిన వివాహానికి అంగీకరించింది. దీంతో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్ కుమార్‌కు ఇచ్చి బంధువుల సమక్షంలో సోమవారం రాత్రి పెళ్లి జరిపించారు. (చదవండి: మంచం మీద ప్రేమ పెళ్లి: కారణం ఏంటంటే?.) అప్పటి దాకా అంతా బాగానే సాగింది. అయితే భాజా భజంత్రీల నడుమ అప్పగింతలు జరిగి ఊరేగింపు మొదలైన సమయంలో ప్రియుడు ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయింది. మద్యం మత్తులో ఉన్న ప్రియుడు వంశీ సీన్లోకి ఎంటరయ్యాడు. ‘‘నీవు ఎలా పెళ్లి చేసుకున్నావు’’ అంటూ హంగామా సృష్టించాడు. నవ దంపతులు పెళ్లికూతురు ఇంటి నుంచి ఊరేగింపుగా బయలుదేరుతుండగా కారును అడ్డుకున్నాడు. పెళ్లికూతురిని కిందకి దింపి వరుడి ఎదుటే ఆమెకు ముద్దుపెట్టాడు. ఆమెను తనకప్పగించి వెళ్లిపోవాలని గొడవకు దిగాడు. ఇంకేముంది ఈ ఘటన చూసిన పెళ్ళికొడుకు బిత్తరపోయాడు. (చదవండి: మొన్న పెళ్లి.. నిన్న ప్రేమపెళ్లి.. రెండు రోజుల్లో రెండు పెళ్లిళ్లు) వరుడి ఫిర్యాదు.. ప్రియుడితోనే ఉంటానన్న దివ్య దీంతో పెళ్లింట ఆందోళన నెలకొంది. సీన్ పెళ్లి ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు మారింది. మద్యం మత్తులో వంశీ అనే యువకుడు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించానంటూ గొడవకు దిగడంతో చేయడంతో పాటుగా.. తనపై దాడికి యత్నించాడని వరుడు ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు చేశాడు. దీంతో వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఇక్కడ వరకు ఓ రకంగా ఉన్న సీన్.. దివ్య ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. తన ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే.. తనకు పెళ్ళికొడుకు వద్దని ప్రియుడే కావాలని, అతనితోనే కలిసి ఉంటానని మరో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వధూవరులకు రాత్రి వరకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఇరు వర్గాలు రాజీపడలేదు. దీంతో వధువును అక్కడే వదిలేసి వరుడు మందమర్రి వెళ్లిపోయాడు. మరోవైపు, తల్లిదండ్రులు కూడా కుమార్తెను పోలీస్ స్టేషన్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్లో ఒంటరిగా మిగిలిన వధువును పోలీసులు కరీంనగర్‌లోని స్వధార్ హోంకు తరలించారు. ఆమె ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో బుడి‘బడి’ అడుగులు
సాక్షి, హుజూరాబాద్: అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులను బుడి‘బడి’ అడుగులు వేయిస్తున్నాయి. పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలతో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో కొంతమేరకు విద్య నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు చిన్నారులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించింది. ఎల్కేజీ, యూకేజీ తరగతుల బోధనకు కార్యాచరణ సిద్ధం చేసి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 752 ప్రధాన కేంద్రాలు ఉండగా, 25 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఏడు నెలల నుంచి ఏడాది వయసు లోపు విద్యార్థులు 5,416 మంది ఉన్నారు. ఏడాది నుంచి మూడేళ్లలోపు విద్యార్థులు 1,181 మంది ఉండగా, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు విద్యార్థులు 9,210 మంది ఉన్నారు. జిల్లా వివరాలు.. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 4 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 752 మినీ కేంద్రాలు 25 ఏడాదిలోపు విద్యార్థులు 5,416 మూడేళ్లలోపు విద్యార్థులు 1,181 ఆరేళ్లలోపు విద్యార్థులు 9,210 ఆటపాటలతో విద్య... అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థుల్లో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేలా బోధన జరుగుతోంది. చిన్నారులను గ్రూపులుగా విభజించి రోజూ కనీసం 2 గంటలకు తగ్గకుండా పీరియడ్లు విభజించుకుని బోధన చేస్తున్నారు. నర్సరీ పిల్లలకు ఆటపాటలు, బొమ్మలు, మూడు, నాలుగేళ్లలోపు వారికి ఎల్కేజీ, నాలుగు, ఐదేళ్లలోపు వారికి యూకేజీ పాఠాలు బోధిస్తున్నారు. ఆంగ్లంలో రూపొందించిన చార్టులు బోధనకు అనుగుణంగా తరగతి గదుల్లో ప్రదర్శిస్తున్నారు. ఆంగ్లం వర్క్ బుక్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, పుస్తకం, నేను నా పరిసరాల పేరుతో ఉన్న పుస్తకాలతో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నారు. చిన్నారులకు బోధన ఎలా చేయాలనే దానిపై అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా సంసిద్ధ పేరుతో ఉన్న పుస్తకాలను అందజేయగా, ఇందులో పాఠాలు ఏ విధంగా బోధించాలో రూపొందించారు. ఆ పుస్తకాల ఆధారంగా బోధన చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతోపాటు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యాబోధన పేరుతో మూడు రకాల అభ్యాస దీపికలను అందించారు. వీటితో బోధన చేస్తున్నారు. కొందరు చిన్నారుల తల్లిదండ్రులు మూడు, నాలుగేళ్లు దాటగానే చిన్నారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇదీ పేదవారికి భారమే అయినా పిల్లల భవిష్యత్ కోసం భరిస్తున్నామని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, బోధనకు చర్యలు చేపట్టగా, జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. విద్యార్థుల సంఖ్య పెరిగింది అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను కేంద్రాల్లోనే చెబుతున్నాం. తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్ పాఠశాలల ఫీజు భారం కొంత మేరకు తగ్గుతుంది. ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో చేపట్టిన ఆంగ్ల విద్య విధానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రభుత్వం ఆంగ్ల విద్య బోధనకు మాకు అందజేసిన సంసిద్ధ పుస్తకంలో చెప్పినట్లు బోధన చేస్తున్నాం. – రాణి, అంగన్వాడీ టీచర్,హుజురాబాద్ ఆంగ్ల బోధన మంచి ఉద్దేశం అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన అమలు చేయడం మంచి ఉద్దేశం. ఈ ఏడాది నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యాబోధన వర్క్‌బుక్స్ ద్వారా చేయడం జరుగుతుంది. విద్యార్థులకు అర్థమయ్యే విధానంలో ఆటపాటలతో కూడా విద్యా బోధన చేస్తున్నాం. ఆంగ్ల బోధన ద్వారా కేంద్రాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి. – బండి ఉష, ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయవంతంగా సాగుతోంది అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల విద్యాబోధన విజయవంతంగా సాగుతోంది. ప్రాథమిక స్థాయిలో విద్యా విధానంలో వస్తున్న పోటీ కారణంగా ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు ఆంగ్ల బోధన జరగాలని సంకల్పించి, అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధన అమలు చేస్తోంది. చిన్నారులకు అర్థమయ్యే రీతిలో ఫ్లాష్కారŠుడ్స ద్వారా, ఆట పాటలతో కూడిన విద్యాబోధన చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఆంగ్ల బోధన ఎంతగానో దోహదపడుతుంది. – శారద, ఐసీడీఎస్, సీడీపిఓ, హుజురాబాద్ -
నల్గొండపై నారాజయిన కేసీఆర్..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో అడుగులు ముందుకేస్తోంది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన అనుకూల ఫలితాలు మరింత విశ్వాసాన్ని పెంచాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క చోట మినహా మిగిలిన ఆరు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. హుజూర్‌నగర్‌లో ఆ పార్టీ ఓడిపోయినా.. తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. అంతే కాకుండా.. ఎంపీ స్థానం పరిధిలో పార్టీ గెలిచిన ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు 1.07లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ మెజా రిటీని కాపాడుకోవడంతో పాటు, కోదాడ, హుజూర్నగర్ సెగ్మెంటలో ఈసారి ఓట్లశాతం పెరిగితే..కచ్చితంగా గెలుస్తామన్న ధీమాలో టీఆర్ఎస్ ఉంది. విజయమే లక్ష్యంగా.. వ్యూహరచన గత సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ఏకంగా 1,93,156 ఓట్ల ఆధిక్యం వచ్చింది. టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటి ఎన్నికల విషయానికి వస్తే.. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. తిరిగి ఆయనే ఈసారి పోటీ చేస్తారా? లేక కొత్త అభ్యర్థిని ఎవరినన్నా ప్రకటిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. అదే మాదిరిగా గత ఎంపీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తేరా చిన్నపరెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయన కూడా ప్రస్తుతం టికెట్ రేసులో ఉన్నారు. ఇక, రెండో స్థానంలో నిలిచి 2.79లక్షల ఓట్లు పొందిన టీడీపీ ప్రస్తుతం జిల్లాలో కనుమరుగయ్యే దుస్థితిలో ఉనికి కోసం పోరాడుతోంది. ఈసారి ఆ పార్టీ నుంచి ఎవరూ బరిలోకి దిగే అవకాశమే కనిపించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ పోటీ చేయలేదు. ఈ ఎంపీ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీచేసే అవకాశాలు దాదాపు లేవని భావిస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు 2.60లక్షల ఓట్లు వచ్చాయి. అదే మాది రిగా.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ ఎన్నికల్లో 39వేల ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఎన్నికల బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ నిలిచే అవకాశాలు కూడా కనిపించడం లేదు. నాటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.72లక్షల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు సాధించిన గుత్తా, రెండో స్థానంలో నిలిచిన తేరా టీఆర్ఎస్లో ఉన్నారు. కాంగ్రెస్‌కు పోలైన ఓట్లలో సగం ఓట్లు, తేరాకు పోలైన ఓట్లలో మెజారిటీ ఓట్లు, అదే మాదిరిగా, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు పోలైన ఓట్లు... ఇలా అన్నింటినీ కలిపి వీటిలో తమకు ఎన్ని ఓట్లు పోలయ్యే అవకాశం ఉందో లెక్కగడుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపు కోసం పక్కా వ్యూహం రచిస్తోంది. సమన్వయం కోసం...! రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈలోగా.. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నా.. నల్లగొండ సమావేశాన్ని మాత్రం నిర్వహిస్తున్నారు. నల్లగొండపై ప్రత్యేక దృష్టి ఉన్నందునే ఈ సమావేశం జరగనుందని చెబుతున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆరు సెగ్మెంట్లు తమ చేతిలోనే ఉన్నా.. ఇప్పటి దాకా కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలవడం ద్వారా కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టాలన్న వ్యూహంతో సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపు తమదే అన్న సంకేతం ముందుగానే పంపించాలన్న ప్రణాళికల్లో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఇప్పటికే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఏడు నియోజకవర్గాల నేతలతో మాట్లాడడంతో పాటు సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడికక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సమావేశాలు జరిపి సమీకరణపై దృష్టిపెట్టారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గం నుంచి రెండువేల మంది, సమావేశం జరుగుతున్న నల్లగొండ నుంచి మూడు వేల మంది వెరసి పదిహేను వేల మందితోనే సన్నాహక సమావేశం జరపాలని నిర్ణయించారు. కానీ, అన్ని నియోజకవర్గాల నుంచి లక్ష్యానికి మంచి ఎక్కువ మందే హాజరు కానున్నారని పేర్కొంటున్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గం నుంచి పదివేల మందిదాకా వస్తున్నారని, అన్ని నియోజకవర్గాల నుంచి ఎంత మంది వస్తున్నారో అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. -
ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తించాలి
సాక్షి, హుజూరాబాద్ రూరల్: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నియామవళిని అందరూ పాటించాలని హుజూరాబాద్ టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి అన్నారు. గురువారం మండలంలోని కనుకులగిద్దె గ్రామంలో ఎన్నికల కోడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం, డబ్బులు సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసేలా ఎవరూ ప్రవర్తించిన ఉపేక్షించేది లేదన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని ఇప్పలనర్సింగాపూర్, బోర్నపల్లి, పోతిరెడ్డిపేట, వెంకట్రావ్పల్లి గ్రామాల్లో వేర్వేరు వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.15 వేల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్ రూల్స్‌ను పాటించని వాహనదారులపై ఈ–పెట్టి కింద కేసులను నమోదు చేయడంతోపాటు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సై చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త పంచాయతీలకు నిధుల కొరత!
సాక్షి, జమ్మికుంట రూరల్: నూతన గ్రామపంచాయతీలు కొలువుదీరి 40రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధిలో మాత్రం ఖాతా తెరవలేదు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్ అధికారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరుచుకోలేదు. దీంతో పల్లెల్లోని ఏచిన్న అభివృద్ధి పనికాని, మౌళిక వసతుల కల్పనకు గాని నోచుకోవ డం లేదు. మరోవైపు వేసవి సమీపించడంతో గ్రా మాల్లో తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో కనీసం తాగునీటి కొరత అధిగమించేందుకు కనీసచర్యలు చేపట్టాలన్నా, బ్యాంకు లా వాదేవీలు ఖాతాలు తెరవడం అనివార్యమైంది. ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటుచేసిన కొత్త పం చాయతీలకు విధులే తప్ప నిధులు లేని పరిస్థితి. గత అక్టోబర్‌లో పెద్ద పంచాయతీలను వీడదీసి నూతన పంచాయతీలను ఏర్పాటుచేశారు. మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా ఇందులో నుంచి కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి గ్రామా లు జమ్మికుంట మున్సిపాలిటీలో విలీనం కాగా నూతనంగా నాగారం, పాపక్కపల్లి, నాగంపేట, పాపయ్యపల్లి,వెంకటేశ్వర్లపల్లి, శంభునిపల్లి గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త, పాత పం చాయతీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాం ట్ రూపంలో నిధులు వస్తున్పప్పటికీ, కొత్త పం చాయతీలు నిధులు మంజూరుకు నోచుకోవడం లేదు. జిల్లాలో మూడు విడుతలుగా నిర్వహించిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనవరి 30న ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్త పాలకవర్గాలు కొ లువు దీరినప్పటికీ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంతవర కు సంబంధిత రికార్డులు కూడా అందుబాటులో లేవు. పాత పంచాయతీలను వీడదీసి నూతన పం చాయతీలు ఏర్పాటుచేసే సమయంలో కేవలం ఇంటిపన్నుల రిజిస్టర్ మాత్రమే ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉంచారు. పాలకవర్గాలు గ్రామాల్లో సాధారణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి కొంత నిధులు అందుబాటు లో ఉండాలి. కాని నేటివరకు కొత్త పంచాయతీల్లో బ్యాంకు ఖాతాలు తెరవలేదు. జాప్యం చేస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వం పంచాయతీ నిధులకు సంబంధించి ఎ లాంటి ఏర్పాటుచేయకపోవడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏం అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ప్రతి పంచాయతీలో నిధులు ఏర్పాటు చే యాలని తెలంగాణ పంచాయతీ రాజ్‌చట్టం స్ప ష్టంగా పేర్కొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో అధికార పార్టీలో ఉన్న సర్పంచ్‌లు ప్రభుత్వం జాప్యం చేస్తోందని చెప్పకనే చెబుతున్నారు. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు మంజూరు అవుతాయి. దీంతో పాటు గ్రామపంచాయాతీల్లో వసూలయ్యే అన్నిరకాల పన్నులను ప్రభుత్వ ట్రేజరీలో జమచేయాల్సి ఉంటుంది. కా నీ బ్యాంకు అకౌంట్లు ఉంటేనే నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. ఆడిట్ తప్పితే అంతే... గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి పంచా యతీ రాజ్‌చట్టం ప్రకారం నిధులు ఆదాయ, వ్యవ యాలకు సంబంధించి తప్పనిసరిగా ఆడిట్ చే యాల్సిందే. ఒకవేళ సకాలంలో ఆడిట్ చేయకపో తే సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు ఉంటాయని చ ట్టంలో స్పష్టంగా పేర్కొంది. నిధులు విడుదల చేయాలి నూతన గ్రామపంచాయతీలకు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి, నిధులు విడుదల చేయాలి. గ్రామంలో ఏ చిన్నపని చేయాలన్న నిధులు అవసరం. ఇప్పటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. నేడో, రేపో గ్రామసభలు ఉంటాయని అధికారులు తెలిపారు. గ్రామసభలో ఏం జరుగుతుందో చూస్తాం. – మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, సర్పంచ్, శంభునిపల్లి -
ఈత.. విషాదం
వారు ముగ్గురు స్నేహితులు.. ఎప్పుడూ కలిసి తిరి గే వారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెల వు ఇవ్వడంతో చెరువులో స్నానానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు చెరువులో ఉన్న గుంతలో పడి నీట మునిగిపోయారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్నబిడ్డలు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు వారిని చూసి గుండెలవిసేలా రోది స్తున్నారు. ‘ఇక మాకెవరు దిక్కు బిడ్డా.. ఎవల కో సం బతకాలి’ అని వారు రోదిస్తున్న తీరు అందరి నీ కలిచివేస్తోంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ము లున్నారు. ఈ హృదయ విదారక సంఘటన హుజూరాబాద్ మండలం కనుకులగిద్దలో శుక్రవారం జరిగింది. చింతకుంటలో జరిగిన మరో ప్రమాదంలో ఓ ఆరో తరగతి విద్యార్థి నీటి గుంతలో పడి చనిపోయాడు. హుజూరాబాద్ /హుజూరాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : హుజూరాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన అల్లి రమేశ్ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమేశ్, పుష్పలత దంపతులకు రోహి త్ (12), ప్రణీత్ (10) ఇద్దరే సంతానం. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో రోహిత్ ఆరో తరగతి చదువుతుండగా, ప్రణీత్ నాలుగో తరగతి చదువుతున్నా డు. ఇదే గ్రామానికి చెందిన దాసరి చంద్రారెడ్డి, సరోజన దంపతుల ఒక్కగానొక్క కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి(గణేశ్) (15) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరు ముగ్గురితోపాటు మరో ఇద్దరు శివాజీ, వినయ్ శుక్రవారం ఉదయం గిద్దె చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. రోహి త్, ప్రణీత్, గణేశ్ కలిసి చెరువులో దిగగా శివాజీ, వినయ్ ఒడ్డుపైనే కూర్చున్నారు. చెరువులో గుంత ఉన్న విషయాన్ని పసిగట్టలేక ముగ్గురు చిన్నారులు అందు లో మునిగారు. తాము మునిగిపోతున్నామని కేకలు వేయడంతో ఒడ్డుపై కూర్చున్న ఇద్దరు చిన్నారులు హు టాహుటిన గ్రామంలోకి పరుగెత్తుకొచ్చారు. ఈ విషయాన్ని అక్కడున్న వాళ్లకు చెప్పడంతో వారు చెరువు వద్దకు వెళ్లేసరికి ప్రణీత్, గణేశ్ నీటిలో పూర్తిగా మునిగి పోయారు. రోహిత్ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా బయటకు తీశారు. హుజూరాబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అత డు కూడా చనిపోయాడు. ప్రణీత్, గణేశ్‌ల ఆచూకీ కో సం చెరువులో గాలించగా వారి మృతదేహాలు కనిపిం చాయి. సంఘటన స్థలానికి హుజూరాబాద్ సీఐ శ్రీని వాస్, ఎస్సై జగదీశ్ వచ్చి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఒకే గ్రామానికి చెం దిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులకు కడుపు కోతే... అల్లి రమేశ్, పుష్పలత దంపతులు తమ కొడుకులు రోహిత్, ప్రణీత్‌లను అల్లారుముద్దుగా పెంచుకుంటూ కష్టపడి హుజూరాబాద్‌లో చదివిస్తున్నారు. కొడుకుల ను చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కడుపు కోతే మిగిలింది. ఒక్కగానొక్క కొడుకు. దాసరి చంద్రారెడ్డి, సరోజనలకు ఏకైక సంతానం గణే శ్. వీరిది వ్యవసాయ కుటుంబం. పెళ్లయిన తర్వాత ఆలస్యంగా జన్మించిన గణేశ్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కొడుకు కళ్లముందే ఉండాలని గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. చివరకు అతడు ఇలా చెరువులో తుది శ్వాస విడవడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలవు లేకున్నా బతికేవారు.. గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెలవు ఇవ్వడం తోనే ఈ ఘటన జరిగిందని, సెలవు లేకున్నా పిల్లలు బతికేవారని వారు తల్లిదండ్రులు రోదిస్తున్నారు. చింతకుంటలో ఆరో తరగతి విద్యార్థి.. కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : బోయినపల్లి మండ లం విలాసాగర్‌కు చెందిన సల్లా లచ్చయ్య, లత దంపతుల చిన్న కుమారుడు సాయికుమార్(12) ఓ నీటి గుంతలో పడి చనిపోయాడు. వీరు చింత కుంట శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. సా యికుమార్ ధన్గర్వాడి పాఠశాలలో చదువుతు న్నాడు. శుక్రవారం సోదరుడు సతీష్, స్నేహితులు నవీన్, కుమార్‌తో కలిసి ఇంటి సమీపంలో ఉన్న లోతైన గుంతకు ఈత కొట్టడానికి వెళ్లాడు. మొద ట సాయికుమార్, కుమార్ లోపలికి దిగారు. దిగి న వెంటనే మట్టిజారి మునిగిపోయారు. గమనిం చిన సతీష్ పరుగెత్తుకెళ్లి సమీపంలో ఉన్న ఒడిశా కార్మికులకు చెప్పగా వారు కుమార్‌ను కాపాడారు. సాయికుమార్ అప్పటికే మునిగిపోయాడు. కాసే పటికి అతడి మృతదేహం కనిపించింది. కొడుకు మృతదేహాన్నిచూసి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. -
జాతరో జాతర
‘పరిశుభ్రత’లో జిల్లాకు బహుమతులు జగిత్యాల అర్బన్/హుజూరాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు జగిత్యా ల మున్సిపాలిటీ, హుజూరాబాద్ నగర పంచాయతీకి బహుమతులు లభించాయి. బల్దియాలను క్లీన్‌సిటీగా మార్చాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం చెత్తపైకొత్త సమరం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ‘100 డేస్ క్లీన్‌సిటీ ఛాలెంజ్ అండ్‌గోల్డెన్ వీక్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 128 మున్సిపాలిటీలు నామినేషన్ వేయగా.. ఇందులో 27 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. వీటిలో జగిత్యాల మున్సిపాలిటీ కూడా ఒకటి. ఈ క్రమంలో ఫోర్త్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సోయిల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ హైదరాబాద్ జాయింట్ డెరైక్టర్ ఇ టీవల పట్టణాన్ని సందర్శించారు. వరంగల్ రీజియన్‌లోనే మున్సిపాలిటీకి రెండోస్థానం కల్పించి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు ప్రకటించారు. హుజూరాబాద్‌కు ఫోర్త్ ఐకాన్ ఇంటర్నేషనరల్ అవార్డు హుజూరాబాద్ నగరపంచాయితీకి ఫోర్త్ ఐకాన్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. కమిషనర్ గంగారాం ఆధ్వర్యంలో 65 రోజులుగా పట్టణంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి 30 తేదీ వరకు హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. గురువారం ముగింపు సమావేశం లో అవార్డులను మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ కమిషన్ డెరైక్టర్ చేతులమీదుగా జగిత్యాల మున్సిపాలిటీ కమిషనర్ జీఆర్.సురేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పర్యావరణ ఇంజినీర్ లావణ్య, హుజూరాబాద్ నగర పంచాయతీ కమిషనర్ గంగారాం అందుకున్నారు. కోహెడలోని శ్రీప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనర్సిసింహస్వామి జాతర జన సంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లాతోపాటు మహారా ష్ట్ర రాష్ట్రంలోని ముంబ యి, పుణే, షోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. తూర్పు నుంచి పడమరకు పారే సెలయేటిలో స్నానాలు చేశారు. ఎతైయిన కొండపై, చీకటి గుహలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్నారు. సింగరాయకొండను పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు కృషి చేస్తామని జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు తెలిపారు. గురువారం స్వామివారిని దర్శించుకున్నారు. - న్యూస్‌లైన్, కోహెడ -
కరెంట్ కట్.. నీళ్లు బంద్
హుజూరాబాద్, న్యూస్‌లైన్ : పల్లెలపై ప్రభుత్వ అలసత్వానికి తోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల జనం అగచాట్లు పడుతున్నారు. రూ.లక్షల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలోని ఫిల్టర్‌బెడ్‌కు మూడు రోజుల క్రితం కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, శంకరపట్నం మండలాల్లోని 30 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్‌కు సంబంధించి గతంలో రూ.14 లక్షల విద్యుత్ బకాయి ఉండడంతో ఓసారి కరెంటు సరఫరా నిలిపివేశారు. అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి రూ.6 లక్షలు చెల్లించగా, విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. తాజాగా మూడు రోజుల క్రితం మళ్లీ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఫిల్టర్‌బెడ్ నిర్వహణ స్తంభించిపోయింది. ఫిల్టర్‌బెడ్‌కు వచ్చే నీటిని క్లోరినేషన్ చేసి పైపులైన్ ద్వారా గ్రామాలకు పంపింగ్ చేయాల్సి ఉండగా, మొత్తానికే చీకట్లు కమ్ముకోవడంతో నీటి సరఫరా బందయింది. వాటర్ ప్లాంట్ల వైపు చూపు.. హుజూరాబాద్ నగరపంచాయతీతోపాటు మం డలంలోని తుమ్మనపల్లి, సింగాపూర్, బోర్నప ల్లి, ఇప్పలనర్సింగాపూర్, కాట్రపల్లి, కొత్తపల్లి, దమ్మక్కపేట, చిన్నపాపయ్యపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, పోతిరెడ్డిపేట, ధర్మరాజు పల్లి, రంగాపూర్, రాంపూర్, జూపాక, రాజపల్లి, చెల్పూరు, ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, జీల్గుల, జగన్నాథపూర్, భీమదేవరపల్లి మండ లం మాణిక్యాపూర్, కొప్పూరు, వంగర, రంగయ్యపల్లి, ముల్కనూరు, గట్ల నర్సింగాపూర్, శంకరపట్నం మండలం ఎరుకలగూడెం, మెట్పల్లి, ఆముదాలపల్లి గ్రామాలు పూర్తిగా తాగునీటి కోసం ఈ ఫిల్టర్‌బెడ్‌పైనే ఆధారపడతాయి. మూడు రోజుల క్రితం వచ్చిన నీటిని పొదుపు గా వాడుకున్నప్పటికీ నిన్నటికే అయిపోయా యి. నేటినుంచి అన్ని గ్రామాల్లో నీటి కటకట మొదలవుంది. దీంతో తమ అవసరాలను తీర్చు కునేందుకు జనం స్థానికంగా ఉన్న ప్యూరీఫైడ్ వాటర్ప్లాంట్లను ఆశ్రయించాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రతీసారి విద్యుత్ సరఫరా నిలుపుదల చేసే వరకు అధికారులు ఎదురుచూపులు చూడ డం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పుడు తాగునీటికి అల్లాడుతున్న 30 గ్రామాల ప్రజలకు ఏ సమాధానం చెపుతారో అధికారులే తేల్చుకోవాలి. త్వరలోనే విద్యుత్ బకాయి చెల్లించి నీటిసరఫరా అయ్యేలా చూస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ కరుణాకర్ ‘న్యూస్‌లైన్’తో వివరించారు. అందుకే మోడల్ రిజర్వాయర్ కావాలి ఫిల్టర్‌బెడ్ నీళ్లను నమ్ముకుంటే ప్రతీసారి సమస్యలే వస్తున్నాయి. హుజూరాబాద్ పట్టణంలో ఉన్న దాదాపు ఆరువేల ఇండ్లకు మంచినీటి సరఫరా శాశ్వతంగా ఉండాలంటే మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చితేనే ఫలితం ఉంటుంది. - అయిత హరీష్, మాజీ ఉపసర్పంచ్, హుజూరాబాద్